Bigg Boss Telugu Season 6: ఫస్ట్ ప్రోమో వచ్చేసింది.. ఆప్పగింతలతో సడన్ ట్విస్ట్ ఇచ్చిన నాగ్!

ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో కూడా మరొక సీజన్ అట్టహాసంగా మొదలు కాబోతోంది. ఇప్పటివరకు వచ్చిన 5 సీజన్స్ ఏ స్థాయిలో సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఓటీటీలో వచ్చిన నాన్ స్టాప్ షో కూడా మంచి క్రేజ్ అందుకుంది. ఇక ఇప్పుడు ఆరో సీజన్ తో నిర్వాహకులు రెడీ అవుతున్నారు. ఇటీవల నాగార్జునతో ఒక ప్రోమో కూడా షూట్ చేసిన విషయం తెలిసిందే.

ఇక బిగ్ బాస్ ఫస్ట్ ప్రోమోను కొద్దిసేపటి క్రితం విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అప్పగింతల సమయంలో కూతురిని పంపించే క్రమంలో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అందరూ ఏడుస్తూ ఉండగా మీరు కూడా నాతక్ వచ్చేయండి నాన్న అంటూ కూతురు ఏడుస్తుంది. ఇక తల్లి పక్కనే ఉండి ఫోన్ చూడగానే అందరూ మాయమవుతారు.

Akkineni Nagarjuna bigg boss telugu season 6 first promo released

ఇక తర్వాత నాగార్జున మెల్లగా సలాడ్ తినుకుంటూ వచ్చి.. అప్పగింతలు అయ్యే వరకు కూడా ఆగలేకపోయారంటే అక్క‌డ ఆట మొద‌లైన‌ట్టే. లైఫ్‌లో ఏ మూమెంట్ అయినా బిగ్ బాస్ త‌ర్వాతే. బిగ్ బాస్ సీజ‌న్ 6.. ఎంట‌ర్‌ట‌న్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్‌.. అంటూ నాగార్జున తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. చూస్తూ ఉంటే ఈసారి ఎంటర్టైన్మెంట్ విషయంలో కూడా మరింత డోస్ పెంచడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ రియాల్టీ షో సెప్టెంబరు రెండో వారంలో టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హౌస్ లోకి రాబోయే కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా దాదాపు ఫైనల్ అయినట్లు సమాచారం. ఎక్కువగా టెలివిజన్ రంగంలో గుర్తింపు అందుకున్న నటీనటులను అలాగే యూట్యూబర్స్ ను కంటెస్టెంట్ గా తీసుకురావడానికి నిర్వాహకులు సిద్ధమైనట్లు టాక్ వస్తోంది. అలాగే ఒక ప్రముఖ మాజీ యాంకర్ కూడా ఈసారి బిగ్ బాస్ షోలో హైలెట్ కాబోతున్నట్లు అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. మరి అందులో నిజం ఎంతో తెలియాలి అంటే షో మొదలయ్యే వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X