అఖిల్, మోనాల్‌కు భారీ షాకిచ్చిన నాగార్జున: పెళ్లి జరిగిపోయిందని చెప్పడంతో ఇలా!
బిగ్ బాస్ అంటేనే రియల్ ఎమోషన్స్‌తో సాగే షో అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో ప్రముఖంగా కంటెస్టెంట్ల మధ్య ఉండే బాండింగ్‌గా బాగా హైలైట్ చేస్తుంటారు నిర్వహకులు. అందులోనూ లవ్ ట్రాక్ నడిపేటట్లు కనిపిస్తే చాలా వాళ్ల పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. ఇలా బిగ్ బాస్ షోలో ఎంతో మంది ప్రేమ పక్షులు పరిచయం అయ్యారు. ఇక, ప్రస్తుతం సీజన్‌లోనూ ఆ తరహా జంటలు హల్‌చల్ చేస్తున్నాయి. అందులో అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్ జోడీ ఒకటి. తాజాగా వీళ్లిద్దరికీ హోస్ట్ నాగార్జున పెళ్లి విషయంలో కామెంట్స్ చేసి భారీ షాకిచ్చాడు. ఆ వివరాలు మీకోసం.!
Recommended Video

షోలో అఖిల్ - మోనాల్ జంట ప్రత్యేకం
తెలుగులో బిగ్ బాస్ షో ప్రారంభం అయినప్పటి నుంచి లవ్ ట్రాకులు నడుస్తూనే ఉన్నాయి. ప్రతి సీజన్‌లో ఒకటో రెండో జంటలు హైలైట్ అవుతున్నాయి. ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్‌లో సైతం అదే పరిస్థితి కనిపిస్తోంది. హౌస్‌లో ఈ సారి రెండు మూడు జంటలు ఉన్నా... ఎక్కువగా అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్ జోడీనే ప్రత్యేకమైనదని చెబుతుంటారు.

ఆమె స్పందనతో మరింత హాట్ టాపిక్
అఖిల్ - మోనాల్ మధ్య ఏం ఉందో ప్రేక్షకులకు తెలియదు కానీ, బిగ్ బాస్ నిర్వహకులు మాత్రం దీనిని లవ్ ట్రాక్‌లానే చూపించారు. దీంతో వీళ్లిద్దరూ హాట్ టాపిక్ అయిపోయారు. సరిగ్గా ఆ సమయంలోనే అఖిల్ మదర్ ఈ వ్యవహారంపై స్పందించారు. ఆ సందర్భంలో గుజరాతీ అమ్మాయితో పెళ్లి వద్దని, ఏదైనా తప్పు చేస్తే మా వాడి కాళ్లు విరగ్గొడతానని అనడం సంచలనం అయింది.

ఆ సీన్‌తో ప్రేక్షకులకు క్లారిటీ వచ్చింది
షో నడుస్తున్న కొద్దీ అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ గతంలో కంటే ఎక్కువ క్లోజ్ అయినట్లు కనిపిస్తున్నారు. వారం క్రితం అతడి పుట్టినరోజున జరిగిన వ్యవహారంతో ఈ జంటపై ప్రేక్షకులకు క్లారిటీ వచ్చింది. ఆరోజు రాత్రి అఖిల్‌కు మోనాల్ ముద్దు పెట్టింది. దీంతో అతడు రోజూ నా బర్త్‌డే అయితే బాగుండు అని కామెంట్ చేశాడు. దీంతో ఈ సీన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీలోనూ ఇలాగే
గత వారం బిగ్ బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అఖిల్ తల్లి మోనాల్‌తో ‘నువ్వు ఫ్రెండ్‌వి మాత్రమే' అంటూ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మోనాల్.. తన సోదరి హిమాలీతో ‘అఖిల్, నా గురించి చెడుగా కన్వే అవుతుందా' అని అడిగింది. ఈ రెండు సందర్భాలతో వీళ్లిద్దరి ట్రాక్ ఎఫెక్ట్ ఎంతలా ఉందో అర్థమైంది.

అఖిల్, మోనాల్‌కు షాకిచ్చిన నాగార్జున
ప్రతి వారం లాగే గత ఆదివారం కూడా ఫన్నీగా సాగింది. ఎంతో ఉత్సాహంతో ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ అక్కినేని నాగార్జున.. తనదైన శైలి హోస్టింగ్‌తో మరోసారి ఆకట్టుకున్నాడు. ఇక, షోలో భాగంగా కంటెస్టెంట్లను రెండు టీమ్‌లుగా విడగొట్టి లూడో, సినిమా ఫజిల్స్ ఆడించాడు. గేమ్స్ జరుగుతోన్న సమయంలోనే అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్‌కు భారీ షాక్ ఇచ్చాడాయన.

పెళ్లి జరిగిపోయిందని చెప్పడంతో ఇలా
ఓ పాటకు డ్యాన్స్ చేస్తున్న సమయంలో అవినాష్.. మోనాల్ చేయి పట్టుకున్నాడు. ఆ వెంటనే స్పందించిన నాగార్జున ‘పాణీగ్రహణం అంటే తెలుసా అవినాష్' అన్నాడు. దీనికి అతడు ఆన్సర్ చెప్పకపోవడంతో.. చేతిలో చేయి పెడితే పెళ్లి జరిగినట్లు అని నాగ్ బదులిచ్చాడు. అంటే అవినాష్ - మోనాల్ పెళ్లి జరిగిందని పరోక్షంగా కామెంట్ చేశాడు. దీంతో షాకైపోయిన బ్యూటీ.. అఖిల్ వైపు చూస్తూ ఇది గేమ్ మాత్రమే కదా అవినాష్ అంటూ కవర్ చేసింది.


Click it and Unblock the Notifications











