Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ హౌస్‌లోకి నాగ్ కొడుకు, కోడలు.. అన్‌లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ పక్కానా?!

Bigg Boss Telugu 8: బుల్లి తెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. దేశవ్యాప్తంగా పలు భాషల్లో ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షో తెలుగు ప్రేక్షకులను కూడా అట్రాక్ట్ చేసింది. కోటాది మంది ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న ఈ షో తెలుగులో సక్సెస్ పుల్ గా 7 సీజన్లను కంపింట్ చేసుకుంది. మరోసారి బీబీ లవర్స్ ను ఎంటర్టైన్ చేయడానికి 8 వ సీజన్ తో ముందుకు వస్తుంది. ఈ సారి తగ్గేదేలే అనేలా.. అన్ లిమిటెడ్ ఎంటర్టైన్ మెంట్ అందించడానికి సిద్దమైంది.

ఇప్పటికే ఈ బిగ్గెస్ట్ షో కు సంబంధించిన పలు అప్టేట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ రియాలిటీ షో పై మరింత క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి. ఈ మోస్ట్ పాపులర్ షో సీజన్ 8 కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన షో ప్రోమోలు బీబీ లవర్స్ కు తెగ ఆకట్టుకున్నాయి. గత ఏడు సీజన్లలో అందించిన ఎంటర్టైన్మెంట్ కు ఏ మాత్రం తగ్గకుండా.. అన్ లిమిటెడ్ ఫన్ అందించాలని ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ టీమ్. అందుకు తగ్గట్టుగానే.. కంటెస్టెంట్స్ లను పర్పెక్ట్ గా సెలెక్ట్ చేసి.. హౌస్ లోకి పంపనున్నారు.

Akkineni Naga Chaitanya actress Shobhita Dhulipala will participate in Bigg Boss Telugu season 8

ఇదిలా ఉంటే.. బ్లాక్‌బస్టర్ రియాలిటీ షో తెలుగు 'బిగ్‌బాస్' గ్రాండ్ ఓపెనింగ్ సెప్టెంబర్ 1 వ తేదీన ప్రసారం కానుంది. ఈ అన్ లిమిటెడ్ ఎంటర్టైన్ మెంట్ సీజన్ కు కూడా టాలీవుడ్ అగ్ర హీరో నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. అయితే.. హౌస్‌లోకి ఎవరెవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా మోస్ట్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురి వ్యక్తుల పేర్లు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్నాయి. అందులో మాటీవీలో ప్రసారమయ్యే 'కృష్ణ ముకుందా మురారి' సీరియల్ ఫేమస్ నటి యష్మి గౌడ్, విష్ణుప్రియ, హీరో ఆదిత్య ఓం, కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్‌ కంటెస్టెంట్‌ నిఖిల్, ఆర్ జే శేఖర్ బాషా,
నాగమణికంఠ, అభయ్ నవీన్ అడుగుపెట్టనున్నారంట.

వీరితో పాటు డాన్సర్, యూట్యూబర్ అయిన నైనిక అనసూరు, హీరో అభిరామ్ వర్మ, యూట్యూబర్ కిరాక్ సీత, సోషల్ మీడియా ఫేమ్ బెజవాడ బేబక్క, స్టార్ క‌మెడియ‌న్ అలీ త‌మ్ముడు ఖయ్యూం, విష్మయ శ్రీ, యాంకర్ విష్ణు ప్రియలు కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారు. మ‌రి వీరిలో బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లేది ఎవ‌రో తెలియాలంటే రేప‌టి వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే. ఇకపోతే ఈ క్రమంలో మరో వార్త నెట్టింట ఆసక్తిని రేకెత్తిస్తోంది. నాగార్జున తనయుడు నాగ చైతన్య అండ్ కాబోయే కోడలు శోభితా ధూళిపాళ్ల బిగ్‌బాస్ హౌస్‌లోకి రాబోతున్నారంటూ టాక్ వినిపిస్తుంది.

Akkineni Naga Chaitanya actress Shobhita Dhulipala will participate in Bigg Boss Telugu season 8

ఏంటీ చై-శోభితా హౌస్‌లో రానున్నారా? వీళ్లు కూడా గేమ్ ఆడబోతున్నారా? అనే సందేహం చాలా మందిలో తలెత్తే ఉంటుంది. అయితే అసలు విషయం ఏంటంటే..? బిగ్ బాస్ షో రేటింగ్ కోసం ప్రతి ఏటా బీబీ నిర్వహకులు కొత్త కొత్త ఫ్లాన్లు వేస్తుంటారు. అందులో భాగంగానే సెలబ్రిటీలను స్టేజ్‌పై ఎక్కిస్తారన్న విషయం తెలిసిందే. కాగా ఇందులో భాగంగానే జస్ట్ కంటెస్టెంట్లను అండ్ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడానికి మాత్రమే చైతన్య-శోభితాను బిగ్‌బాస్ స్టేజ్ ఎక్కబోతున్నారట.

అంతేకాకుండా మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. హాట్ హాట్ గా ఉండే బీబీ హౌస్ లోకి పంపించి త్వరలో పెళ్లి చేసుకోబోయే ఈ లవ్ బర్డ్స్ ను ఓ స్పెషల్ ఈవెంట్ చేయించాలని కూడా ప్లాన్ చేయాలని అనుకుంటున్నారట. మరీ ఈ వార్త ఎంత వరకు వాస్తవమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరలవుతోంది. ఈ ఇంట్రెస్టింగ్ మ్యాటెర్ తెలిసినప్పటి నుంచి బీబీ లవర్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారంట. ఇక అక్కినేని అభిమానులైతే ఫుల్ ఎగ్జైయింట్‌గా ఫీల్ అవుతున్నారట. ఇక గతంలో నాగార్జున మాజీ కోడలు సమంత సరదాగా బిగ్ బాస్ హోస్టింగ్ చేయడంతో మంచి రేటింగ్‌తో దూసుకుపోయిందన్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. అక్కినేని హీరో నాగ చైతన్య నటి శోభిత ధూళిపాళ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. వీరి ఎంగేజ్మెంట్ ఇటీవల ఆగ‌స్టు 8న జ‌రిగిన విషయం తెలసిందే. కొంత‌మంది కుటుంబ‌స‌భ్యుల స‌మ‌క్షంలో ఈ వేడుక నిర్వ‌హించారు. పెళ్లి మాత్రం ఇప్ప‌ట్లో లేదని, ఇద్దరు కాస్త టైం తీసుకుంటార‌ని స‌న్నిహితులు చెప్పారు. కాగా.. ఈ జంట ఎప్పుడు పెళ్లి పీఠలు ఎక్కబోతున్నారు. వాళ్ల పెళ్లి ముహూర్తం ఎఫ్పుడని, వెడ్డింగ్ ఎక్కడ అని తెలుసుకోవడానికి తెగ ఆరాటపడుతున్నారు అక్కినేని ఫ్యాన్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X