బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా క్రేజీ స్టార్.. మీడియా రూమర్లకు చెక్.. త్వరలోనే అఫీషియల్‌గా!

Recommended Video

Bigg Boss Telugu Season 3 : Tollywood Top Hero To Host ? || Filmibeat Telugu

తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో బిగ్‌బాస్ రియాలిటీ షో బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఇప్పటికే రెండు బిగ్‌బాస్ సీజన్లకు అనూహ్యమైన స్పందన వచ్చింది. బిగ్‌బాస్ 1 సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ కాగా, బిగ్‌బాస్ 2 కోసం నేచురల్ స్టార్ నానిని రంగంలోకి దించారు. కాగా ఇప్పుడు బిగ్‌బాస్3 కోసం ఎవరు హోస్ట్ అనే విషయం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో రకరకాల పేర్లు మీడియాలో వినిపించాయి. అయితే హోస్ట్ ఎంపిక కార్యక్రమాన్ని బిగ్‌బాస్ నిర్వాహకులు పూర్తి చేశారని, త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తారని సమాచారం. బుల్లి తెర ప్రేక్షకులు వేచి చూస్తున్న అభిమాన హోస్ట్ ఎవరంటే ..

తెరపైకి ముగ్గురి పేర్లు.. వెంకటేష్ నో

తెరపైకి ముగ్గురి పేర్లు.. వెంకటేష్ నో

బిగ్‌బాస్ 3 షోకు నాగార్జున, వెంకటేష్, అనుష్క లాంటి పేర్లు మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే గతేడాది ఫైనల్‌కు వచ్చిన విక్టరీ వెంకటేష్ పేరు మీడియాలో నానింది. F2 తర్వాత వెంకటేష్ క్రేజ్ పెరగడంతో బుల్లితెర ప్రేక్షకుల వద్దకు వచ్చే ప్లాన్ చేసినట్టు వార్తలు గుప్పుమన్నాయి. కానీ తన ముందుకు హోస్ట్ ప్రపోజల్ రాగా, బిజీగా ఉన్నానని వెంకటేష్ సున్నితంగా తోసిపుచ్చినట్టు సమాచారం. అలాగే అనుష్క హోస్ట్ అనే వార్త ఆదిలోనే ఫేక్ అని తేలిపోయింది.

 అక్కినేని నాగార్జునతో

అక్కినేని నాగార్జునతో

హోస్ట్ రేసులో మిగిలింది అక్కినేని నాగార్జున మాత్రమే కావడంతో ఇక ఆయనే అంటూ వార్తలు బలంగా ఊపందుకొన్నాయి. వాస్తవానికి మా టీవీతో టాలీవుడ్ మన్మథుడికి మంచి అనుబంధం ఉంది. గతంలో యాజమానిగానే కాకుండా మీలో ఎవరు కోటీశ్వరుడుతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొన్నాడు. ఇప్పటికే ప్రేక్షకులతో మంచి అనుబంధం ఏర్పడటంతో బిగ్‌బాస్ నిర్వాహకులు ఆయనను సంప్రదించారట.

 బిగ్‌బాస్ హోస్ట్‌గా మన్మథుడు

బిగ్‌బాస్ హోస్ట్‌గా మన్మథుడు

బిగ్‌బాస్ నిర్వాహకులు ప్రతిపాదనకు నాగార్జున సానుకూలంగా స్పందిచారట. అంతేకాకుండా భారీ రెమ్యునరేషన్‌ కూడా డిమాండ్ చేశారు. అందుకు స్టార్ మా యాజమాన్యం కూడా ఒకే అనడంతో ఎలాంటి తదుపరి చర్చలు లేకుండా బిగ్‌బాస్ 3 కార్యక్రమానికి హోస్ట్‌గా అక్కినేని నాగార్జున కన్ఫర్మ్ అయ్యారు అనేది పక్కా న్యూస్. త్వరలోనే అధికారికంగా నిర్వాహకులు వెల్లడించనున్నారు.

 మన్మథుడు 2 షూటింగ్‌లో బిజీ బిజీగా

మన్మథుడు 2 షూటింగ్‌లో బిజీ బిజీగా

ప్రస్తుతం అక్కినేని నాగార్జున మన్మథుడు 2 సినిమా కోసం పోర్చుగల్‌లో ఉన్నారు. గత నెలరోజులుగా ఈ సినిమా షూటింగ్ అక్కడే నిర్విరామంగా జరుగుతున్నది. ఈ సినిమా యూనిట్ మే 15 నుంచి 20 తేదీలలో హైదరాబాద్‌కు తిరిగి రానున్నది. నాగార్జున హైదరాబాద్‌కు చేరుకోగానే బిగ్‌బాస్3 హోస్ట్ గురించి అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.

బిగ్‌బాస్‌కు క్రికెట్ దెబ్బ

బిగ్‌బాస్‌కు క్రికెట్ దెబ్బ

కాగా, వాస్తవానికి బిగ్‌బాస్3 షో జూన్ రెండోవారంలో ప్రారంభం కావాల్సింది. కానీ ఐపీఎల్, ప్రపంచ క్రికెట్ టోర్ని ప్రారంభం కానున్న నేపథ్యంలో జూలై మూడో వారానికి వాయిదా వేసినట్టు సమాచారం. ప్రపంచ క్రికెట్ టోర్ని మధ్యాహ్నం నుంచి రాత్రి అర్ధరాత్రి వరకు సాగే అవకాశం ఉండటంతో బిగ్‌బాస్ షోపై దెబ్బ పడే అవకాశం ఉందనే విషయంతో ఆలస్యంగా మొదలుపెడుతున్నట్టు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X