ఓ ఊపు ఊపేసిన రష్మీ.. సుధీర్‌తో కలిసి అదరగొట్టేసింది.. మొత్తం ఈవెంట్‌కే హైలెట్!!
ప్రోగ్రాం ఏదైనా, ఈవెంట్ ఎలాంటిదైనా సరే అక్కడ రష్మీ సుధీర్ ఉన్నారంటే అది హిట్టే. అలా వీరిద్దరి పేరు మీద ఎన్నో ఈవెంట్లు బుల్లితెరపై సూపర్ హిట్ అయ్యాయి. ఓ సారి అందరూ కలిసి వీరికి పెళ్లి చేశారు. ఇంకోసారి అలాంటిదే వీరిద్దరిపై ప్లాన్ చేశారు. పండుగ ఏదైనా, ఈవెంట్ ఎవరు చేసినా వారి కాన్సెప్ట్‌లో రష్మీ సుధీర్ ఉంటారు. అలాగే ఈ సారి దసరా ఈవెంట్‌కు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ టీం రెడీ అయింది.

అక్కా ఎవరే అతగాడు..
ప్రతీసారి స్పెషల్ ఈవెంట్‌లో రోజానే సందడి చేస్తుంటుంది. అయితే ఈ సారి అక్కా ఎవరే అతగాడు అంటూ సంగీతను పట్టుకొచ్చారు. ఇందులో రష్మీ, వర్షిణిలు సంగీతకు చెల్లెళ్లుగా కనిపించబోతోన్నారు. ఇక ఆ ఇద్దరికి వరుడిని వెతికే పనిలో సంగీత ఉన్నట్టుగా ఈ ఈవెంట్‌ను ముందుకు తీసుకుపోయేలా ఉన్నారు.

నవదీప్ స్పెషల్..
అదిరింది షో నుంచి బయటకు వచ్చిన ఈటీవీ దసరా ఈవెంట్లో ఇలా భాగమయ్యాడు. నవదీప్ కూడా ఏమీ తక్కువ తినలేదన్నట్టుగా వచ్చీ రావడంతోనే వర్షిణి, రష్మీలకు గట్టిగా పంచ్‌లు వేశాడు. యాంకరింగ్ రాదన్నట్టుగా వర్షిణికి, వయసై పోయిందన్నట్టుగా రష్మీకి కౌంటర్లు వేశాడు.

సంగీత కూడా..
సంగీత జబర్దస్త్ స్టేజ్ మీద మెరిసిన సంగతి తెలిసిందే. నాగబాబు వెళ్లాక ఓ రెండు మూడు వారాలు జడ్జ్‌గా రోజాతో పాటు నవ్వులు చిందించింది. సంగీతమంటే మ్యూజిక్.. ఈ సంగీత అంటే మ్యాజిక్ అంటూ రాగానే ఓ పంచ్ వేసింది. తెలుగులో మాట్లాడటం కొంత కష్టమైనా కూడా ఓ మోస్తరుగా పర్వాలేదనిపించింది.
Recommended Video

రష్మీ రచ్చ రచ్చ..
అక్కా ఎవరే అతగాడు ఈవెంట్‌లో రష్మీ కాస్తా సమంతలా మారిపోయింది. రంగస్థలంలోని రంగమ్మ మంగమ్మా అనే పాటకు డ్యాన్స్ చేసింది రష్మీ. సమంత ధరించిన క్యాస్టూమ్స్ లాంటివే ధరించి అదిరిపోయే స్టెప్పులు వేసింది రష్మీ. ఇక చివర్లో సుధీర్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో పర్ఫామెన్స్ పీక్స్‌లో చేరింది. చూస్తుంటే ఈ ఈవెంట్ మొత్తానికి రష్మీ పర్ఫామెన్స్ హైలెట్ అయ్యేలా ఉంది.


Click it and Unblock the Notifications











