నాగార్జున నోటి వెంట డబుల్ మీనింగ్ డైలాగ్: దెబ్బకు జబర్ధస్త్ కమెడియన్ పరువు గోవిందా.!

By Manoj

చాలా కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తున్నారు సీనియర్ హీరో అక్కినేని నాగార్జున. బడా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి వచ్చినప్పటికీ... అద్భుతమైన టాలెంట్‌తో తక్కువ సమయంలోనే స్టార్ హీరో అయ్యారాయన. ఆరు పదుల వయసున్నా... చెక్కు చెదరని అందంతో ఎంతో మందికి రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు. కెరీర్ పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ మంచి పేరుతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో తొలిసారి ఆయన నోటి వెంట డబుల్ మీనింగ్ డైలాగ్ వినిపించింది. దీంతో జబర్ధస్త్ కమెడియన్ పరువు పోయినంత పనైంది. వివరాల్లోకి వెళితే...

అక్కినేని హీరోకు తప్పని కష్టాలు

అక్కినేని హీరోకు తప్పని కష్టాలు

ఆ మధ్య వరుస విజయాలతో దూకుడును చూపించారు అక్కినేని నాగార్జున. అయితే, ఇటీవలి కాలంలో ఆయనకు సరైన హిట్ మాత్రం పడడం లేదు. ‘ఓం నమో వెంకటేశాయ', ‘రాజుగారి గది 2', ‘ఆఫీసర్', ‘దేవదాస్', ‘మన్మథుడు 2' ఇలా వరుసగా నిరాశ పరుస్తున్నారు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం ‘వైల్డ్ డాగ్' అనే మూవీ చేస్తున్నారు.

అందులో మాత్రం సూపర్ సక్సెస్

అందులో మాత్రం సూపర్ సక్సెస్

సుదీర్ఘమైన కెరీర్‌లో హీరోగా, నిర్మాతగా ఎన్నో విజయాలను అందుకున్నాడు కింగ్ నాగార్జున. ఇక, ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' అనే షోతో హోస్ట్‌గానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇది సూపర్ సక్సెస్ అవడంతో పాటు నాగ్‌కు మంచి పేరును తెచ్చి పెట్టింది. దీని తర్వాత బిగ్గెస్ రియాలిటీ షో బిగ్ బాస్‌తోనూ హోస్ట్‌గా మరోసారి తన సత్తాను చూపించాడీ సీనియర్ హీరో.

ఎన్టీఆర్, నానిని మించి రికార్డులు

ఎన్టీఆర్, నానిని మించి రికార్డులు

బిగ్ బాస్ మొదటి సీజన్‌ను జూనియర్ ఎన్టీఆర్, రెండో దానిని నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేశారు. వీళ్ల తర్వాత మూడు నాలుగు సీజన్లను అక్కినేని నాగార్జునే నడిపిస్తున్నారు. హోస్టింగ్‌లో ఎవరికి వారిదే పైచేయి అయినప్పటికీ.. రికార్డుల పరంగా మాత్రం మొదటి ఇద్దరినీ దాటేశాడు నాగ్. ఆయన హోస్ట్ చేసే ఎపిసోడ్స్‌ భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్ సాధించి ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాయి.

ఈ సీజన్‌లో సరికొత్త నాగార్జునగా

ఈ సీజన్‌లో సరికొత్త నాగార్జునగా

నాగార్జున ప్రస్తుతానికి బిగ్ బాస్ షో మీదనే ఎక్కువగా దృష్టి సారించారు. దీన్ని కూడా సూపర్ సక్సెస్ చేయాలన్న పట్టుదలతో ఉన్న ఆయన... ఇందుకోసం వ్యక్తిగతంగానూ చాలా మార్పులు చేసుకున్నారు. ఇందులో భాగంగానే తన లుక్‌, ఫిజిక్‌తో పాటు బాడీ లాంగ్వేజ్‌లో చాలా వైవిధ్యాన్ని చూపిస్తున్నారు. అలాగే, హౌస్‌మేట్స్‌తోనూ సరికొత్తగా సంభాషిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు.

జబర్ధస్త్ కమెడియన్‌కు చుక్కలు

జబర్ధస్త్ కమెడియన్‌కు చుక్కలు

ఈ శనివారం జరిగిన బిగ్ బాస్ సీజన్ -4 ఎపిసోడ్‌లో నాగార్జున హౌస్‌లోని కొందరు సభ్యులను సరదాగా టార్గెట్ చేశాడు. మరీ ముఖ్యంగా జబర్ధస్త్ కమెడియన్ ముక్కు అవినాష్‌ను ఓ ఆట ఆడుకున్నారు. ఆరియానా గ్లోరీతో ట్రాక్ నడుపుతున్నావని, మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో చెప్పమని బెదిరించారు. ఈ క్రమంలోనే ఆయన నోటి వెంట ఓ డబుల్ మీనింగ్ డైలాగ్ వదిలారు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Swati Dixit Eliminated కొంపతీసి గెస్ట్ గా వచ్చిందా ?
 నాగ్ డైలాగ్‌ వల్ల పరువు గోవిందా

నాగ్ డైలాగ్‌ వల్ల పరువు గోవిందా

ఆ సందర్భంలో జరిగిన సంభాషణను ప్రస్తావిస్తూ ‘అవినాష్‌కు ఏమీ లేవంట' అంటూ ఓ డబుల్ మీనింగ్ డైలాగ్ వాడాడు నాగ్. దీంతో అక్కడే ఉన్న హౌస్‌మేట్స్ నవ్వేశారు. ఆ వెంటనే తేరుకున్న జబర్ధస్త్ స్టార్ ‘సార్... సార్ నా పరువు తీయకండి. నాకు చాలా ఉన్నాయి. అసలే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇది ఎవరైనా చూశారంటే పిల్లను కూడా ఇవ్వరు' అంటూ వేడుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X