ఫ్యామిలీ షోలో అఖిల్ నోటి నుంచి పచ్చి బూతు.. రెమ్యునరేషన్ పై గొడవ.. బచ్చగాడివంటూ ఘోరంగా!

తెలుగులో అత్యధికంగా పాపులర్ అయిన రియాలిటీ షో బిగ్ బాస్. దీని ద్వారా ఎంతోమందికి మంచి గుర్తింపు వచ్చింది. పలువురు సినిమాల్లో అవకాశాలు రాబట్టుకుంటూ కెరీర్ ను సూపర్ సక్సెస్ తో రాణిస్తుంటే మరికొందరు వివిధ రకాలైన షోలలో పార్టిస్ పేట్ చేస్తూ అలరిస్తున్నారు. అలాంటి వారిలో అఖిల్ సార్థక్ ఒకరు. బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ లో రన్నరప్ గా నిలిచిన అఖిల్ సార్థక్ తర్వాత ఓటీటీ సీజన్ లో కూడా రన్నరప్ గా నిలవడం విశేషం. ప్రస్తుతం తేజస్వీ మదివాడతో జతకట్టి బీబీ జోడీ అనే డ్యాన్స్ షోలో హాట్ పర్ఫామెన్స్ తో అదరగొడుతున్నాడు. అయితే తాజాగా ఫ్యామిలీ షో అయిన యాంకర్ సుమ కనకాల నిర్వహిస్తున్న సుమ అడ్డాలో బూతు పదం వాడాడు. అలాగే అతనిపై తేజస్వీ చాలా సీరియస్ అయింది.

8 జోడీలు..

8 జోడీలు..

గతేడాది ప్రారంభమైన బీబీ జోడీ రియాలిటీ షోలో జంటలుగా.. అర్జున్ కల్యాణ్-వాసంతి కృష్ణన్, అవినాష్-యాంకర్ అరియానా గ్లోరి, అఖిల్ సార్థక్-తేజస్వి మదివాడ, ఆర్జే సూర్య-ఫైమా, రవికృష్ణ-భాను, ఆర్జే చైతూ-ఆర్జే కాజల్, మెహబూబ్-శ్రీ సత్య, కౌశల్-అభినయ శ్రీ మొత్తంగా 8 గ్రూపులు పాల్గొంటున్నాయి. అయితే వీరిలో ఒక జంట అయిన అఖిల్ సార్థక్-తేజస్వి మదివాడతోపాటు అరియానా గ్లోరి, రోల్ రైడా సుమ కనకాల హోస్ట్ చేస్తున్న సుమ అడ్డాకు తాజాగా హాజరయ్యారు.

 ఇంకాస్తా డోస్ పెంచుతూ..

ఇంకాస్తా డోస్ పెంచుతూ..

యాంకర్ సుమ చేసిన అనేక కార్యక్రమాలు, టీవీ షోలు చాలా వరకు సూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. అందులో 'క్యాష్' కూడా ఒకటని తెలిసిందే. బుల్లితెర, వెండితెరకు చెందిన సెలెబ్రిటీలు హాజరయ్యే ఈ షో విజయవంతంగా ప్రసారం అవుతోంది. దీనికి వచ్చిన వారికి సుమ చుక్కలు చూపిస్తూ ఫన్‌ను పంచుతోంది. ఇప్పుడు తాజాగా 'సుమ అడ్డా' ద్వారా ఇంకాస్తా డోస్ పెంచుతూ సెలబ్రిటీలను రోస్ట్ చేస్తుంది సుమ కనకాల.

నాకు కూడా ఆ డౌట్ ఉంది..

నాకు కూడా ఆ డౌట్ ఉంది..

సుమ అడ్డాకి తాజాగా అఖిల్ సార్థక్, తేజస్వీ, అరియానా గ్లోరి, రోల్ రైడా హాజరయ్యారు. అఖిల్, తేజస్వీలను ఉద్దేశిస్తూ వీళ్లిద్దరి గురించి కూడా జనాలందరికీ డౌట్ ఉంది కదా అని పంచ్ వేసింది సుమ కనకాల. అప్పుడు అఖిల్, తేజస్వి ఇద్దరు రొమాంటిక్ ఉండే వీడియోస్ చూపించారు. దీంతో నాకు కూడా ఉంది ఆ డౌట్ అని అరియానా గట్టిగా అరిచింది. నువ్ కూడా రిలేషన్ లో ఉంటున్నావ్ కదూ అని తేజస్వి ఎవరో పేరు చెప్పగా అప్పుడు మ్యూట్ చేశారు.

