బిగ్ బాస్ 4 లీక్.. కీలక నిర్ణయం తీసుకున్న నాగార్జున.. రెమ్యునరేషన్ కూడా పెరిగింది!
కరోనా వైరస్ దెబ్బ పడకపోయి ఉంటే ఈపాటికే బిగ్ బాస్ సీజన్ 4పై ఒక క్లారిటీ వచ్చేది. గతంలో ఎప్పుడు లేని విదంగా బిగ్ బాస్ తెలుగుపై ఈ సారి స్పెషల్ ఎట్రాక్షన్ అయితే నెలకొంది. జరిగిన మూడు సీజన్స్ లు కూడా మంచి రేటింగ్ అందుకోవడంతో సీజన్ 4 కోసం నిర్వహకులు భారీ ప్లాన్స్ అయితే వేసుకున్నారు. ఇకపోతే హోస్టింగ్ విషయంలో నాగార్జున ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

విపరీతమైన క్రేజ్..
వరల్డ్ వైడ్ గా క్రేజ్ అందుకున్న బిగ్ బాస్ షో మొదట్లో తెలుగులో సక్సెస్ అవుతుందా లేదా అనే అనుమానాలు చాలానే వచ్చాయి. కానీ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో అద్భుతమైన ఆరంభం ఇవ్వడంతో షోకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. వివధాలు, కాంట్రవర్సీలు మరింత బూస్ట్ ఇవ్వడంతో జనాలు బిగ్ బాస్ షోకి బాగానే ఎట్రాక్ట్ అయ్యారని ఒక క్లారిటీ వచ్చింది.

బిగ్ బాస్ 4 సస్పెన్స్..
సెకండ్ సీజన్ మాత్రం నాని హోస్టింగ్ తో ఊహించని ఫలితాన్ని అందుకుంది. హోస్ట్ హోదాలో నాని క్లిక్కయినప్పటికి అతను షోలో ఉన్నన్ని రోజులు చాలా చిరకుతోనే ఉన్నాడట. మళ్ళీ షో జోలికి వెళ్లకూడదని ఒక నిర్ణయానికి రాగా మూడవ సీజన్ లో నాగార్జున తన అద్భుతమైన హోస్టింగ్ తో బాగానే టీఆర్పీ అందించారు. ఇకపోతే నాలుగవ సీజన్ లో చాలా సస్పెన్స్ లు నెలకొన్నాయి.

హోస్ట్ ఫిక్స్ అయినట్లే..
అసలు ఈ కరోనా సమయంలో షో ఉంటుందా లేదా అనే అనుమానాలు ఎక్కువ అయ్యాయి. కానీ షోకి మాత్రం ఏర్పాట్లు జరుగుతున్నాయనే టాక్ అయితే వస్తోంది. ఇక దాదాపు బిగ్ బాస్ 4కి హోస్ట్ గా నాగార్జున ఫిక్స్ అయ్యారని కూడా తెలుస్తోంది. గత ఏడాది కంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకోబోతున్నారని కూడా టాక్ వస్తోంది. ఫైనల్ గా బిగ్ బాస్ విషయంలో నాగార్జున ఒక నిర్ణయానికి వచ్చారట.
Recommended Video

బిగ్ బాస్ కోసం..
ఒకవేళ బిగ్ బాస్ 4 స్టార్ట్ అయితే షో ఫినిష్ అయ్యేవరకు సినిమాల జోలికి వెళ్లకూడదని అనుకుంటున్నారట. కరోనా సమయంలో రిస్క్ చేయకూడదని సినిమా షూటింగ్స్ ని దాదాపు పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ 4తో జనాలకు దగ్గరగా ఉండవచ్చని పైగా రెమ్యునరేషన్ కూడా గట్టిగానే ఉంటుంది కాబట్టి నాగార్జున షూటింగ్స్ కొన్నాళ్లపాటు గ్యాప్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











