ఆ విషయంలో నాగార్జున సీరియస్.. అందుకే గంగవ్వను చెల్లి అంటూ..

బిగ్ బాస్ సీజన్ 4 రోజుకో ట్విస్ట్ తో మెల్లమెల్లగా భారీ స్టయిల్ రేటింగ్ అందుకోవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. నాగార్జున వీకెండ్స్ తో షోకి మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాడని లేకుంటే వచ్చే రేటింగ్ కూడా మెల్లమెల్లగా తగ్గుతుందనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక శనివారం ఐపీఎల్ మ్యాచ్ ఉన్నా కూడా నాగ్ షోకి మంచి హైప్ క్రియేట్ తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ ఎపిసోడ్ లో గంగవ్వకు నాగార్జున చెల్లెమ్మా అని పిలవడం హాట్ టాపిక్ గా మారింది.

వార్నింగ్ ఇచ్చిన నాగార్జున

వార్నింగ్ ఇచ్చిన నాగార్జున

శనివారం ఎపిసోడ్ లో నాగార్జున కంటెస్టెంట్స్ విషయంలో చాలా సీరియస్ అయ్యారు. మొదటి నుంచి గేమ్ రూల్స్ ప్రకారం నడుచుకోవాలని టైటిల్ గెలవడానికి మాత్రమే ప్రయత్నం చేయాలని చెబుతున్న నాగార్జున మరోసారి అదే విషయాన్ని గుర్తు చేస్తూ సింపతి పొందాలని చూడవద్దని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఎపిసోడ్ యొక్క వాతావరణం మారిపోయింది.

నన్ను అన్నయ్య అన్నారు కదా

నన్ను అన్నయ్య అన్నారు కదా

ప్రతి ఒక్కరి నెగిటివ్ విషయాలను పాజిటివ్ విషయాలను ఎత్తి చూపించిన నాగార్జున తనదైన శైలిలో గేమ్ స్పిరిట్ నింపే ప్రయత్నం చేశారు. ఇక గంగవ్వ విషయంలో నాగార్జున ఎవరు ఊహించని విధంగా స్పందించారు. కన్ఫెషన్ రూమ్ లోకి ఆమెను పిలిచి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. పైగా నువ్వు నన్ను అన్నయ్య అన్నావు కదా .. ఈ అన్నయ్య కూడా చెల్లిని చాలా బాగా చూసుకుంటాడు గంగమ్మ అంటూ నాగ్ వివరణ ఇచ్చారు.

ఆ ట్రోలింగ్ ఎఫెక్ట్.. వర్కౌట్ అయ్యిందే?

ఆ ట్రోలింగ్ ఎఫెక్ట్.. వర్కౌట్ అయ్యిందే?

గంగవ్వను నాగ్ చెల్లి అనడంతో ఒక్కసారిగా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. పైగా గంగవ్వ పేరుతో కాకుండా గంగమ్మ అంటూ కొత్తగా సంభోదించడం చూస్తుంటే మొన్న వచ్చిన ట్రోలింగ్ ఎఫెక్ట్ గట్టిగానే వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది. వయసులో నాగ్ గంగవ్వ కంటే పెద్ద అనే విషయం అందరికి తెలిసిందే. అందుకే ఫస్ట్ వీక్ నాగార్జున గంగవ్వ అనడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడిచింది.

Recommended Video

Bigg Boss Telugu 4: Karate Kalyani అవుట్, డబుల్ ఎలిమినేషన్ ఉత్తిదే.. సీక్రెట్ రూంలో హారిక!!
విమర్శలు రాకపోయినా నాగ్ సీరియస్

విమర్శలు రాకపోయినా నాగ్ సీరియస్

ఒక విధంగా షోకి అది పెద్దగా మైనస్ అవ్వలేదు. అలాగని నాగార్జునపై కూడా విమర్శలు ఏమి రాలేదు. కానీ ఆయన మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లు అర్థమైంది. వెంటనే గంగవ్వ నుంచి గంగమ్మ అనే పేరుకు షిఫ్ట్ అయ్యాడు. చెల్లెమ్మా అనడంతో అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. ఏదేమైనా నాగార్జున ట్రోలింగ్ కి గురికావద్దని జాగ్రత్తలు బాగానే తీసుకుంటున్నట్లు అర్ధమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X