Nagarjuna: శోభాశెట్టికి సీక్రెట్‌గా ఆ గిఫ్ట్ పంపిన నాగార్జున... మరీ అమర్ దీప్ సంగతేంటి?

బిగ్ బాస్ తెలుగు 7 ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఇక ఈ షో 100 రోజులకు పైగా సక్సెస్ ఫుల్ గా రన్ అయిన సంగతి తెలిసిందే.అయితే ఈ షోలో పాల్గొన్న కన్నడ బ్యూటీ బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తన ఆటతో బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ భామకు నాగార్జున ఓ సీక్రెట్ గిఫ్ట్ పంపారని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్.. మరి అమర్ దీప్ ఏం పాపం చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు సంగతి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ సీజన్ 7లో తన ఆటతో ప్రేక్షకులను అలరించిన భామల్లో కన్నడ బ్యూటీ శోభా శెట్టికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందనే చెప్పాలి. కార్తీక దీపం సీరీయల్ లో మోనిత అనే నెగిటివ్ రోల్ లో నటించి మెప్పించిన ఈ భామ... బిగ్ బాస్ సీజన్ 7లో ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్ ను అలరించింది. బిగ్ బాస్ హౌస్ లోనూ తన గేమ్ తో శోభా శెట్టి ఆకట్టుకుంది. తన గేమ్ స్ట్రాటజీతో చాలా వారాలు బిగ్ బాస్ ఇంట్లో ఉండి.. మంచి గుర్తింపు అయితే సొంతం చేసుకుంది.

 Akkineni Nagarjuna Gifted His T shirt To Bigg Boss Beauty Shobha Shetty What About Amardeep?

ఇక స్టార్ మా బ్యాచ్ అంతా ఒక్కటై గేమ్ ఆడుతున్నారనే కామెంట్స్ వచ్చినా.. తన్ గేమ్ తో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. అయితే శోభాశెట్టి తన ప్రవర్తనతో పలు సార్లు ప్రేక్షకులకు చిరాకు తెప్పించేది. ఇక ఎలిమినేట్ అవుతుందనే కామెంట్స్ వచ్చినా.. బిగ్ బాస్ ఆమెను సేఫ్ చేశాడు అనే వాదనాలు కూడా ఉన్నాయి. ఇక 13వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉండి ప్రేక్షకులను అలరించింది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే శోభాశెట్టి కోసం నాగార్జున అదిరిపోయి సర్ప్రైజ్ ఇచ్చాడని తెలుస్తోంది.

 Akkineni Nagarjuna Gifted His T shirt To Bigg Boss Beauty Shobha Shetty What About Amardeep?

బిగ్ బాస్ సీజన్ 7కు హౌస్టుగా వ్యవహరించిన కింగ్ నాగార్జున ఓ ఎపిసోడ్ లో వేసుకున్న స్టైలిష్ షర్ట్ ను శోభా శెట్టికి గిఫ్ట్ గా పంపించారు. ఓ ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున వెరైటీ షర్ట్‌ తో వచ్చి అందరిని ఆకట్టుకోగా...శోభా శెట్టి ఆ షర్ట్ కావాలని నాగార్జునను అడిగింది. దాంతో నాగార్జున ఆ షర్ట్ ను శోభా శెట్టికి బహుమతిగా ఇచ్చాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని శోభ తన యూట్యూబ్‌ ఛానల్‌లో శోభా ఓ వీడియోలో చెప్పుకువచ్చింది.

బిగ్ బాస్ 7 ఆరో ఎపిసోడ్ లో అనుకుంటా.. నేను టీ షర్ట్‌ అడిగిన విషయం గుర్తుపెట్టుకుని మరీ ఎలిమినేట్‌ తర్వాత నాగ్‌ సర్‌ స్వయంగా ఆ టీషర్ట్‌ నాకు ఇచ్చారని చెప్పుకువచ్చింది. ఆయన వేసుకున్న టీషర్ట్‌ నాకు ఇచ్చేశారు.. అంతకంటే ఆనందం ఏముంటుందని కామెంట్స్ చేసింది. అయితే ఈ విషయం తెలుసుకున్న అమర్ దీప్ ఫ్యాన్స్... మరి అమర్ దీప్ అడిగిన టి షర్ట్ ఏమయిందని కామెంట్స్ చేస్తున్నారు. మరి అమర్ దీప్ నాగార్జునను ఓ ఎపిసోడ్ లో షర్ట్ కావాలని అడిగితే.. కూర్చో అంటూ సమాధానం చెప్పారు. మరి అమర్ దీప్ కు ఇచ్చారా లేదా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X