గెస్ చేయమని చెప్పగా..

గెస్ చేయమని చెప్పగా..

తేజస్వీ అలా అనడంతో.. చెబుతావేమో అనుకున్నా అని అఖిల్ అన్నాడు. నిజానికి నేను అడాగలనుకున్నది అది కాదు అని సుమ అంటే.. వీళ్లే ఓపెన్ అయిపోయారు అని రోల్ రైడా అన్నాడు. తర్వాత వాళ్లకు స్క్రీన్ పై ఉన్న పాటలను డడడడడడడ డిడిడిడిడిడి అంటూ మాత్రమే వాడుతూ చెబితే ఎదుటివారు గెస్ చేయాలని చెప్పింది సుమ. అప్పుడు అఖిల్ ఒక డైలాగ్ చెబుతూ డడడడెXX అంటూ ఒక బూతు అనబోయాడు. అఖిల్ అలా అనేసరికి అరియానా ఇబ్బందిగా నవ్వగా.. సుమ నోరు మూసుకుని మరి సైలెంట్ గా నవ్వింది.

 2 లక్షలు ఇచ్చి తీసుకొచ్చింది..

2 లక్షలు ఇచ్చి తీసుకొచ్చింది..

స్కిట్ లో భాగంగా తన షాప్ ఓపెనింగ్ కు అరియానాను పిలిచింది సుమ. అరియానను పిలిచి సుమ మాట్లాడుతుండగా.. అఖిల్ మధ్యలో వచ్చి రూ. 2 లక్షలు ఇచ్చి ఈమెనా తీసుకొచ్చింది నువ్వు అని అన్నాడు. దీంతో చెంపపగుల్తది నీ బడ్జెట్ కు నేనే ఎక్కువ అని అరియానా చాలా సీరియస్ గా అంది. దీంతో అఖిల్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు.

 ఇప్పుడిప్పుడు వచ్చినా..

ఇప్పుడిప్పుడు వచ్చినా..

నాకు ఒకటి అర్థం కాలే.. నీకు వాళ్లు ఏ టైమ్ చెప్పారు. నువ్వు వచ్చిన టైమ్ ఏంది అని కోపంతో అఖిల్ సార్థక్ అడిగాడు. ఇప్పుడిప్పుడు వచ్చిన బచ్చాగానివి నువ్వు.. ఏం మాట్లాడుతున్నావ్ అని చాలా కోపంతో తేజస్వి మదివాడ అంది. బచ్చాగాడినా అని అఖిల్ అంటే.. ఆ అని తేజస్వి అంది. వీళ్ల గొడవతో సుమ షాక్ అయి చూస్తుండిపోయింది. అనంతరం ఇద్దరు వాదించుకుంటూ ఉన్నారు.

షో నుంచి వెళ్లిపోయిన అఖిల్..

షో అయిపోయాక మాట్లాడతా నేను అని అఖిల్ అంటే.. లేదు ఇప్పుడే మాట్లాడు అఖిల్ అని తేజస్వి అంది. నాకు ఈ షో చేయాలని లేదు.. నేను అసలు ఇక్కడ ఉండను అనుకుంటూ షో నుంచి వెళ్లిపోయాడు. అఖిల్ అంటూ అరియానా, సుమ, రోల్ రైడా ఎంత పిలిచినా ఆగలేదు. దీంతో అఖిల్ వెనుకే సుమ, రోల్ రైడా వెళ్లారు. ఇలా సుమ అడ్డా ప్రోమో ముగిసింది. మరి ఇది స్కిట్ లో భాగమని డౌట్ వస్తున్నా అసలు విషయం తెలియాలంటే మార్చ్ 4న ప్రసారమయ్యే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X