నాగార్జున రీఎంట్రీ: వచ్చీ రావడంతోనే ఆ ఇద్దరికి క్లాస్.. ఎలిమినేట్ అయ్యేది అతడేనా.!

Recommended Video

KING #Nagarjuna is Back with a Bang!!! #BiggBossTelugu3

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్'.. మూడు గొడవలు.. నాలుగు ఫైటింగులుగా సాగుతోంది. గత రెండు సీజన్లతో పోల్చుకుంటే ఇందులో కంటెస్టెంట్ల మధ్య సమన్వయం కుదరడం లేదు. దీంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో సీజన్ -3లో ఎన్నో కొత్త కొత్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అదే సమయంలో రొమాన్స్, లవ్, ఏడుపులు సహా పలు ఎమోషన్స్ కూడా కనిపిస్తున్నాయి. దీంతో బిగ్ బాస్ షో ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పుడు వీకెండ్ రావడంతో ఈ సారి ఎవరు ఎలిమినేట్ అవుతారన్న ఆసక్తి సర్వత్రా కనిపిస్తోంది. ఇంతకీ వెళ్లిపోయేది ఎవరు.?

నాగార్జున రీఎంట్రీ

గత వారం బిగ్ బాస్ షోకు దూరంగా ఉన్న నాగార్జున.. ఈ వారం మాత్రం రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ మేరకు బిగ్ బాస్ నిర్వహకులు ఓ ప్రోమోను కూడా విడుదల చేశారు. నాగార్జున పుట్టినరోజు ఉండడం వల్ల ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి స్పెయిన్ వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో రమ్యకృష్ణ హోస్ట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

రావడంతోనే వాళ్లపై ఫైర్

రావడంతోనే వాళ్లపై ఫైర్

ఈ వారం ఒకరిని మరొకరు నెట్టుకోవడం, మీద పడిపోవడం, గొడవలు పెట్టుకోవడం వంటి వాటితో ఈ టాస్క్ రణరంగంగా సాగింది. ముఖ్యంగా ఇందులో అలీ రేజా రెచ్చిపోయి ఆడాడు. ఈ క్రమంలో అతడికి, పలుమార్లు గొడవకు దిగిన పునర్నవికి సైతం నాగార్జున క్లాస్ పీకాడు. దీనిని ప్రోమోలో చూపించారు. బాస్ రావడం రావడమే సీరియస్‌గా వచ్చినట్లు కనిపిస్తున్నాడు.

వాళ్లకు కూడా ఉందా?

వాళ్లకు కూడా ఉందా?

ఈ వారం నిర్వహించిన టాస్క్‌ను అర్థాంతరంగా ముగించాడు బిగ్ బాస్. దీనికి కారణం అక్కడ జరిగిన గొడవలే. ఇది ఏ ఒక్కరి వల్లే కాలేదు. ఈ టాస్క్ రద్దు అవడానికి అందరూ కారణమే. ఇదే విషయాన్ని నాగార్జున కూడా ప్రస్తావించాడు. టాస్క్ రద్దు అయిందంటే మీరంతా హద్దు దాటినట్లే అని నాగార్జున సీరియస్ అయ్యాడు.

డేంజర్‌ జోన్‌లో ఆ ఇద్దరు

డేంజర్‌ జోన్‌లో ఆ ఇద్దరు

మొదటి సారి ఎలిమినేషన్‌లో ఉన్నానన్న ప్రస్టేషనో ఏమో గానీ అలీ రేజా ఈ టాస్క్‌లో క్రూరంగా ప్రవర్తించాడన్న టాక్ వినిపిస్తోంది. అందుకే ఈ సారి ఓటింగ్‌లో అతడికి వ్యతిరేకంగా ఓట్లు పోలవుతున్నాయి. దీంతో అలీ రేజా డేంజర్ జోన్‌లో పడిపోయినట్లు కొన్ని సైట్స్ చూపిస్తున్నాయి. అలాగే, మహేశ్ విట్టా కూడా చివరి స్థానంలో ఉన్నట్లు మరికొన్ని చూపిస్తున్నాయి. దీంతో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X