అఫీషియల్: బిగ్‌బాస్ హోస్ట్‌గా నాగార్జున.. టెలివిజన్ నాకు కొత్తగా కాదు అంటూ

Recommended Video

Bigg Boss Telugu 3 : King Akkineni Nagarjuna As #BiggBossTelugu3 Host

తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్‌ ప్రారంభం కాబోతున్నది. గత రెండు సీజన్లలో విశేష ఆదరణ పొందిన ఈ షో మూడో సీజన్‌కు సర్వం సిద్ధమవుతున్నది. టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున ఇప్పటి వరకు ఊహాగానాలకే పరిమితమైంది. అయితే ఊహాగానాలకు బలం చేకూరుస్తూ స్టార్ మా టీవీ యాజమాన్యం హోస్ట్‌గా నాగార్జున ప్రకటిస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది. గతంలో సీజన్ 1 కు జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నాని హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్టార్ మా అధికారికంగా ప్రకటనను విడుదల చేసింది. ప్రకటనలో ఏం చెప్పారంటే..

మూడో సీజన్‌కు హోస్ట్‌గా

మూడో సీజన్‌కు హోస్ట్‌గా

టాలీవుడ్ హీరో నాగార్జున హోస్ట్‌గా బిగ్‌బాస్ మూడో సీజన్‌ను నడిపించబోతున్నాడు. వారసత్వంతో సంబంధం లేకుండా కూడగట్టుకొన్న అభిమానం, సామాజికంగా సంపాదించుకొన్న పేరు, ప్రఖ్యాతులను కలిగిన ఉన్న ఆయన ఈ రియాలిటీ షోను మరో లెవెల్‌కు తీసుకెళ్తానడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల విడుదలైన లోగో లాంచ్ టీజర్, హోస్ట్ టీజర్ ఫిల్మ్‌తో విపరీతమైన క్రేజ్ లభించింది. భారీగా అంచనాలు నెలకొన్నాయి అని స్టార్ మా ప్రకటనలో పేర్కొన్నది.

అద్భుతమైన వినోదాన్ని అందిస్తాం

అద్భుతమైన వినోదాన్ని అందిస్తాం

బిగ్‌బాస్ మూడో సీజన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో స్టార్ మా తెలుగు బిజినెస్ హెడ్ అలోక్ జైన్ మాట్లాడుతూ.. అద్భుతమైన వినోదాన్ని అందిస్తామని మా ప్రేక్షకులకు మాట ఇస్తున్నాం. ఇప్పటి వరకు విశేషంగా ప్రేమను కురిపించి ఆదరణ చూపించారు. ఎలాంటి వివాదం లేకుండా మమ్మల్ని అతిపెద్ద తెలుగు టెలివిజన్ బ్రాండ్‌గా ఆశీర్వదించారు అని అన్నారు.

 విలక్షణమైన స్టైల్‌కు చిరునామా

విలక్షణమైన స్టైల్‌కు చిరునామా

బిగ్‌బాస్ 3 షోకు నాగార్జునను హోస్ట్‌గా అందించేందుకు హ్యాపీగా ఫీలవుతున్నాం. విలక్షణమైన స్టయిల్‌కి పర్యాయపదం, మంచితనానికి నిర్వచనం, నాలెడ్జికి నిదర్శనంగా తీర్చి దిద్దేందుకు ఈ షోను నాగార్జున మరింత ఎనర్జిటిక్‌గా మార్చబోతున్నారు. వినూత్నమైన అనుభూతిని కలిగించబోతున్నాడు అని అలోక్ జైన్ వెల్లడించారు.

 నా జీవితంలో ఎన్నో ప్రయోగాలు

నా జీవితంలో ఎన్నో ప్రయోగాలు

బిగ్‌బాస్ హోస్ట్‌గా వ్యవహరించడంపై నాగార్జున మాట్లాడుతూ.. ఎన్నో విషయాల్లో అనేక ప్రయోగాలు చేశాను. నా కెరీర్‌లో ఎన్నో అనుభూతులు, అనుభవాలు ఉన్నాయి. నాకు టెలివిజన్ కొత్త కాదు. బిగ్‌బాస్ లాంటి షో చేయడం కొత్త అనుభూతి. ఇలాంటి షో లో నేను ఓ పార్ట్ అయినందుకు చాలా ఆనందంగా ుంది. ఈ కొత్త ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నాను అని అన్నారు.

స్టార్ మా టెలివిజన్ గురించి

స్టార్ మా టీవీ నెట్ వర్క్ గురించి ప్రస్తావిస్తే.. 21 సెంచురీ ఫాక్స్‌ లాంటి దిగ్గజ మీడియాకు అనుబంధంగా కోట్లాది మంది ప్రేక్షకులకు వినోదాన్ని పండిస్తున్నది. తెలుగులో విలక్షణమైన, ఆహ్లాదకరమైన కార్యక్రమాలను, సినిమాలను అందిస్తూ ముందుకెళ్తున్నది. బిగ్‌బాస్ లాంటి ఎన్నో ఇతర తెలుగు రియాలిటీ షోలను పరిచయం చేసి నంబర్ వన్ ర్యాంకింగ్‌ను సొంతం చేసుకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X