twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్ ప్రోమో: ఇలాంటివి అక్కడ కుదరదంటున్న నాగ్

    |

    Recommended Video

    Bigg Boss Telugu 3 : Bigg Boss Telugu 3 To Premiere On July 21 || Filmibeat Telugu

    తెలుగు బుల్లితెర చరిత్రలోనే 'బిగ్ బాస్'కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సాదాసీదా షోగా వచ్చినా.. తక్కువ వ్యవధిలోనే భారీ రెస్పాన్స్ సంపాదించుకుందీ ఈ రియాలిటీ షో. మొదటి రెండు సీజన్లకు వచ్చిన రెస్పాన్స్‌ను బట్టి ఈ సారి సరికొత్తగా ట్రై చేయబోతున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే అక్కినేని నాగార్జునను హోస్టుగా తీసుకువచ్చారు. ఇటీవల వచ్చిన ఓ ప్రోమోకు కూడా భారీ స్పందన వచ్చింది. తాజాగా మరో ప్రోమోతో వచ్చాడు కింగ్ నాగార్జున.

    ప్రోమోలో ఏముందంటే..

    పారిశుద్య కార్మికులు రోడ్డు క్లీన్ చేస్తుండగా, ఓ రాజకీయ నాయకుడు వచ్చి వాళ్ల చేతిలో చీపుర్లు తీసుకుని ఊడ్చుతుంటాడు. దాన్ని ఓ వ్యక్తి సీక్రెట్‌గా వీడియో తీస్తుంటాడు. తర్వాత ఓ అమ్మాయి ముగ్గు వేశానంటూ ఓ సెల్ఫీ తీసుకుంటుంది. కానీ, అది వేరేవాళ్లు వేసిన ముగ్గు. అలాగే మరో వ్యక్తి ఒక బిల్డింగ్ నిర్మిస్తున్న ప్రదేశంలో ఇసుకలో పడుకుని, వీడియో కాల్ మాట్లాడుతుంటాడు. కానీ, బీచ్‌లో ఉన్నానని చెబుతాడు.

     చివర్లో నాగ్ డైలాగ్

    చివర్లో నాగ్ డైలాగ్

    అందరూ కెమెరాను వాడుకుని ఎన్నో తప్పుడు సమాచారాలు ఇస్తుంటారని, కానీ బిగ్ బాస్ హౌస్‌లో అలాంటివి కుదరవని చెప్పడమే ఈ ప్రోమో ఉద్దేశ్యం. అందుకే ఆఖర్లో ‘‘కెమెరా ఆన్ కాగానే యాక్టింగ్ మొదలుపెట్టేస్తారందరూ. కానీ, అది అక్కడ కుదరదు. 24 గంటలు, 64 కెమెరాలు.. నో యాక్టింగ్.. ఓన్లీ రియాలిటీ'' అంటూ చివర్లో నాగ్ చెప్పే డైలాగ్‌తో ఈ ప్రోమో ముగుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

    కంటెస్టెంట్ల విషయం సీక్రెట్‌గా..

    కంటెస్టెంట్ల విషయం సీక్రెట్‌గా..

    ‘బిగ్ బాస్' సీజన్ -3లో పాల్గొనే కంటెస్టెంట్ల విషయంలో స్టార్ మా యాజమాన్యం సీక్రెట్‌ను కొనసాగిస్తోంది. అయినా.. ఈ షోలో ఫలానా హీరో పాల్గొనబోతుంది.. ఆ హీరోయిన్ వస్తోంది.. ఈ కమెడియన్ ఉంటాడు అంటూ ఎన్నో వార్తలు వెలువడుతున్నాయి. అంతేకాదు, సోషల్ మీడియాలో కంటెస్టెంట్ల జాబితా ఇదేనంటూ కొన్ని పేర్లు సైతం ప్రత్యక్షమవుతున్నాయి. దీని గురించి తెలియాలంటే మాత్రం షో ప్రారంభమయ్యే వరకూ ఆగాల్సిందే.

    బిగ్‌ బాస్ ఎప్పుడు ప్రారంభమవుతుందంటే..

    బిగ్‌ బాస్ ఎప్పుడు ప్రారంభమవుతుందంటే..

    తెలుగులో అత్యంత పాపులారిటీ సంపాదించుకున్న ‘బిగ్‌బాస్' సీజన్ 3 ఈ నెల 21 నుంచి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. గత రెండు సీజన్లకు జూనియర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని హోస్టులుగా వ్యవహరించగా.. ఈ సీజన్‌కు మాత్రం అక్కినేని నాగార్జున రంగంలోకి దిగబోతున్నారు. ఈ మేరకు స్టార్ మా యాజమాన్యం ఇప్పటికే ఓ ప్రోమోను విడుదల చేసిన విషయం తెలిసిందే.

    English summary
    Big boss reality show Full success in Telugu Television History. Two seasons succesfully completed. And 3 One Starts In Few days. This season Was Host By Akkineni Nagarjuna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X