అరియానా ఏడిస్తే నాకు ఎఫెక్ట్ అవుతుందా? టెన్షన్‌లో సోహెల్.. అఖిల్ వార్నింగ్
బిగ్‌బాస్ ఇంటిలో రోబో టాస్క్ సందర్భంగా జరిగిన గొడవ తర్వాత సయ్యద్ సోహెల్ ర్యాన్ కంగారులో కనిపించాడు. గొడవ పడటం వల్ల తనకు ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా అంటూ తనకు తాను మదనపడిపోయాడు. అదే విషయాన్ని అఖిల్‌తో మాట్లాడుతూ..
అరియానాతో గొడవ, ఆమె ఏడ్వడం వల్ల నాకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అంటూ అఖిల్‌తో సోహెల్ అన్నాడు. దాంతో నీ పాయింట్ నీవు చెప్పుకొన్నావు. అంతే.. ఆమె తన బాధను తాను చెప్పుకొంటూ ఏడుస్తున్నది. ఒకరు ఏడ్వడం వల్ల ఇక్కడ ఎవరికి ఎఫెక్ట్ కాదు అంటూ అఖిల్ సమాధానం చెప్పి ఊరడించే ప్రయత్నం చేశాడు.

నాకు ఏడుపు రాదా? నేను ఏడువ లేనా అంటూ సోహెల్ అంటే.. ఒకరు ఏడవటం వల్ల ఇక్కడ ఏమీ కాదు. అలాంటి రూలే లేదు ఇక్కడ. నీవు గమ్మున ఉండు. నీ మాటలు నీవు చెప్పుకొన్నావు. ఆమె మాటలు ఆమె చెప్పుకొంది. దాంతో సమస్య తీరిపొయింది అని అఖిల్ అంటుంటే.. సోహెల్ ఏదో చెప్పబోయాడు. దాంతో మీ వెర్షన్ మీరు చెప్పుకొన్నారు. ఇక అయిపోయింది. మాట్లాడకుండా ఉండు అంటూ సోహెల్‌కు అఖిల్ వార్నింగ్ ఇచ్చాడు.
అరియానాతో గొడవ తర్వాత సోహెల్ కాస్త టెన్షన్ పడినట్టు కనిపించాడు. కోపం చల్లారిన తర్వాత తాను ఏం చేశాననే విషయాన్ని గ్రహించాడు. అలా అరియానా, సోహెల్ తమ మధ్య జరిగిన విషయాన్ని తలచుకొంటూ ఇద్దరు మౌనంగా తమ పరిస్థితిని అంచనా వేసుకొంటూ కనిపించారు.


Click it and Unblock the Notifications











