Bigg Boss 6: ఇంకాస్త రెమ్యునరేషన్ డోస్ పెంచిన నాగార్జున.. మొత్తం ఎంత రాబోతోందంటే?
టెలివిజన్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 6వ సీజన్ మరికొన్ని రోజుల్లో మొదలు కాబోతున్న విషయం తెలిసిందే. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్న ఈ కాంట్రవర్సీస్ షో ఈసారి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది అనేది అందరిలోనూ ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. అయితే గతంలో కంటే నిర్వాహకులు ఈసారి విభిన్నమైన కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇక వారి రెమ్యునరేషన్స్ విషయాలలో కూడా భారీగా మార్పులు జరగబోతున్నట్లు తెలుస్తోంది. నాగార్జున కూడా ఈసారి ఇంకాస్త ఎక్కువగా డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆయనకు 6వ సీజన్ నుంచి వచ్చే పారితోషికం మొత్తం ఎంత అనే వివరాల్లోకి వెళితే..

కంటిస్యూగా..
హోస్ట్ గా నాగార్జునకు చాలా మంచి అనుభవమే ఉంది. మీలో ఎవరు కోటీశ్వరుడు తర్వాత ఆయన మళ్ళీ బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ అయితే అందుకున్నారు. నాగార్జున కంటే ముందు వచ్చిన ఎన్టీఆర్ నాని కూడా పరవాలేదు అనిపించినప్పటికీ కూడా ఆ తరహా ఒత్తిడిని తట్టుకొని వారు ముందుకు సాగలేదు. కానీ నాగార్జున మాత్రం గత మూడు సీజన్స్ కు హోస్ట్ గా వ్యవహరించి ఇప్పుడు 6వ సీజన్ ను కూడా కంటిన్యూ చేయబోతున్నారు.

మంచి రెస్పాన్స్
రీసెంట్ గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నాగార్జున చేసిన బిగ్ బాస్ మొదటి ప్రోమోకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. గతంలో కంటే ఈసారి బిగ్ బాస్ లోగో కూడా చాలా విభిన్నంగా ఉంది. ఇక దానికి తగ్గట్టుగానే టాస్కుల విషయంలో అలాగే కంటెస్టెంట్స్ ఎదుర్కొనే పరిస్థితుల విషయంలో కూడా బిగ్ బాస్ నిర్వాహకులు సరికొత్తగా ఆలోచించినట్లు సమాచారం. మొత్తంగా ఎంటర్టైన్మెంట్ అయితే ఈసారి ఊహించని రేంజ్ లోనే ఉంటుంది అని చెబుతున్నారు.

ఫైనల్ లిస్ట్ రెడీ
బిగ్ బాస్ 6వ సీజన్ ను మొదలుపెట్టాలి అని గత మూడు నెలలుగా చర్చలు అయితే కొనసాగిస్తున్నారు. ఇక రీసెంట్ గా అయితే పూర్తి ప్రణాళిక మొత్తం సిద్ధమయింది. కొన్ని రోజుల క్రితమే బిగ్ బాస్ కు సంబంధించిన ఫైనల్ లిస్ట్ కూడా రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఈసారి కంటెస్టెంట్స్ చాలా వరకు టెలివిజన్ యూట్యూబ్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న వారు రావచ్చు అని తెలుస్తోంది. అంతేకాకుండా కామన్ మ్యాన్ క్యాటగిరీలో మరొక ఇద్దరు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
Recommended Video


నాగార్జున రెమ్యునరేషన్ ఎంత?
ఇక ఈసారి నాగార్జున బిగ్ బాస్ ద్వారా అందుకునే పారితోషికం ఎంత అనే విషయంలో కూడా అనేక రకాల కథనాలు వైరల్ అవుతున్నాయి. గతంలో అయితే నాగార్జున మూడవ సీజన్ నుంచి మెల్లమెల్లగా తన రెమ్యునరేషన్ పెంచుకుంటూ వస్తున్నాడు. ఇక ఈసారి ఆయన రేంజ్ మరికొంత పెరిగినట్లుగా తెలుస్తోంది. ఫైనల్ గా 6 వ సీజన్ కోసం నాగార్జున 14 కోట్ల నుంచి 15 కోట్ల మధ్యలో తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో అయితే మొత్తంగా 13 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











