‘బిగ్ బాస్’ అప్‌డేట్: ఫస్ట్ ఎపిసోడ్ షూట్ పూర్తి చేసిన నాగ్.. కంటెస్టెంట్ల పూర్తి జాబితా ఇదే

Recommended Video

Bigg Boss Telugu 3 : First Episode Shoot Completed, Here's The Full List Of Contestants | Filmibeat

ఒకవైపు వివాదాలు చుట్టుముడుతున్నా.. 'బిగ్ బాస్' షో మాత్రం ప్రారంభానికి సిద్ధం అవుతోంది. తెలుగు బుల్లితెర చరిత్రలోనే ఈ షోకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఉత్తరాదిలో ప్రారంభమై తెలుగులో సాదాసీదా షోగా వచ్చినా.. తక్కువ వ్యవధిలోనే భారీ రెస్పాన్స్ సంపాదించుకుందీ ఈ రియాలిటీ షో. అక్కినేని నాగార్జునను హోస్టుగా తీసుకువచ్చారు. ఇటీవల వచ్చిన రెండు ప్రోమోలకు కూడా భారీ స్పందన వచ్చింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో షో నిర్వహకులు ప్రారంభ కార్యక్రమానికి సన్నాహాలు చేస్తున్నారు.

మొదటి ఎపిసోడ్ పూర్తి

మొదటి ఎపిసోడ్ పూర్తి

‘బిగ్ బాస్' సీజన్ - 3లో నాగార్జున హోస్ట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ షోలో భాగంగా అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఆయన శుక్రవారం సాయంత్రమే మొదటి ఎపిసోడ్‌ను పూర్తి చేసేశారు. అంటే శుక్రవారం సాయంత్రమే ‘బిగ్ బాస్' కంటెస్టెంట్లు హౌస్‌ లోపలికి వెళ్లిపోయారన్న మాట. ఇది ఆదివారం సాయంత్రం ‘స్టార్ మా'లో ప్రసారం అవుతుంది.

ఫైనల్ లిస్ట్ వచ్చేసింది

ఫైనల్ లిస్ట్ వచ్చేసింది

‘బిగ్ బాస్' షో అంటేనే తొలిరోజు ఎపిసోడ్ ముగిసే వరకు కంటెస్టెంట్ల వివరాలు బయటకు రావు. ఈ సారి కూడా షో నిర్వహకులు అదే తరహా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ, సీజన్ - 3లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల వివరాలు బయటకు వచ్చేశాయి. ఈ షోలో ఈ సారి 15 మంది ఎంటరయ్యారు. ఇందులో ఓ కామన్ మ్యాన్ కూడా ఉంటారని తెలిసింది.

కంటెస్టెంట్లు వీళ్లే

కంటెస్టెంట్లు వీళ్లే

తాజాగా అందిన సమాచారం ప్రకారం సీజన్‌ - 3లో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లే. ఈ జాబితాను మీరు కూడా చూసేయండి.

  • 1. హిమజ
  • 2. వరుణ్ సందేశ్
  • 3. వితికా శేరు
  • 4. శ్రీముఖి
  • 5. హేమ
  • 6. సావిత్రి (తీన్మార్ ఫేమ్)
  • 7. రవికృష్ణ (సీరియల్ యాక్టర్ )
  • 8. అలీ రేజా (సీరియల్ యాక్టర్ )
  • 9. జాఫర్ (TV9 యాంకర్)
  • 10. నటి పునర్నవి
  • 11. బాబా భాస్కర్ (కొరియోగ్రాఫర్)
  • 12. రాహుల్ సిప్లిగంజ్ (సింగర్)
  • 13. మహేష్ (యూట్యూబ్ కామెడీ స్టార్)
  • 14. రోహిణి (సీరియల్ నటి)
  • 15. కామన్ మ్యాన్
  • నూతన్ నాయుడు వీడియోతో వచ్చాడు

    నూతన్ నాయుడు వీడియోతో వచ్చాడు

    ‘బిగ్ బాస్' సీజన్ - 2లో కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు తాజాగా ఓ వీడియోతో బయటకు వచ్చాడు. ఇందులో సీజన్ - 3కి సంబంధించిన వివరాలను వెల్లడించడంతో పాటు ఈ సారి ఎవరెవరు కంటెస్టెంట్లుగా వస్తున్నారన్న విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఈ మేరకు విడుదల చేసిన వీడియోలు కొన్ని పేర్లు కూడా బయట పెట్టాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    మరోవైపు వివాదాలు

    ‘బిగ్ బాస్' సీజన్ - 3 ప్రారంభానికి సిద్ధం అవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన మొదటి ఎపిసోడ్ కూడా పూర్తయిపోయింది. అదే సమయంలో ఈ షోను నిషేదించాలన్న డిమాండ్ కూడా ఎక్కువైపోయింది. అలాగే, కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడం.. కోర్టులో పిటిషన్ వేయడం వంటివి చేశారు. దీంతో తెలుగు ‘బిగ్ బాస్' హాట్ టాపిక్ అయిపోయింది.

    దేశ రాజధానికి పాకింది

    దేశ రాజధానికి పాకింది

    ‘బిగ్ బాస్' నిర్వాహకులపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా రెండు రోజుల క్రితం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధమయ్యారు. అలాగే, ఈ షోకు వ్యతిరేకంగా ప్రముఖ దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డితో కలిసి జంతర్‌మంతర్‌లో ధర్నా చేశారు. వెంటనే షోను నిలిపి వేయాలని నినాదాలు చేస్తూ.. ప్లకార్డులతో నిరసన తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X