బిగ్ బాస్ షోలో భారీ ట్విస్ట్: ఆ కంటెస్టెంట్‌ను ఇంటి నుంచి పంపించేందుకు మాస్టర్ ప్లాన్.!
తెలుగులో ఇప్పటి వరకు ఎన్నో రకాల కార్యక్రమాలు ప్రసారం అయ్యాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకున్నాయి. ఈ జాబితాలోకే వచ్చి చేరుతుంది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. సరికొత్త కంటెంట్‌తో ప్రసారం అవుతున్నప్పటికీ.. దీనిని ఇక్కడి ప్రేక్షకులు ఆదరించారు. ఫలితంగా మన భాషలో బిగ్ బాస్ మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక, నాలుగో సీజన్ సైతం అదే రెస్పాన్స్‌తో సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో షోలో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. అది కూడా ఓ కంటెస్టెంట్‌ను పంపించేందుకే అని తెలుస్తోంది. ఆ వివరాలు మీకోసం.!

కలిసొచ్చిన కాలం.. బిగ్ బాస్‌దే పైచేయి
మిగిలిన అన్ని భాషలతో పోలిస్తే తెలుగులో బిగ్ బాస్ షోకు కాస్త ఎక్కువ స్పందనే వస్తోంది. అందుకే ఈ షో పేరు మీద ఎన్నో రికార్డులు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ మధ్య మొదలైన నాలుగో సీజన్‌కు కూడా అంతే స్పందన వస్తోంది. కరోనా ప్రభావంతో సినిమాలు లేకపోవడం దీనికి బాగా కలిసొస్తోంది. అందుకే సగటున 9 రేటింగ్ పాయింట్లతో ఈ సీజన్ సత్తా చాటుతోంది.

కఠిన పరిస్థితులు.. నిర్వహకుల ప్లాన్లు
ఎన్నో అనుమానాల నడుమ బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రారంభం అయింది. దీనికితోడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ రూపంలో మరో ప్రమాదం వచ్చింది. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో తెలివిగా ఆలోచించిన షో నిర్వహకులు సరికొత్త ప్లాన్లతో ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించే అంశాలనే హైలైట్ చేసి చూపించారు. ఫలితంగా షోను సక్సెస్ చేస్తున్నారు.

ప్రయోగాలు విఫలమైనా మార్పు లేదు
గత సీజన్లతో పోలిస్తే ఈ సారి టాస్కుల్లో వైవిధ్యాన్ని చూపిస్తున్నారు. లవ్ ట్రాకులపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అలాగే, ఎప్పటిలానే కంటెస్టెంట్ల మధ్య గొడవలను కూడా బాగా చూపిస్తున్నారు. వీటికితోడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలను కూడా ముందే దించారు. వీటిలో కొన్ని ప్రయోగాలు విఫలం అయ్యాయి. అయినప్పటికీ షో మాత్రం మంచి రెస్పాన్స్‌తో ముందుకు సాగుతోంది.

అదొక్కటే అనుమానాలు రేకెత్తిస్తుంది
బిగ్ బాస్ షో విషయంలో ప్రేక్షకులు వేసిన అంచనాలు తప్పవు. మూడు సీజన్లుగా దీనికి అలవాటు పడిన వారు.. వచ్చే ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో కూడా ముందే అంచనా వేసేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎలిమినేషన్ విషయంలో వాళ్ల లెక్క పక్కాగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సీజన్‌లో కొంత మంది బయటకు వెళ్లడం షో ఓటింగ్ సిస్టమ్‌పై అనుమానాలు రేకెత్తించింది.

షోలో భారీ ట్విస్ట్.. కంటెస్టెంట్లంతా షాక్
సరికొత్త టాస్కులు, లవ్ ట్రాకులతో పాటు ఊహించని సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగుతోంది బిగ్ బాస్ సీజన్ 4. ఈ క్రమంలోనే తాజాగా ఈ షోలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. అర్ధరాత్రి కంటెస్టెంట్లు అందరినీ నిద్ర లేపిన బిగ్ బాస్.. బ్యాగులు సర్ధుకోమని చెప్పడంతో.. మీ జర్నీకి అడ్డు అని భావిస్తున్న కంటెస్టెంట్ ఎవరో చెప్పి, దానికి గల కారణాలు వివరించమని ఆదేశించాడు.

ఆ కంటెస్టెంట్‌ను పంపించేందుకు ప్లాన్.!
అఖిల్ సార్థక్‌ను ఎలిమినేట్ చేసినట్లు నమ్మించి, అతడిని సీక్రెట్ రూమ్‌లో ఉంచబోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వారం అతడు నామినేట్ కాలేదు. దీంతో బిగ్ బాస్ ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు తెలుస్తోంది. బలమైన కంటెస్టెంట్ అయిన అఖిల్‌కే ఎక్కువ ఓట్లు వచ్చే ఛాన్స్ ఉండడంతో, అతడినే పంపించబోతున్నారని ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.


Click it and Unblock the Notifications











