క్రికెట్ TRP రికార్డ్స్ బ్రేక్ చేసిన Bigg Boss Telugu7... ఈసారి రేటింగ్ ఎంతొచ్చిందో తెలిస్తే షాకే!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3న లాంఛనంగా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇక ఆరు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. 7వ సీజన్ గత ఆరు సీజన్స్ కంటే భిన్నంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక అందుకు తగ్గట్లుగానే ఈ సీజన్ సాగుతోంది. అంతే కాదు.. మంచి టీఆర్పీని సొంతం చేసుకుంటుంది. గత సీజన్స్ కంటే 40శాతం అధిక రేటింగ్ సాధిస్తుందంటూ స్టార్ మా తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే...
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజు రోజుకి ఆసక్తిగా సాగుతోంది. సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన ఈ సీజన్... రోజురోజుకు ఆసక్తి కలిగిస్తోంది. ఇక రేటింగ్స్ లోనూ బిగ్ బాస్ రికార్డులు బద్దలు కొడుతోంది. అద్భుతమైన రేటింగ్స్ తో బిగ్ బాస్ ఏడో సీజన్ ప్రారంభం అయింది. గత సీజన్ తో పోలిస్తే 40 శాతం అధిక రేటింగ్ నమోదు చేసింది. తొలి రోజునే 29 మిలియన్ల మంది వీక్షించారు. ఇక సంచలనాలకు కేరాఫ్ గా బిగ్ బాస్ సీజన్ 7 నిలుస్తుంది.

ఇక బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ... చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్లుగానే ఈ సీజన్ సాగుతోంది. ఊహించినట్టుగానే బిగ్ బాస్ సీజన్ 7 ఎన్నో సంచలనాలకు వేదికగా మారింది. రేటింగ్స్ పరంగా... వ్యూయర్ షిప్ పరంగా ఊహించని ఎన్నో అద్భుతాలకు స్టార్ మా లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 వేదికగా నిలిచింది. ఇక ఈ సీజన్ కు ఎన్నో రెట్ల వ్యూయర్ షిప్ పెరుగుతూ వస్తోంది.
బిగ్ బాస్ సీజన్ 7 కు రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోంది. తెలుగు టెలివిజన్ చరిత్రలోనే సరికొత్త ప్రమాణాలను సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఇద్దరిలో ఒకరు ఇప్పుడు ఈ షో చూస్తున్నారని తేలింది. ఇంచు మించు 5.1 కోట్ల ప్రేక్షకులు మొదటి వారం బిగ్ బాస్ షో చూశారని గణాంకాలు చెబుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 7 ఆవిష్కరణ కార్యక్రమాన్ని సుమారు 3 కోట్ల మంది ప్రేక్షకులు చూశారని తెలిసింది.

గతంలో క్రికెట్ మ్యాచ్ ల వీక్షణ పరంగా నమోదైన రికార్డులను కూడా తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 అధిగమించింది. ఈ సీజన్ బిగ్ బాస్ ఎంతగా ఉర్రూతలూగించిందో చెప్పాలంటే గత సీజన్ లో సాధించిన రేటింగ్ తో పోలిస్తే 40% అధిక రేటింగ్ సాధించింది. తిరుగులేని ఈ ప్రేక్షక ఆదరణతో ఇప్పటికే నెంబర్ వన్ స్థానంలో అప్రతిహతంగా దూసుకుపోతుంది.
స్టార్ మా నెంబర్ 1 ఛానల్ గా తన స్థానాన్ని మరోమారు బిగ్ బాస్ సీజన్ 7 సాక్షిగా తెలిపింది. ఈ సీజన్ ఉల్టా పుల్టాగా ఉండబోతోందని కింగ్ నాగార్జున ప్రోమోలో చెప్పిన నాటి నుంచి విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. అది ఈ గణాంకాలలో కనిపిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 7 వీకెండ్ ఎపిసోడ్ ను సరాసరిన 7.1 % రేటింగ్ తో చూస్తే... హైదరాబాద్ లో అత్యధికంగా 8.7% రేటింగ్ తో వీక్షించారని తేలింది.
తొలివారంలోనే సంచలనాలకు కేరాఫ్ గా నిలిచిన బిగ్ బాస్ సీజన్ 7 రాబోయే ఎపిసోడ్స్ లో ఇంకెన్ని సంచలనాలు సృష్టించనుందో చూడాలి. ఈ షోకి స్టార్ మాలో మాత్రమే కాదు.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో, యూట్యూబ్ లో కూడా విపరీతమైన ఆదరణ వస్తోంది. రెండు వారాల్లోనే ఇన్ని రికార్డులు క్రియేట్ చేసిన బిగ్ బాస్.. త్వరలో ఇంకే రికార్డ్స్ క్రియేట్ చేయనుందో చూడాలి.


Click it and Unblock the Notifications











