నాగార్జున బిగ్ బాస్ రెమ్యూనరేషన్ లీక్: గత సీజన్‌ కంటే ఎక్కువ.. ఎన్టీఆర్ కంటే తక్కువ!

కొన్నేళ్లుగా తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ షో హవాను చూపిస్తోంది. గతంలో ఎన్నో వినోదాత్మక కార్యక్రమాలు వచ్చినా.. దీని దూకుడు ముందు చిన్నబోయాయి. ఫలితంగా చెరిగిపోని ఎన్నో రికార్డులను క్రియేట్ చేసి తిరుగులేని షోగా వెలుగొందుతోందిది. ఇక, ఈ రియాలిటీ ఇంత సక్సెస్ అయిందంటే దాని వెనుక షోను నడిపించిన హోస్టుల పాత్ర కూడా చాలా ఉంది. మరీ ముఖ్యంగా రెండేళ్లుగా నాగార్జున దీన్ని నడిపిస్తున్నారు. తాజా సీజన్ పూర్తయిన నేపథ్యంలో ఆయన అందుకున్న రెమ్యూనరేషన్ వివరాలు బయటకు వచ్చాయి. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

నాలుగు సీజన్లు... ముగ్గురు హోస్టులు

నాలుగు సీజన్లు... ముగ్గురు హోస్టులు

బిగ్ బాస్ షో తెలుగులో నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇది ఇంతలా సక్సెస్ అయిందంటే దానికి హోస్టులు కూడా కారణమే అని చెప్పొచ్చు. మొదటి సీజన్‌ను జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌ను నేచురల్ స్టార్ నాని, మూడు నాలుగు సీజన్లను సీనియర్ హీరో అక్కినేని నాగార్జున తమదైన శైలి హోస్టింగ్‌తో అద్భుతంగా నడిపించడం వల్లే ఇది ఈ స్థాయిలో ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ ఇదే

జూనియర్ ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ ఇదే

సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రసారం అయ్యే బిగ్ బాస్ షోను తెలుగులోకి తీసుకొచ్చిన సమయంలో ఎన్నో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే, అందరి అనుమానాలకు పుల్‌స్టాప్ పెట్టేసి, షోను విజయవంతం చేశాడు అప్పటి హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్. ఆ సీజన్ కోసం అతడు ఎపిసోడ్‌కు రూ. 40 లక్షల చొప్పున రూ. 8 కోట్లు వరకూ తీసుకున్నాడట. ఈ సీజన్ పది వారాలే జరిగింది.

రెండో సీజన్‌కు నాని ఎంత చార్జ్ చేశాడు

రెండో సీజన్‌కు నాని ఎంత చార్జ్ చేశాడు

కొన్ని వివాదాల నడుమ మొదలైంది రెండో సీజన్. దీనికి నేచురల్ స్టార్ నాని హోస్టింగ్ చేశాడు. ఇందులోనూ అతడు సహజసిద్ధమైన హోస్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. అంతేకాదు, అప్పడు కౌశల్ ఆర్మీ ట్రోలింగ్ చేస్తున్న పరిస్థితుల్లోనూ చక్కగా షోను నడిపించాడు. ఇక, ఈ సీజన్ కోసం నాని ఎపిసోడ్‌కు 10 లక్షల రూపాయల చొప్పున రూ. 3 కోట్లు చార్జ్ చేశాడట. ఇది 15 వారాలు జరిగింది.

నాగార్జున మొదటిసారి అందుకున్నది

నాగార్జున మొదటిసారి అందుకున్నది

మొదటి రెండు సీజన్లను ఇద్దరు కుర్ర హీరోలు హోస్ట్ చేయగా.. మూడో సీజన్‌ను సీనియర్ హీరో అక్కినేని నాగార్జున నడిపించాడు. ఈ సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్ నుంచి రికార్డుల మీద దండయాత్ర చేసిన ఆయన.. వీకెండ్ ఎపిసోడ్‌లను ఎంతో స్పెషల్‌గా మార్చాడు. ఈ సీజన్ 15 వారాల పాటు జరిగింది. ఇందుకు గానూ నాగ్.. ఎపిసోడ్‌కు 12 లక్షల చొప్పున రూ. 3.50 కోట్లు తీసుకున్నాడట.

నాలుగో సీజన్‌కు నాగ్ రెమ్యూనరేషన్

నాలుగో సీజన్‌కు నాగ్ రెమ్యూనరేషన్

మూడు సీజన్లకు ముగ్గురు హీరోలు హోస్ట్ చేయగా, నాలుగో దాన్ని మరో హీరో నడిపిస్తాడని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, దానికి భిన్నంగా దీన్ని కూడా అక్కినేని నాగార్జునే నడిపించాడు. ఇది కూడా 15 వారాల పాటు జరిగింది. దీనికి ఎపిసోడ్స్ ప్రకారం కాకుండా రూ. ఏడు కోట్లు రెమ్యూనరేషన్‌గా అందుకున్నాడట ఆయన. అంటే గత సీజన్ కంటే ఎక్కువే అయినా ఎన్టీఆర్ కంటే తక్కువే.

అదనంగా లాభాలు.. నాగ్ ప్లాన్ సూపర్

అదనంగా లాభాలు.. నాగ్ ప్లాన్ సూపర్

నాగార్జున రెమ్యూనరేషన్‌గా తీసుకున్నది రూ. 7 కోట్లు మాత్రమే. అయితే, రెండో సీజన్ నుంచి నాలుగో దాని వరకు వరుసగా అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే బిగ్ బాస్ సెట్ వేస్తున్నారు. సో.. దీనికి రెంట్ కూడా ఆయన ఖాతాలోకే వెళ్లింది. హోస్టుగా, స్టూడియో ఓనర్‌గా నాగ్ బాగానే వెనకేశాడని ప్రచారం జరుగుతోంది. ఇక, మొదటి సీజన్‌ను లూనావాలాలో నడిపించిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X