అవినాష్‌పై నాగార్జున ఆగ్రహం: బిగ్ బాస్‌లో అలాంటివి కుదరవంటూ బయటకు పంపేశాడు

తెలుగు బుల్లితెరపై ప్రత్యేకమైన గుర్తింపుతో ప్రేక్షకాదరణను అందుకుంటూ నెంబర్ వన్ కామెడీ షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు తమ టాలెంట్‌ను నిరూపించుకున్నారు. కొందరైతే చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో ముక్కు అవినాష్ ఒకడు. ఈ యంగ్ కమెడియన్ బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వినోదాన్ని పంచుతూ సాగిపోతోన్న అతడిపై నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత అతడిని బయటకు పంపేశాడు. ఆ వివరాలు మీకోసం.!

 జబర్ధస్త్‌గా కెరీర్.. మంచి పొజిషన్

జబర్ధస్త్‌గా కెరీర్.. మంచి పొజిషన్

మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్‌ను ఆరంభించిన అవినాష్.. ఆ రంగంలో మంచి గుర్తింపు దక్కించుకోవడంతో జబర్ధస్త్‌ కామెడీ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులోకి వచ్చిన అనతి కాలంలోనే తనలోని టాలెంట్లను చూపించి టీమ్ లీడర్‌ కూడా అయిపోయాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోని అవినాష్ సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు.

జోకర్‌‌లా షోలోకి ఎంట్రీ ఇచ్చాడు

జోకర్‌‌లా షోలోకి ఎంట్రీ ఇచ్చాడు

జబర్ధస్త్‌లో టీమ్ లీడర్‌గా ఓ వెలుగు వెలుగుతోన్న సమయంలోనే అవినాష్‌కు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలోనే షో ప్రారంభం అయిన రెండు వారాలకు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాదు, ప్రత్యేకంగా తయారు చేసిన ప్రోమోలో తనను తాను జోకర్ అని చెప్పుకుంటూ.. ప్రేక్షకులను నవ్వించడం కోసం ఏదైనా చేస్తానని చెప్పుకొచ్చాడు.

బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా పేరొచ్చింది

బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా పేరొచ్చింది

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే తన మార్క్ చూపించడం మొదలెట్టాడు అవినాష్. తరచూ ఏదో ఒక విధమైన పని చేస్తూ హైలైట్ అయ్యేవాడు. ఈ క్రమంలోనే ప్రతి విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ కామెడీని పండించేవాడు. దీంతో బిగ్ బాస్ షోలోనే బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా పేరు సంపాదించుకున్నాడు. ఫలితంగా నామినేషన్లు సైతం తప్పించుకున్నాడు.

కామెడీతోనే వివాదాలు కూడా

కామెడీతోనే వివాదాలు కూడా

కమెడియన్‌గా సూపర్ సక్సెస్ అయిన అవినాష్ బిగ్ బాస్ హౌస్‌లోనూ అదే కంటిన్యూ చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఆరియానాను పడేయడానికి అతడు పడే పాట్లు నవ్వు తెప్పిస్తున్నాయి. ఇదిలాఉండగా, అవినాష్ కామెడీపై నోయల్ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అతడు బయటకు వెళ్లే సమయంలో దీనిపై పెద్ద వివాదమే చెలరేగింది కూడా.

అవినాష్‌పై నాగార్జున ఆగ్రహం

అవినాష్‌పై నాగార్జున ఆగ్రహం

ముక్కు అవినాష్ తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. కానీ, శనివారం జరిగిన టాస్కులో మాత్రం విఫలం అయ్యాడు. బిగ్ బాస్ హౌస్‌లోకి కుటుంబ సభ్యులను మరోసారి తీసుకొస్తానన్న నాగ్.. అందుకోసం ఓ ప్రశ్నకు సేఫ్ గేమ్ ఆడకుండా సమాధానం చెప్పాలన్నాడు. ఈ విషయంలో అవినాష్ పూర్తిగా విఫలమవడంతో హోస్ట్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అతడిని బయటకు పంపేశాడు

అతడిని బయటకు పంపేశాడు

అవినాష్‌ను కలిసేందుకు అతడి సోదరుడు అశోక్ వచ్చాడు. అతడిని లోపలికి తీసుకు రావాలంటే హౌస్‌లో స్వార్థంగా ఆడే కంటెస్టెంట్ ఎవరో చెప్పమని నాగ్ ప్రశ్నించాడు. దీనికి అతడు లాస్య పేరును చెప్పాడు. కానీ సరైనా సమాధానం మాత్రం చెప్పలేదు. చివర్లో మరోసారి ఛాన్స్ ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. దీంతో అశోక్‌ను బయటకు పంపించేశాడు నాగార్జున.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X