వాళ్ల మధ్య పుల్లలు పెట్టిన నాగ్: తట్టుకోలేక ఏడ్చేసిన కంటెస్టెంట్లు.. ఈ వారం సేఫ్ అయింది ఒక్కరే
ప్రస్తుతం ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ నాలుగో సీజన్ రోజురోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ఈ సీజన్‌ను చూసేందుకు తెలుగు ప్రేక్షకులు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఫలితంగా ఇది సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇదిలాఉండగా, ఈ వారం బిగ్ బాస్ మొత్తం తీపి కారంలా సాగింది. సోమవారం నామినేషన్ సమయంలో కంటెస్టెంట్ల మధ్య పెద్ద పెద్ద గొడవలు జరగగా, ఆ వెంటనే కుటుంబ సభ్యుల ఎంట్రీతో అంతా ఒక్కటైపోయారు. ఇక, వీకెండ్ ఎపిసోడ్ కూడా అదే తరహాలో సాగింది. నాగార్జున కంటెస్టెంట్ల మధ్య పుల్లలు పెట్టగా, కొందరు ఏడ్చేశారు. ఆ వివరాలు మీకోసం.!

గిప్టులు ఇస్తూనే పుల్లలు పెట్టిన నాగ్
ఈ వీకెండ్ ఎపిసోడ్‌ను సరదాగా స్టార్ట్ చేశాడు హోస్ట్ అక్కినేని నాగార్జున. ఈ వారం మొత్తంలో జరిగిన అంశాలను ప్రస్తావిస్తూ హౌస్‌మేట్స్‌కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడు. అదే.. మరోసారి కుటుంబ సభ్యులను తీసుకొస్తానని. దీంతో కంటెస్టెంట్లు అందరూ హ్యాపీగా ఫీలయ్యారు. అంతలో వాళ్ల ఆనందాన్ని ఆవిరి చేస్తూ నాగ్ ఓ మెలిక పెట్టాడంతో వాళ్లందరూ ఖంగు తిన్నారు.

గులాబీ పువ్వు ఇచ్చి చెబితేనే ఎంట్రీ
కంటెస్టెంట్లకు సంబంధించిన కుటుంబ సభ్యులు కన్ఫెషన్ రూమ్ నుంచి మాట్లాడతారు. ఆ గొంతు విని గుర్తు పట్టిన హౌస్‌మేట్.. నాగార్జున అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెప్పి గులాబీ పువ్వు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఆన్సర్ ఆయనకు నచ్చితేనే కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇచ్చేలా చేస్తాడు. దీంతో అందరూ సేఫ్ గేమ్ ఆడకుండా సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశారు.

వాళ్లిద్దరి వాగ్వాదం.... కొందరు హర్ట్
కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇస్తారన్న ఆనందంలో చాలా మంది సభ్యులు ఎదుటి వారిపై నిందలు వేసేలా మాట్లాడారు. ఈ క్రమంలోనే అఖిల్ - అభిజీత్ మధ్య కొంతసేపు డిస్కర్షన్ జరిగింది. ఆ తర్వాత మిగిలిన కంటెస్టెంట్లు చెప్పిన ఆన్సర్లకు కొంత మంది హర్ట్ అయినట్లు కనిపించారు. ఎంట్రీ ఇచ్చిన ఇంటి సభ్యులు మాత్రం అందరితో చక్కగా మాట్లాడి జోష్‌ను నింపారు.

టాప్ - 5 సెట్ చేసిన స్పెషల్ గెస్ట్స్
అవినాష్ తప్ప అందరు కంటెస్టెంట్లకు సంబంధించిన కుటుంబ సభ్యులు బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. వీళ్లు స్టేజ్ మీదకు వచ్చిన సమయంలో పలువురు హౌస్‌మేట్స్ తట్టుకోలేక ఏడ్చేశారు. వీళ్లంతా కంటెస్టెంట్లతో మాట్లాడడంతో పాటు తమ అభిప్రాయంలో టాప్-5లో ఉండే వాళ్లను ఎంపిక చేశారు. ఈ జాబితాలో మోనాల్, లాస్య, అవినాష్‌కు తక్కువ ఓట్లు వచ్చాయి.

శనివారం సేఫ్ అయిన కంటెస్టెంట్
ఈ వారం ప్రారంభంలో జరిగిన నామినేషన్ టాస్కులో అభిజీత్, ఆరియానా గ్లోరి, దేత్తడి హారిక, మోనాల్ గజ్జర్, సోహెల్ రియాన్, లాస్య మంజునాథ్ ఎలిమినేషన్ జోన్‌లోకి వెళ్లారు. శనివారం జరిగిన ఎపిసోడ్‌లో కేవలం ఒక్కరిని మాత్రమే సేవ్ చేశారు బిగ్ బాస్ నిర్వహకులు. ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు.. యాంగ్రీ యంగ్ మ్యాన్ సోహెల్.


Click it and Unblock the Notifications











