నాతో మాట్లాడకు.. నన్ను వదిలేయ్.. మోనాల్‌పై అఖిల్ సీరియస్.. చిచ్చు పెట్టిన అవినాష్

బిగ్‌బాస్ ఇంటిలో ఎప్పటి మాదిరిగానే కిచెన్‌ వ్యవహారంలో సభ్యుల మధ్య వాదనలు లేచాయి. కెప్టెన్ అవినాష్ కిచెన్‌లో గిన్నెలు శుభ్రం చేసే విషయం.. సభ్యులకు సంబంధించిన ప్లేట్స్ విషయంపై వివరణ ఇచ్చారు. అయితే ప్లేట్స్, గిన్నెలు శుభ్ర చేసే విషయంలో వచ్చిన టాపిక్‌ మోనాల్, అఖిల్ మధ్య చిన్నపాటి వాగ్వాదానికి దారి తీసింది. దానికి కారణం ఏమిటంటే..

నా ప్లేట్ మిస్ ప్లేస్ అంటూ

నా ప్లేట్ మిస్ ప్లేస్ అంటూ

గిన్నెలు, ప్లేట్స్ సరిగా కడగడం లేదంటూ కిచెన్‌లో పనిచేసే వారిపై అఖిల్ సార్థక్ అసహనం వ్యక్తం చేశారు. ఇలా ఉంది కాబట్టే నా ప్లేట్ కడిగేసుకొని పక్కన పెట్టుకొంటున్నాను. దానిని ఎవరో మిస్ ప్లేస్ చేశారు అంటూ అఖిల్ గట్టిగా క్లాస్ పీకారు. దాంతో అవినాష్ గిన్నెలు సరిగా కడగాలి సూచించారు. ఎవరైనా ప్లేట్ పక్కన పెట్టుకొంటే దానిని తీయవద్దు అంటూ క్లారిటీ ఇచ్చారు.

అఖిల్‌కు ఇగో ఎక్కువ

అఖిల్‌కు ఇగో ఎక్కువ

అయితే అఖిల్ ప్లేట్ తాను పక్కన పెట్టలేదు. నాకు సంబంధం లేదు అంటూ సోహైల్, అవినాష్‌తో మోనాల్ చెప్పింది. అయితే ఆయన ఎవరిని పాయింట్ అవుట్ చేయడం లేదు అంటూ అవినాష్ సర్దిచెప్పబోయాడు. ఆ సందర్భంగా తమకు దూరంగా ఉన్న అఖిల్‌ను ఉద్దేశించి ఆయనకు ఇగో ఎక్కువ అంటూ కామెంట్ చేసింది.

నాలా ఎందుకు కూల్‌గా ఉండరు

నాలా ఎందుకు కూల్‌గా ఉండరు

మోనాల్ కామెంట్‌పై అవినాష్ స్పందిస్తూ.. నాలా అందరూ ఎందుకు కూల్‌గా ఉండరు అంటే.. మనలాగా ఎందుకు కూల్ ఉండరు అంటూ సోహైల్ మధ్యలో దూరారు. నీవు కూల్‌గా ఉంటావా? సోహైల్‌ను అవినాష్ ప్రశ్నించాడు. దాంతో అవును సోహైల్ కూల్ బాయ్ అంటూ మోనాల్ అంటే.. సోహైల్ కూల్ కాదు.. అఖిల్ కూల్ అంటూ అవినాష్ టాపిక్‌ను పెంచుతూ రెచ్చగొట్టాడు.

మోనాల్ మళ్లీ ఆ టాపిక్ తీయకు

మోనాల్ మళ్లీ ఆ టాపిక్ తీయకు

ఆ తర్వాత అఖిల్‌ వద్దకు వెళ్లి ప్లేట్ తాను మిస్ ప్లేస్ చేయలేదని మోనాల్ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. అందుకు అసహనం వ్యక్తం చేస్తూ నేను నిన్ను అనలేదు. నాతో ఆ టాపిక్ తీయకు అని అఖిల్ అన్నాడు. అయితే నాతో మాట్లాడవా అంటే లేదు.. నీతో మాట్లాడే ఉద్దేశం లేదు. నాకు కొంచెం స్పేస్ ఇవ్వు.. తర్వాత మాట్లాడుతాను.. నన్ను వదిలేయ్ అంటూ అఖిల్ చెప్పారు.

నీవు చెబితే వినే పరిస్థితిలో లేవు

నీవు చెబితే వినే పరిస్థితిలో లేవు

అఖిల్‌కు క్లారిటీ ఇచ్చేందుకు మోనాల్ ప్రయత్నిస్తూ.. నేను ఏదైనా తప్పు చేస్తే నీవు చెబుతావు కదా అంటే.. ఏదైనా చెబితే వినే పరిస్థితిలో నీవు లేవు. అప్పుడు చెప్పినా వేస్ట్. దాని వల్ల ప్రయోజనం లేదు అంటూ అఖిల్ అన్నాడు. దాంతో సారీ అఖిల్ అంటూ మెనాల్ చెప్పినా.. ఇక నన్ను కాసేపు వదిలేయ్.. నీతో వాదన చేసినా లాభం లేదంటూ కామెంట్ చేశాడు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Episode 13 Highlights | బిగ్ బాస్ పనిష్మెంట్ | Filmibeat Telugu
ప్రతీ విషయంలో తల దూర్చకు

ప్రతీ విషయంలో తల దూర్చకు

అఖిల్ అలా అనడంతో మోనాల్ చిన్న బుచ్చుకొని.. నాతో మాట్లాడవా? నేను వెళ్లిపోతాను అని లేవబోయింది. నీవు ఎందుకు అలా ప్రతీది నీకు అన్వయించుకొంటావు. నీవు ప్రతీ విషయంలో తలదూర్చుతావు అంటూ మోనాల్‌కు క్లాస్ పీకాడు. అయితే నాతో మాట్లాడవా మరోసారి అంటే ఇప్పుడు నీతో మాట్లాడే మూడ్ లేదు. ఇప్పటికి ఇంతటితో వదిలేయ్ అంటూ అఖిల్ అనడంతో మోనాల్ ఓ రకమైన ఫీలింగ్‌తో అక్కడి నుంచి వెళ్లిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X