Bigg Boss Telugu 8 Prize Money : చివరి గేమ్‌లో విజేతగా గౌతమ్ .. ప్రైజ్ మనీ ఎంతంటే?

బిగ్‌బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌కు విన్నర్ ఎవరు కానున్నారు? బిగ్‌బాస్ చివరిలో ట్విస్ట్ ఇస్తాడా అంటూ ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. అన్నింటికి మించి అసలు ఇంతకీ బిగ్‌బాస్ తెలుగు 8 విన్నర్‌కు ప్రైజ్ మనీ ఎంత? దీనితో పాటు ఇంకేమీ ఇస్తారంటూ చర్చించుకుంటున్నారు. దీంతో ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ నాగార్జున ప్రైజ్ మనీ ఎంత అనేది చెప్పేశారు.

15వ వారం నాటికి నిఖిల్, నబీల్, ప్రేరణ, అవినాష్, గౌతమ్‌లు మాత్రమే కంటెస్టెంట్స్‌గా మిగిలి టాప్‌ 5లో చోటు దక్కించుకున్నారు. అయితే అవినాష్ టికెట్ టూ ఫినాలే గేమ్స్‌లో అందరికంటే ముందే ఫైనల్‌లో అడుగుపెట్టేశాడు. అయితే ప్రధానంగా నిఖిల్, గౌతమ్‌ల మధ్యే హోరాహోరీ పోరు జరుగుతోంది. ఇదిలాఉండగా.. బిగ్‌బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్ట్‌గా ఎవరు రాబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా బిగ్‌బాస్ లవర్స్ జుట్టు పీక్కుంటున్నారు.

Akkineni nagarjuna announced that the bigg boss telugu 8 winner will receive Rs 55 lakhs as Prize Money

దీనికి ఫైనల్ ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందే స్టార్ మా యాజమాన్యం చెక్ పెట్టింది. గ్రాండ్ ఫినాలే గెస్ట్‌గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వస్తున్నట్లు అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇప్పటికే సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటకు తోడు గత సీజన్‌లో పల్లవి ప్రశాంత్ అభిమానులు విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో పోలీసులు అన్నపూర్ణ స్టూడియోస్ పరిసరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

ఇక ఫైనల్ సందర్భంగా ఈ సీజన్‌లో పాల్గొని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ను హోస్ట్ అక్కినేని నాగార్జున వేదిక మీదకు పిలిచారు. ఈ సందర్భంగా బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు చోటు చేసుకున్న గొడవలు, వాగ్వాదాలు, సరదా సంఘటనలను ఓ వీడియో రూపంలో ప్లే చేసి చూపించడంతో వారంతా కంటతడి పెడతారు. ప్రతి ఒక్కరూ ఎమోషనలై , కన్నీరు తుడుచుకుంటూ కనిపిస్తారు. లోపల ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ కూడా బాగా ఎమోషనల్ అవుతారు.

అయితే సీజన్ 8లో విజేత గెలుచుకోబోయే ప్రైజ్ మనీని నాగార్జున రూ. 54,99,999 అని ప్రకటించారు. అయితే ఒక రూపాయి పెంచి రౌండ్ ఫిగర్‌గా రూ.55,00,000గా మారుస్తానని నాగ్ చెప్పగా.. అలా చేయాలంటే ఓ టాస్క్ ఇస్తున్నానని నేను ఏం చెబితే దానికి మీరు రివర్స్‌లో చేయాలని అంటాడు. సరదాగా సాగిన ఈ గేమ్‌లో డాక్టర్ బాబు గౌతమ్ విజేతగా నిలిచాడు. దీంతో ఒక రూపాయి పెంచి ప్రైజ్ మనీని రూ. 55,00,000గా ఫిక్స్ చేశారు అక్కినేని నాగార్జున. ఈ మొత్తం బిగ్‌బాస్ తెలుగు హిస్టరీలోనే అత్యధికమని నాగ్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X