Bigg Boss Telugu 7 : నాగార్జున రెమ్యూనరేషన్ లీక్.. ఒక్క ఎపిసోడ్‌కు ఎంత తీసుకుంటున్నారో తెలుసా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రారంభం అయి నాలుగు వారాలు అవుతుంది. సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన ఈ షో.. సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఇక ఈసారి ఉల్టా పుల్టా అంటూ ఈసారి బిగ్ బాస్ షో ఆసక్తిగా సాగుతోంది. అయితే బిగ్ బాస్ హోస్టుగా నిర్వహిస్తున్న నాగార్జున ఈ షో కోసం భారీ మొత్తంలో తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ వివరాలు, ఒక్కో ఎపిసోడ్ కు ఎంత ఛార్జ్ చేస్తున్న అనే అంశాలపై ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తెలుగులో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉన్న షోలలో బిగ్ బాస్ ఒకటి. ప్రతి ఏడాది ఈ షో కోసం ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఇక సెప్టెంబర్ 3న ఈ సీజన్ ఘనంగా ప్రారంభం అయింది. అయితే ఈ సారి ఉల్టా పుల్టా షో అంటూ నిర్వహకులు చెప్పుకువచ్చారు. అందుకు తగ్గట్లుగానే ఈసారి గేమ్ అంతా కొత్తగా ఉంది. కొత్త టాస్కులు, సరదా గేమ్స్ పెడుతూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు.

అయితే ఈ సీజన్ లో కేవలం 14మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఎంటర్ అయ్యారు. ఇక ఇప్పటికే 3మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వగా... కేవలం 11మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక వారిలో ముగ్గురు శివాజీ, శోభా శెట్టి, సందీప్ హోజ్ మేట్స్ గా కన్ఫార్మ్ అయ్యారు. ఇక మిగిలిన 8 మంది కంటెస్టెంట్స్ హౌజ్ మేట్స్ అయ్యేందుకు టాస్కులు ఆడుతూ ప్రేక్షకులకు ఎంటర్ టైన్మెంట్ ఇస్తున్నారు.
అయితే ఇప్పటికే ఆ 14మంది కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ గురించి చెప్పుకున్నాం. అత్యధికంగా శివాజీ వారానికి 4 లక్షలు తీసుకుంటుండగా... అత్యల్పంగా పల్లవి ప్రశాంత్ వారానికి కేవలం 1 లక్ష రూపాయలు తీసుకుంటున్నారు. ఇక నాగార్జున రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ఆయనకు బిగ్ బాస్ నిర్వాహకులు ఊహించని రేంజులో పారితోషికం ఇస్తున్నట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ షో 3వ సీజన్ నుంచి నాగార్జున హోస్టుగా నిర్వహిస్తున్నారు. ఆయన గత సీజన్ల కంటే.. ఈ సీజన్ కు వచ్చే సరికి ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఎపిసోడ్ కు నాగార్జున ఒక కోటి రూపాలయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సీజన్ కనీసం 3నెలలు ఉంటుంది. అంటే దాదాపు 12వారాలకు పైగే నడుస్తుంది. శని, ఆది వారాల ఎపిసోడ్స్ కలుపుకుని అలా సీజన్ మొత్తం మీద ఆయనకు 20 కోట్ల పైనే రెమ్యూనరేషన్ అందుతుందని సమాచారం.
ఈ లెక్కన చూసుకుంటే... నాగార్జున ఓ సినిమాలు చేసినంత రెమ్యూనరేషన్ ఈ షో ద్వారా వచ్చేస్తుంది. అయితే ఈ షో కోసం నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ కోసం ఓ రోజు కేటాయిస్తే సరిపోతుంది. మొత్తంగా ఆయన ఈ షో కోసం 15 రోజులు కేటాయిస్తారు. అలా అయితే నాగార్జునకు బిగ్ బాస్ షో కలిసివచ్చినట్లే అనిచెప్పవచ్చు. ప్రస్తుతం నాగార్జున నా సామిరంగ సినిమా షూటింగ్ లోనూ బిజి బిజిగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











