BIGG BOSS TELUGU 8 : ఫస్ట్ ఎపిసోడ్‌లోనే సర్‌ప్రైజ్.. విన్నర్ నువ్వే, సోనియా కోసం సెన్షేషనల్ డైరెక్టర్ ..!!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు 8 గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. గత సీజన్‌లకు భిన్నంగా కంటెస్టెంట్స్‌ని సింగిల్‌గా కాకుండా జంటగా పంపుతున్నారు నాగ్. ఈ నేపథ్యంలోనే సీనియర్ హీరో , లాహిరి లాహిరి లాహిరిలో ఫేమ్ ఆదిత్య ఓంను జోడీగానే లోపలికి వెళ్తావని చెబుతాడు. బోర్డ్‌పై మూడు కలర్స్ చూపించి వాటిలోని ఓ కలర్‌ని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ డిస్ ప్లే అయ్యే క్యారెక్టర్ ఉన్న వ్యక్తి నీకు బడ్డీగా దొరుకుతారని చెబుతారు నాగ్. దీంతో ఆదిత్య యెల్లో కలర్ సెలెక్ట్ చేసుకోగా.. బోర్డ్ వెనుక beautiful smile, తెగింపు, ముక్కుసూటి మనిషి అమ్మాయి నీకు బడ్డీగా వస్తుందని ఉంటుంది.
బార్బీ గాల్ సాంగ్‌కి స్టెప్స్ వేస్తూ సినీనటి సోనియా ఆకుల రెడ్ డ్రెస్‌లో ఎంట్రీ ఇస్తుంది. అందరిలా కాకుండా నాగార్జునకు నమస్తే అంటూ తెలుగు సాంప్రదాయం ప్రకారం విష్ చేస్తుంది. కొంచెం నెర్వెస్‌గా ఉందని చెబుతుంది, ఎందుకని నాగ్ అడగ్గా.. కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నందుకని ఆన్సర్ ఇస్తుంది సోనియా. వచ్చినవాళ్లంతా మీరు సూపర్బ్ ఉన్నారంటే ఏదో అనుకున్నా గానీ.. మీరు స్టన్నింగ్ అంటూ నాగ్‌ను ఆకాశానికెత్తేస్తుంది సోనియా. మీ చామ్ ముందు ఎవరు నిలబడలేరని చెబుతుంది.

తర్వాత నీ దగ్గర ఏదో నైన్ మంథ్ థియరీ ఉందంట ఏంటని అడగ్గా.. లిట్మస్ పీరియడ్ అని అంటుంది. అంటే నీకు నచ్చిన అబ్బాయికి లిట్మస్ టెస్ట్ పెడతావా అని నాగ్ క్వశ్చన్ చేస్తారు. దీనికి ఆమె ఔనని ఆన్సర్ ఇస్తుంది. నువ్వు బిగ్‌బాస్ హౌస్‌కి రావడానికి రీజన్ ఏంటని నాగ్ అడగ్గా... కోట్లు పెట్టినా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ రాదని, అలాంటి అవకాశం తనకు వచ్చిందని సోనియా చెబుతుంది.
ఈ సీజన్ లిమిట్‌లెస్ అని.. హౌస్‌లో లిమిట్‌లెస్‌గా నీకు ఏం కావాలని అడగ్గా.. ఫ్రెండ్, రిలేషన్ కావాలని అడుగుతుంది సోనియా. కలరీ, కరాటే నేర్చుకున్నావని విన్నాను , ఎవరికైనా పడ్డాయా అని నాగ్ క్వశ్చన్ చేస్తారు. దీనికి ఆమె అబ్బో చాలాసార్లు .. నన్ను చూడగానే సాఫ్ట్, క్యూట్ అని దగ్గరకొస్తారని అప్పుడు నేనేంటో తెలుస్తుందని సోనియా చెబుతుంది. అమ్మో అయితే నీకు దూరంగా ఉంటానంటూ నాగ్ అంటారు. ఆ వెంటనే నీకు సర్‌ప్రైజ్ అంటూ స్క్రీన్ మీద చూడమనగా.. దానిపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రత్యక్షమవుతారు.
బిగ్‌బాస్‌లో నిన్న చూడటం గర్వంగా ఉందని , నువ్వు ఖచ్చితంగా విన్నర్ అవుతావని ఆర్జీవీ ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతారు. ఈ సర్‌ప్రైజ్‌తో ఆమె షాక్ అయ్యింది. దీనిని తాను ఎక్స్‌పెక్ట్ చేయలేదని సోనియా అంటుంది. ఆపై నువ్వు ఓ వ్యక్తితో కలిసి హౌస్‌లో అడుగుపెడతావని చెప్పి ఆదిత్య ఓంను పిలుస్తాడు. ఇద్దరికి పరిచయం ఉందా అని నాగ్ అడగ్గా.. ఆదిత్యను చిన్నప్పుడు లాహిరి లాహిరి లాహిరిలో చూశానని సోనియా చెబుతుంది. దీనికి ఆదిత్య షాక్ అవుతూ.. చిన్నప్పుడు అంటే ఇప్పుడు , అలా లేనా అంటూ నవ్వుతాడు. అనంతరం ఇద్దరూ నాగార్జున బ్లెస్సింగ్స్ తీసుకుని హౌస్‌లో అడుగుపెడతారు.


Click it and Unblock the Notifications











