Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ లో బిగ్గెస్ట్ ట్విస్ట్.. అస్సలు ఊహించనట్టుగా నాగార్జున షాక్
బిగ్‌బాస్ తెలుగు 8 రసవత్తరంగా సాగుతోంది. తొలివారం అంతగా గేమ్‌పై ఫోకస్ పెట్టని కంటెస్టెంట్స్ .. కేవలం అర్ధం చేసుకోవడం వరకే పరిమితమయ్యారు. సెకండ్ వీక్ మాత్రం అంతా పోటీపడి ఆడారు. ఆడ మగ అన్న తేడా లేకుండా టాస్క్‌లలో గెలవాలన్న లక్ష్యంతో దూసుకెళ్లారు. కానీ టాస్క్‌లపై పెడుతున్న శ్రద్ధ .. డిస్కషన్ ఇతర యాక్టీవిటీస్‌పైనా పెట్టాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సెకండ్ వీక్ చివరి రోజు కావడంతో ఆదివారం ఎలిమినేషన్ ఉండనుంది. సండే ఎపిసోడ్‌కు సంబంధించి స్టార్ మా మరో ప్రోమోను రిలీజ్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
ఆదివారం రిలీజ్ చేసిన ఫస్ట్ ప్రోమో ఫన్‌గా సాగింది. ఇంటికి కొత్తగా అభయ్, నిఖిల్‌లు చీఫ్‌లుగా ఎంపికవుతారు. దీంతో కంటెస్టెంట్స్ రెండు జట్లుగా మారి ఎవరి టీమ్‌లోకి వెళ్లాలనుకుంటున్నారో తేల్చుకోవాలని నాగ్ సూచిస్తారు. తొలుత సోనియా.. తాను నిఖిల్ టీమ్‌లోకి వెళ్తున్నట్లు చెబుతుంది. ఎందుకని నాగార్జున అడగ్గా.. అతనికి నా అవసరం ఎక్కువగా ఉందని ఆన్సర్ ఇస్తుంది. అలాగే వైఎస్ అంటే ఏంటో కాస్త చెప్పాలని అడగ్గా.. రెండు చేతులతో సోనియా ఫేస్ కవర్ చేసుకుంటూ సిగ్గు పడుతుంది.

నాగమణికంఠ, ప్రేరణలు అభయ్ టీమ్‌లోకి వెళ్తారు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏం లేదని నాగార్జున అభయ్‌ని అడగ్గా.. తనకు అలాంటిది లేదు, ఆ డౌట్ నిఖిల్ టీమ్‌కేనని చెబుతాడు. ఇంతలో
తాను నిఖిల్ టీమ్‌లోకి వెళ్తానని పృథ్వీ చెప్తాడు. నువ్వు నామినేషన్‌లో ఉండటానికి కారణం ఎవరని నాగ్ ప్రశ్నించగా.. నిఖిల్ అన్నయ్య అంటాడు. కసి తీర్చుకోవడానికి నిఖిల్ టీమ్‌లోకి వెళ్తున్నావా అని నాగార్జున పంచ్‌లు వేస్తారు. దీంతో ఇంటి సభ్యులంతా నవ్వేస్తారు.
ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణాన్ని సీరియస్‌గా మార్చేలా నాగార్జున .. డియర్ ఆడియన్స్ నామినేషన్స్‌లో ఉన్న వారిలో బోటమ్ టూ వరకు మీరు సెలెక్ట్ చేసినవాళ్లే ఉన్నారని చెబుతారు. ఆ వెంటనే బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇన్ దిస్ సీజన్ అంటూ కంటెస్టెంట్స్‌ని చూస్తూ అంటారు. దీంతో ఇంటి సభ్యులు ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతుంటారు. వాళ్లలో ఇంట్లో ఎవరుంటారు, ఇంటి బయటికి ఎవరోస్తారో అన్నది సీజన్ 8లోని హౌస్‌మెట్స్ డిసైట్ చేయబోతున్నారని నాగార్జున చెబుతారు.
ఈ మాటలో కంటెస్టెంట్స్ గుండెలో రైళ్లు పరిగెడుతుంటాయి. నామినేషన్స్‌లో ఉన్న వారి చేతుల్లో బ్లూ కలర్ బాక్స్‌లు పెట్టి వాటిని ఓపెన్ చేయమని చెబుతారు. ఒక్కో కంటెస్టెంట్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తుండగా ప్రోమో ఎండ్ అవుతుంది. బహుశా ఆ పెట్టేల్లోనే ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే మేటర్ ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్‌లో హౌస్‌ని వీడనున్న సెకండ్ కంటెస్టెంట్ ఎవరో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











