బాధతో చేతులెత్తి వేడుకున్న నాగార్జున.. ఊహించని పరిణామంతో కంటెస్టెంట్లు షాక్

తెలుగులో బిగ్ బాస్ షో మూడు సీజన్లను పూర్తి చేసుకుని నాలుగో సీజన్ కూడా రన్ అవుతోంది. ఈ నాలుగింటికీ ముగ్గురు స్టార్ హీరోలు హోస్టులుగా పని చేశారు. వారంతా తమదైన హోస్టింగ్ షోకు కొత్త వన్నెను తీసుకొచ్చారు. వీరిలో అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సీనియర్ హీరోగా అయినప్పటికీ బిగ్ బాస్‌లో మాత్రం చాలా తగ్గినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఓ విషయంలో చాలా బాధ పడ్డారు. ఆ ఆవేదనతోనే చేతులెత్తి వేడుకున్నారు. దీంతో కంటెస్టెంట్లు అందరూ షాక్‌కు గురయ్యారు. అసలేం జరిగింది.? పూర్తి వివరాల్లోకి వెళితే...

ఆకట్టుకున్న ఇద్దరు యంగ్ హీరోలు

ఆకట్టుకున్న ఇద్దరు యంగ్ హీరోలు

బిగ్ బాస్ మొదటి సీజన్‌ను జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేశాడు. అసలే మాత్రం అంచనాలు లేని ఈ షోను తనదైన హోస్టింగ్‌తో అద్భుతంగా నడిపించాడు. దీంతో ఈ సీజన్ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాతి సీజన్‌కు అతడు అందుబాటులో లేకపోవడంతో నేచురల్ స్టార్ నాని ఎంట్రీ ఇచ్చాడు. ఈ యంగ్ హీరో కూడా సహజసిద్ధమైన హోస్టింగ్ ఆకట్టుకుని షోను విజయవంతంగా నడిపాడు.

నాగార్జున ఎంట్రీతో మారిన ఫలితం

నాగార్జున ఎంట్రీతో మారిన ఫలితం

మూడో సీజన్‌కు హోస్టుగా సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్‌తోనే రికార్డు స్థాయి రేటింగ్ సాధించి తన సత్తాను నిరూపించుకున్నారు. అలాగే, ఆ సీజన్ మొత్తం అద్భుతమైన హోస్టింగ్‌తో అదరగొట్టారు. ఫైనల్స్‌కు మెగాస్టార్ చిరంజీవిని గెస్టుగా తీసుకొచ్చి మంచి ఫలితాన్ని రాబట్టారాయన.

నాలుగో సీజన్‌ కూడా గ్రాండ్‌‌గానే

నాలుగో సీజన్‌ కూడా గ్రాండ్‌‌గానే

తెలుగులో మూడు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్... నాలుగో సీజన్‌ను సైతం అదే రీతిలో ప్రసారం చేస్తోంది. మరీ ముఖ్యంగా ప్రారంభ ఎపిసోడ్‌కు రికార్డు స్థాయిలో 18 పైచిలుకు రేటింగ్ సాధించి గ్రాండ్ ఓపెనింగ్స్ సాధించింది. ప్రీమియర్ ఎపిసోడ్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున రెండు గెటప్స్‌లో కనిపించి మెప్పించడం కూడా దీనికి ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

మైమరపిస్తున్న హోస్ట్ నాగార్జున

మైమరపిస్తున్న హోస్ట్ నాగార్జున

గత సీజన్ మాదిరిగానే ఇందులో కూడా అక్కినేని నాగార్జున తనదైన శైలి హోస్టింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. వీకెండ్ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లతో సరదాగా ముచ్చటించడం.. ఆటలు ఆడించడం.. మంచిగా ఆడిన వారిని అభినందించడం.. గేమ్ సరిగా ఆడని వారిని మందలించడం వంటివి చేస్తూ మైమరపిస్తున్నారు. ఫలితంగా హోస్టింగ్‌లో తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నారు.

బాధతో చేతులెత్తి వేడుకున్న కింగ్

బాధతో చేతులెత్తి వేడుకున్న కింగ్

ఈ సీజన్‌లో తొలిసారి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు అక్కినేని నాగార్జున. దెయ్యం ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఇచ్చిన లగ్జరీ బడ్జెట్ టాస్క్‌ విఫలం కావడంతో కంటెస్టెంట్లు అందరినీ మందలించాడు బి్ బాస్. అలాగే, వరస్ట్ పెర్ఫార్మర్‌గా అభిజీత్‌ను ఎంపిక చేశాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలపై నాగ్ వాళ్లకు క్లాస్ వీకాడు. ఈ క్రమంలోనే బాధతో చేతులెత్తి వేడుకున్నాడు.

Recommended Video

Varsha Bollamma, Anand Devarakonda Interview Part 3 | Middle Class Melodies
ఊహించని పరిణామంతో వాళ్లు షాక్

ఊహించని పరిణామంతో వాళ్లు షాక్

గేమ్ సరిగా ఆడడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన నాగార్జున.. ఎపిసోడ్ చివర్లో కంటెస్టెంట్లు అందరికీ దండం పెట్టాడు. ‘ఫైనల్స్‌కు చేరువ అవుతున్నారు.. ఇకనైనా మంచిగా ఆడండి' అంటూ కుటుంబ సభ్యుడిలా వేడుకున్నాడు. నాగ్ మొహంలో నిరాశ కనిపించడంతో షాకైన కంటెస్టెంట్లు.. ప్రతి నమస్కారం చేశారు. ఇకపై గేమ్ సీరియస్‌గా ఆడతామని ఆయనకు ప్రామిస్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X