bigg boss telugu 8 : బిగ్‌బాస్ తెలుగు 8 గ్రాండ్ ఓపెనింగ్‌కి అన్నీ రెడీ.. హౌస్‌లోకి ఆ స్టార్ హీరో , మోతెక్కి ప

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్ ఈ ఆదివారం నుంచి ట్రాక్ మీదకు ఎక్కనుంది. దాదాపు 100 రోజులకు పైగా వినోదాన్ని అందించేందుకు బిగ్‌బాస్ సిద్ధమైంది. ఆదివారం సాయంత్రం నుంచి ఈ గ్రాండ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎవరెవరు కంటెస్టెంట్స్‌గా రానున్నారు, గెస్ట్‌లు ఎవరు, కల్చరల్ ఈవెంట్స్ ఏంటీ అన్న దానిపై చర్చ జరుగుతోంది. మరోవైపు బిగ్‌బాస్ 8 తెలుగు లాంచింగ్ ఈవెంట్‌కు ఓ స్పెషల్ గెస్ట్ రానున్నారట. ఆ వివరాలు మీ కోసం.

తెలుగువారికి అసలు సిసలు వినోదం అందించేందుకు బిగ్‌బాస్ రెడీ అయ్యాడు. ఆదివారం నుంచి బిగ్‌బాస్ తెలుగు 8 లాంచ్ కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తవ్వగా , ఎవరనేది మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే ఉంచింది స్టార్ మా. గతంలో కనీసం ఒకరిద్దరి పేర్లయినా తెలిసేవి, కానీ ఈసారి మాత్రం అలాంటి తప్పులు చేయకూడదని నిర్వాహకులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారట. బిగ్‌బాస్ తెలుగు 8కి సంబంధించి ఏ చిన్న వార్త కూడా బయటకు రావడం లేదంటే వాళ్లు ఎంత సీక్రసి మెయింటైన్ చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

akkineni Nagarjuna hosts Bigg Boss Telugu 8 set for grand opening this tollywood star hero special entry into house

కంటెస్టెంట్స్‌గా ఎవరు ఎంపికయ్యారన్న దానిపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వైరల్ అవుతున్నాయి. విష్ణుప్రియ, బెజవాడ బేబక్క, నిఖిల్, యాష్మీగౌడ, ఆదిత్య ఓం, న్యూస్ రీడర్ కళ్యాణి, మణికంఠ, సోనియా ఆకుల వంటి ఏవో కొన్ని పేర్లు మాత్రం కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే చివరి వరకు బిగ్‌బాస్ యాజమాన్యాన్ని నమ్మడానికి లేదు. లాస్ట్ మినిట్‌లో మొత్తం ఛేంజ్ చేసి షాకిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని ప్రేక్షకులు అంటున్నారు.

తొలి రోజు కేవలం పరిచయ కార్యక్రమాలతోనే షోను ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరు కంటెస్టెంట్‌ని హౌస్‌లోకి పంపించి వారు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారో వివరించేలా ఏవీని ప్రదర్శిస్తారు. వీరితో నాగార్జున ఇంటరాక్షన్.. సాంస్కృతిక కార్యక్రమాలు మోతెక్కిపోనున్నాయి. ఇందుకోసం బుల్లితెర ప్రేక్షకులంతా రెడీ అయిపోయారు. అంతా బాగానే ఉంది కానీ బిగ్‌బాస్ లాంచింగ్‌కి స్పెషల్ గెస్ట్ ఎవరు అనేది ఉత్కంఠ రేపుతోంది.

akkineni Nagarjuna hosts Bigg Boss Telugu 8 set for grand opening this tollywood star hero special entry into house

దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. నేచురల్ స్టార్ నాని .. బిగ్‌బాస్ తెలుగు 8 లాంచింగ్ ఈవెంట్‌లో స్పెషల్ ఎంట్రీ ఇవ్వనున్నారట. నాని బిగ్‌బాస్‌కు రావడం కొత్త కాదు. గతంలో బిగ్‌బాస్ తెలుగు సీజన్ -2ని తన స్కిల్స్‌తో అద్భుతంగా హోస్ట్ చేశారు నేచురల్ స్టార్. పండుగలు, తన మూవీ ప్రమోషన్స్ కోసం నాని పలుమార్లు బిగ్‌బాస్ స్టేజ్‌పై మెరిశారు. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని నటించిన సరిపోదా శనివారం ఆల్రెడీ థియేటర్‌లో ఉంది. మౌత్‌టాక్, పాజిటివ్ పబ్లిసిటీతో ఈ సినిమా దూసుకెళ్తోంది. దీనిని మరింత పెంచేందుకు గాను ప్రమోషన్ కార్యక్రమాలను ఉద్ధృతం చేయాలని యూనిట్ భావిస్తోందట. దీనిలో భాగంగానే రేపు నాని అండ్ టీమ్ బిగ్‌బాస్ తెలుగు 8లో సందడి చేస్తారని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X