Bigg Boss Telugu 6: బాత్రూంలో గలీజ్ పనులు.. ఆమె బండారం బయటపెట్టిన నాగార్జున

బిగ్ బాస్.. ఇంగ్లీష్ షో ఆధారంగా వచ్చి.. తెలుగులోనూ పరిచయమైన షో. కొందరు కంటెస్టెంట్లను ఓ ఇంట్లో ఉంచి.. వాళ్లకు చిత్ర విచిత్రమైన టాస్కులు ఇచ్చి.. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న వాళ్లను విజేతగా ప్రకటించడమే దీని నేపథ్యం. హీందీలో ఎప్పుడో వచ్చినా.. తెలుగులో మాత్రం ఐదేళ్ల క్రితమే ఇది వచ్చింది. అనూహ్యంగా ఆరంభంలోనే దీనికి ప్రేక్షకుల భారీ రెస్పాన్స్‌ను అందించడంతో మన షో దేశంలోనే నెంబర్ వన్‌గా ఎదిగిపోయింది. దీంతో నిర్వహకులు సీజన్ల మీద సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో దానిని మొదలు పెట్టారు. ఇక, శనివారం జరిగిన ఎపిసోడ్‌లో ఓ కంటెస్టెంట్‌పై నాగార్జున సీరియస్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీకోసం!

ఆరంభంలోనే సరికొత్త ప్లాన్లతో

ఆరంభంలోనే సరికొత్త ప్లాన్లతో


బిగ్ బాస్ షోకు మిగిలిన భాషల కంటే తెలుగులోనే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. అందుకు అనుగుణంగానే దీన్ని సరికొత్త కంటెంట్‌తో తీసుకు వస్తున్నారు. ఇక, గత వారంలో మొదలైన ఆరో సీజన్‌ను కూడా ఎన్నో ప్రయోగాలతో నడిపిస్తున్నారు. దీన్ని మరింత కొత్తగా మార్చేందుకు వినూత్నమైన ప్లాన్లతో ముందుకు వస్తున్నారు. దీంతో ఈ ఎపిసోడ్ ఆసక్తికరంగానే సాగిపోతోంది.

ఫస్ట్ టైం అంత మందితో రచ్చ

ఫస్ట్ టైం అంత మందితో రచ్చ


ఆరో సీజన్‌లో రికార్డు స్థాయిలో 21 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. అందులో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు హౌస్‌లోకి ప్రవేశించారు.

మొదటి వారమే జనరంజకంగా

మొదటి వారమే జనరంజకంగా


బిగ్ బాస్ షో అంటే ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. అందులోనూ ఐదు సీజన్లను నేషనల్ రేంజ్‌లో హిట్లుగా మార్చుకున్న దీనికి అభిమానులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నారు. దీంతో ఆరో సీజన్‌పై ఆరంభం నుంచే భారీ బజ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఈ సీజన్‌ను సరికొత్త టాస్కులు, మార్పులతో జనరంజకంగా నడుపుతున్నారు.

బాత్రూం గొడవతో రచ్చ షురూ

బాత్రూం గొడవతో రచ్చ షురూ


సోమవారం జరిగిన ఎపిసోడ్‌లో ఓ చిన్న సంఘటన పెద్ద గొడవకు దారి తీసింది. ఫైర్ బ్రాండ్ గీతూ రాయల్ బాత్రూంలోకి వెళ్లిన సమయంలో కొన్ని వెంట్రుకలు కనిపించాయి. దీంతో ఆమెకు ఎంతో కోపం వచ్చింది. దీంతో బయటకు వచ్చిన వెంటనే ఇనాయా సుల్తానాపై ఆమె ఫైర్ అయింది. అంతేకాదు, తిక్కదానా తిక్కదానా అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడి పరువు తీసేసింది.

నాగార్జున క్లాస్... ఆమెతో లాస్ట్

నాగార్జున క్లాస్... ఆమెతో లాస్ట్


సాధారణంగా బిగ్ బాస్ షోలో వారానికి రెండు రోజుల పాటు అక్కినేని నాగార్జున సందడి చేస్తుంటాడు. ఇందులో భాగంగానే శనివారం రాత్రి జరిగిన ఎపిసోడ్‌లో ఆయన తనదైన డ్యాన్స్‌తో అలరించారు. అంతేకాదు, హౌస్‌లో ఉన్న అందరు కంటెస్టెంట్లకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ క్రమంలోనే గీతూ రాయల్‌ను చివరి వరకూ ఆపి ఆ తర్వాత ఆమెతో మాట్లాడారు.

 గలీజ్ పనులపై నాగ్ ఆగ్రహం

గలీజ్ పనులపై నాగ్ ఆగ్రహం

శనివారం జరిగిన ఎపిసోడ్‌లో గీతూ రాయల్‌పై అక్కినేని నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నువ్వు బాత్రూంలో గలీజ్ పని చేశారంటూ కోప్పడడం బాగానే ఉంది. కానీ, అది చెప్పిన తీరు మాత్రం అస్సలు బాలేదు. తిక్కదానా తిక్కదానా అని పదే పదే అన్నావు. ఆ తిక్క ఉంది తనకు కాదు.. నీకే తిక్క ఉంది. అందుకే అందరూ తిక్కవాళ్లలా కనిపిస్తున్నారు' అంటూ క్లాస్ పీకేశాడు.

అవి పడేసింది నువ్వు కదా అని


ఆ తర్వాత హోస్ట్ అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. 'బాత్రూంలో జుట్టు ఉందని ఇనాయాతో గొడవకు దిగావు బానే ఉంది. కానీ, ఆ తర్వాత నువ్వు తుడుచుకున్న టిష్యూలను ఎక్కడ పడితే అక్కడ పడేశావు కదా. మరి వాటి సంగతేంటి. నీతులు చెప్పాలంటే ముందు అవి మనం పాటించాలి కదా' అంటూ మరో విషయాన్ని నాగార్జున బయటపెట్టి గీతూ రాయల్ గాలి తీసేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X