అవినాష్‌కు నాగార్జున బిగ్ సర్‌ప్రైజ్: ఎలిమినేట్ అయినా నో ప్రాబ్లమ్.. అనందం పట్టలేక ఇలా!

గత వాటితో పోలీస్తే ప్రస్తుతం ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ నాలుగో సీజన్‌ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటి వరకూ జరిగిన ఎలిమినేషన్లు షోను వేరే లెవెల్‌కు తీసుకెళ్లాయి. మరీ ముఖ్యంగా మూడు సీజన్లలోనూ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో ముందే అంచనా వేసేవాళ్లు. కానీ, ఈ సీజన్‌లో మాత్రం ఎన్నో ట్విస్టులు కనిపిస్తున్నాయి. ఇలానే ఇటీవల షో నుంచి బయటకు వెళ్లిపోయాడు జబర్ధస్త్ కమెడియన్ ముక్కు అవినాష్. ఈ నేపథ్యంలో తాజాగా అతడికి ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు హోస్ట్ అక్కినేని నాగార్జున. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

జబర్ధస్త్ నుంచి బిగ్ బాస్‌లోకి ఎంట్రీ

జబర్ధస్త్ నుంచి బిగ్ బాస్‌లోకి ఎంట్రీ

ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చాడు అవినాష్. అద్భుతమైన టాలెంట్‌తో చాలా తక్కువ సమయంలోనే టీమ్ లీడర్‌గా ఎదిగిపోయాడు. ఇలా సత్తా చాటుతోన్న సమయంలోనే బిగ్ బాస్ రియాలిటీ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. నాలుగో సీజన్‌లో వైల్డ్ కార్డ్ ద్వారా ప్రవేశించిన అతడు.. తన మార్క్ కామెడీని పంచుతూ ఆకట్టుకున్నాడు.

 ఆరియానాతో ట్రాకుతో హాట్ టాపిక్‌

ఆరియానాతో ట్రాకుతో హాట్ టాపిక్‌

బిగ్ బాస్ హౌస్‌లో అందరితోనూ సరదాగా ఉంటూ, నవ్విస్తూ బెస్ట్ ఎంటర్‌టైనర్ అనిపించుకున్నాడు అవినాష్. అదే సమయంలో తోటి కంటెస్టెంట్ ఆరియానా గ్లోరీతో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు కలరింగ్ ఇచ్చి హాట్ టాపిక్ అయ్యాడు. తరచూ ఆమెను ఇంప్రెస్ చేస్తుండేవాడు. అదే సమయంలో ఆమెకు అనుకూలంగా గేమ్ ఆడుతూ పలుమార్లు కంటెస్టెంట్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు.

దానితో చెడ్డ పేరు తెచ్చుకున్నాడు

దానితో చెడ్డ పేరు తెచ్చుకున్నాడు

టాస్క్ వచ్చిందంటే చాలు.. దాని కోసం వందకు వంద శాతం శ్రమించేవాడు అవినాష్. ఈ క్రమంలోనే పలుమార్లు గాయాలపాలయ్యాడు. అయితే, నామినేషన్‌లో ఉంటే మాత్రం అస్సలు తట్టుకునే వాడు కాదు. అంతేకాదు, తరచూ సింపతీ గేమ్ ఆడుతూ విమర్శలు ఎదుర్కొన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ కారణంగానే అతడిపై ప్రేక్షకుల్లో వ్యతిరేకత కూడా వ్యక్తం అయింది.

ఆమె కోసం అవినాష్ బలైపోయాడు

ఆమె కోసం అవినాష్ బలైపోయాడు

గత వారం ఊహించని పరిణామాల నడుమ అవినాష్ బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిపోయాడు. ఈ ఎలిమినేషన్ ఎంతో ఎమోషనల్‌గా సాగింది. వాస్తవానికి గత వారం మోనాల్ అతడిని కాలితో తన్నింది. దీంతో అతడికి సింపతీ వర్కౌట్ అయింది. ఆ తర్వాత అతడికి ఓట్లు కూడా బాగానే పోలయ్యాయి. కానీ, మోనాల్‌ను కొనసాగిస్తూ అనూహ్యంగా అవినాష్‌ను పంపేశారు.

అవినాష్‌కు నాగార్జున బిగ్ సర్‌ప్రైజ్

బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత అవినాష్.. వరుస పార్టీలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. క్లోజ్ ఫ్రెండ్ అయిన శ్రీముఖి అండ్ బ్యాచ్ అతడికి గ్రాండ్ వెల్‌కం పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా పలు ఇంటర్వ్యూలతో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అవినాష్‌కు బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు.

Recommended Video

Chiranjeevi Helps His Fan Financially For His Daughter's Wedding
 ఎలిమినేట్ అయినా బాధ లేకుండా

ఎలిమినేట్ అయినా బాధ లేకుండా

బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో అవినాష్.. నాగార్జునను ఉద్దేశించి ‘సార్ మీ షర్ట్ బాగుంది' అని అన్నాడు. దీంతో గుర్తు పెట్టుకుని మరీ ఆ షర్ట్‌ను అవినాష్‌కు నేరుగా ఇంటికి పంపించాడు నాగ్. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించాడీ జబర్ధస్త్ కమెడియన్. అంతేకాదు, ఆ షర్ట్‌ను ధరించి దిగిన ఫొటోను కూడా షేర్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X