లేడీ కంటెస్టెంట్ విషయంలో నాగార్జున పొరపాటు: ఒకేసారి అంత మాట అనడంతో విమర్శలు
బిగ్ బాస్ షో అన్ని భాషల్లో కంటే తెలుగులోనే బాగా పాపులర్ అయిందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది ఇంతలా సక్సెస్ అవడం వెనుక ఎన్నో అంశాలు దోహదం చేశాయి. అందులో హోస్టులుగా చేసిన హీరోల పాత్ర కూడా చాలా ఉంది. మొదటి రెండు సీజన్లు నడిపించిన కుర్ర హీరోలు జూనియర్ ఎన్టీఆర్, నానిని మించి పోయి హోస్టింగ్ చేస్తున్నాడు అక్కినేని నాగార్జున. తనదైన శైలిలో ప్రేక్షకులకు మజాను పంచుతున్నాడు. అయితే, తాజాగా ఆయన లేడీ కంటెస్టెంట్ విషయంలో పొరపాటు చేయడంతో పాటు ఒకేసారి అంత మాట అనడంతో విమర్శలు వస్తున్నాయి. అసలేం జరిగింది? వివరాల్లోకి వెళ్తే...

తెలుగు వాళ్లకు చేరువ చేసింది అతడే
సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రసారం అయ్యే బిగ్ బాస్ షోను తెలుగులోకి తీసుకొచ్చిన సమయంలో ఎన్నో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అసలీ షో ఇక్కడ సక్సెస్ అవుతుందా అన్నదే మెయిన్ పాయింట్. అయితే, అందరి అనుమానాలకు పుల్‌స్టాప్ పెట్టేసి, షోను విజయవంతం చేశాడు అప్పటి హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్. అందుకే అతడు మంచి పేరును తెచ్చుకున్నాడు.

ఆ సీజన్ కూడా సక్సెస్ ఫుల్ చేశాడు
కొన్ని వివాదాల నడుమ మొదలైంది రెండో సీజన్. దీనికి నేచురల్ స్టార్ నాని హోస్టింగ్ చేశాడు. ఇందులోనూ అతడు సహజసిద్ధమైన హోస్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. అంతేకాదు, అప్పడు కౌశల్ ఆర్మీ ట్రోలింగ్ చేస్తున్న పరిస్థితుల్లోనూ చక్కగా షోను నడిపించాడు. కంటెస్టెంట్లకు క్లాస్ తీసుకోవడం.. మంచిగా ఆడితే ప్రోత్సహించడం వంటి వాటితో తన మార్క్ చూపించాడీ నేచురల్ స్టార్.

నాగార్జున రాకతో మొత్తం మారిందిగా
మొదటి రెండు సీజన్లను ఇద్దరు కుర్ర హీరోలు హోస్ట్ చేయగా.. మూడో సీజన్‌ను అక్కినేని నాగార్జున నడిపించాడు. ఈ సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్ నుంచి రికార్డుల మీద దండయాత్ర చేసిన ఆయన.. వీకెండ్ ఎపిసోడ్‌లను ఎంతో స్పెషల్‌గా మార్చాడు. అంతేకాదు, ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవిని తీసుకొచ్చి మరింత వన్నే తీసుకొచ్చాడు. ఫలితంగా ఈ సీజన్ కూడా సూపర్ సక్సెస్ అయింది.

అన్ని రంగాల్లో అద్భుతమై హోస్టింగ్‌తో
హోస్ట్ అంటే బిగ్ బాస్‌కు కంటెస్టెంట్లకు ప్రేక్షకులకు మధ్య వారధి అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాత్రకు వందకు వంద శాతం న్యాయం చేస్తున్నాడు నాగార్జున. ఆడియెన్స్ ఎవరి ఆటను ఎలా అనుకుంటున్నారో.. బిగ్ బాస్ రూల్స్ ఎవరు ఎలా పాటిస్తున్నారో.. కంటెస్టెంట్లకు వివరించే బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తున్నాడాయన. అందుకే బెస్ట్ హోస్ట్ అనిపించుకుంటున్నాడు.

లేడీ కంటెస్టెంట్ విషయంలో పొరపాటు
గత వారం జరిగిన దెయ్యం టాస్కులో హారిక మంచిగా ఆడలేదని, ఆమె కెప్టెన్సీ బాధ్యతలను చక్కగా నిర్వర్తించలేదని అక్కినేని నాగార్జున ఫైర్ అయిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఆమె అభిజీత్ కోసమే కెప్టెన్ అయిందని, అతడి కోసమే గేమ్ ఆడుతుందని కూడా అన్నాడు. అయితే, హారిక విషయంలో ఆయన పొరపాటు పడ్డాడని తాజాగా జరిగిన ఎపిసోడ్‌తో అర్థం అయింది.
Recommended Video

అంత మాట అనడంతో నాగ్‌పై విమర్శలు
గత ఎపిసోడ్‌లో ఇక్కడ అందరూ కలిసి గేమ్ ఆడుతున్నారని అవినాష్.. నాగార్జునకు కంప్లైంట్ చేశాడు. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘మీ గేమ్ మీరు ఆడటానికి ఏమేమి హెల్ప్ తీసుకుంటారు అనేది గెలవడానికి మాత్రమే' అని క్లారిటీ ఇచ్చాడు. దీంతో గత వారం హారిక చేసిన పనిని తప్పుబట్టిన నాగ్.. ఇప్పుడింత మాట అనే సరికి ఆయనపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











