Bigg Boss Telugu 6: బాత్రూంలోనే ఆ కంటెస్టెంట్.. రిక్వెస్ట్ చేసినా వదలకుండా.. షాకిచ్చిన నాగార్జున
బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా వచ్చి దేశంలోనే నెంబర్ వన్ రియాలిటీ షోగా పేరు సంపాదించుకుంది బిగ్ బాస్. హిందీలో చాలా ఏళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ షో.. ఐదేళ్ల క్రితమే తెలుగులోకి పరిచయం అయింది. ఇక్కడ బుల్లితెర చరిత్రలోనే ఎవరూ ఊహించని స్థాయిలో ప్రేక్షకుల నుంచి స్పందనను అందుకుని నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్‌ను నడుపుతున్నారు. ఇందులో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఓ కంటెస్టెంట్‌కు నాగార్జున అదిరిపోయే షాక్ ఇచ్చాడు. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీ అందరి కోసం!

ఎంత మార్చినా చూడట్లేదుగా
మిగిలిన భాషల కంటే బిగ్ బాస్ షోకు తెలుగులోనే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. అందుకు అనుగుణంగానే దీన్ని సరికొత్త కంటెంట్‌తో తీసుకు వస్తున్నారు. ఇక, గత వారంలో మొదలైన ఆరో సీజన్‌ను కూడా ఎన్నో ప్రయోగాలతో నడిపిస్తున్నారు. దీన్ని మరింత కొత్తగా మార్చేందుకు వినూత్నమైన ప్లాన్లతో ముందుకు వస్తున్నారు. అయినప్పటికీ రేటింగ్‌ను అంతగా తెచ్చుకోవడంలేదు.

ఈ వారం అలా.. ఇంకో కెప్టెన్
ఆరో సీజన్‌లో ఎనిమిదో వారం కెప్టెన్సీ పోటీదారులను ఎంపిక చేసేందుకు నిర్వహకులు 'చేపల చెరువు' అనే టాస్కును ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో కంటెస్టెంట్ల మధ్య ఎన్నో గొడవలు జరిగాయి. ఇక, ఈ టాస్కులో మంచిగా ఆడిన వాళ్ల నుంచి ముగ్గురు తుది దశకు చేరుకున్నారు. ఇందులో శ్రీహాన్ కంటెస్టెంట్ల మద్దతుతో గెలిచి ఇంటికి కొత్త కెప్టెన్ అయ్యాడు.

శనివారం ఎపిసోడ్‌పై ఆసక్తిగా
గతంలో కంటే ఆరో సీజన్‌లో అక్కినేని నాగార్జున కంటెస్టెంట్లపై విరుచుకుపడుతున్నాడు. తప్పు చేసిన వాళ్లను ఏమాత్రం మొహమాటం లేకుండా తిడుతున్నాడు. అంతేకాదు, గత వారం ఏకంగా ఇద్దరిని నేరుగా నామినేట్ కూడా చేశాడు. ఈ నేపథ్యంలో 8వ వారంలో చాలా తప్పులు జరగడంతో శనివారం ఎపిసోడ్‌పై ఆసక్తి నెలకొంది. దీనికోసం చాలా మంది వేచి చూస్తున్నారు.

వాళ్లందరికీ నాగార్జున క్లాస్‌లు
బిగ్ బాస్ షోలో సాధారణంగా శని, ఆదివారాలు హోస్ట్ అక్కినేని నాగార్జున సందడి చేస్తుంటాడు. ఇందులో భాగంగానే శనివారం రాత్రి జరిగిన ఎపిసోడ్‌లో ఆయన గత వారం జరిగిన 'చేపల చెరువు' టాస్కులో పొరపాట్లు చేసిన కంటెస్టెంట్లపై నాగార్జున ఓ రేంజ్‌లో సీరియస్ అయ్యాడు. ఈ క్రమంలోనే కొందరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఊహించని విధంగా క్లాస్‌లు పీకాడు.

గీతూ రాయల్‌కు ఓ రేంజ్‌లో
శనివారం జరిగిన ఎపిసోడ్‌లో అక్కినేని నాగార్జున.. గీతూ రాయల్ ఆటతీరుపై బాగా కోప్పడ్డాడు. మరీ ముఖ్యంగా ఆమె 'చేపల చెరువు' టాస్కులో ఆడిన తీరు.. సంచాలకురాలిగా చేసిన ఓవర్‌తో నాగార్జునకు మండిపోయింది. వీటిని ప్రస్తావిస్తూ ఆమెను బాగా తిట్టాడు. దీంతో బిగ్ బాస్ ఆరో సీజన్‌లో గీతూ రాయల్ తొలిసారి ఏమీ మాట్లాడకుండానే మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది.

ఓసీడీ ఉందని చెప్పడంతో
ఎనిమిదో వారంలో చెత్త ఆటతీరుతో నిరాశ పరిచిన గీతూ రాయల్‌కు అక్కినేని నాగార్జున పనీష్‌మెంట్ ఇవ్వాలని అనుకున్నాడు. ఇందుకోసం కెప్టెన్ శ్రీహాన్‌ను పిలిచి ఏ శిక్ష విధించాలి అని అడిగాడు. దీంతో ఇంట్లోని గిన్నెలన్నీ వారం రోజుల పాటు కడగాలి అని చెప్పాడు. అప్పుడు గీతూ 'నాకు ఓసీడీ ఉంది సార్.. నేను ఆ పని చేయలేను' అంటూ నాగార్జునకు రిక్వెస్ట్ చేసింది.

వారం రోజులు బాత్రూంలోనే
వెజల్స్ క్లీన్ చేయలేను అని గీతూ రాయల్ రిక్వెస్ట్ చేయడంతో నాగార్జున.. 'సరే గీతూ.. నువ్వు గిన్నెలు కడగను అంటున్నావు కాబట్టి.. బాత్రూం క్లీన్ చేయ్. ఇప్పుడు చెప్పు గిన్నెలు తోముతావా? బాత్రూంలు కడుగుతావా' అని ప్రశ్నిస్తాడు. దీంతో గీతూ తప్పని పరిస్థితుల్లో వాష్ రూమ్‌లు కడిగేందుకు ఒప్పుకుంది. దీంతో ఈ వారం అంతా ఆమె బాత్రూంలోనే పని చేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











