For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: హౌస్‌లో అలాంటి పనులు.. ఆ కంటెస్టంట్ పరువు తీసిన నాగార్జున.. షో చరిత్రలో తొలిసారి ఇలా!

  |

  జనరేషన్లు మారుతుండడంతో బుల్లితెరపై వచ్చే కార్యక్రమాల్లో కూడా వైవిధ్యం కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా రియాలిటీ షోలే వస్తున్నాయి. అయితే, అలా వచ్చిన వాటిలో జనాల మద్దతును అందుకుని నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్ మాత్రమే. అందుకే ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా నిర్వహకులు సీజన్ల మీద సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో దాన్ని వైవిధ్యంగా నడుపుతున్నారు. ఇక, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఓ కంటెస్టెంట్‌పై హోస్ట్ అక్కినేని నాగార్జున విరుచుకుపడ్డాడు. అసలేం జరిగిందో మీరే చూసేయండి!

  ఇప్పుడిప్పుడే పెరుగుతోందిగా

  ఇప్పుడిప్పుడే పెరుగుతోందిగా

  మిగిలిన భాషల కంటే బిగ్ బాస్ షోకు తెలుగులోనే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. అందుకు అనుగుణంగానే ఆరో సీజన్‌లో దీన్ని సరికొత్త కంటెంట్‌తో తీసుకు వస్తున్నారు. అలాగే, ఎన్నో ప్రయోగాలతో నడిపిస్తున్నారు. ఇలా మొత్తంగా దీన్ని మరింత కొత్తగా మార్చేందుకు వినూత్నమైన ప్లాన్లతో ముందుకు వస్తున్నారు. దీంతో ఇప్పుడిప్పుడే దీనికి రేటింగ్ పెరుగుతోంది.

  యాంకర్ మంజూష అందాల అరాచకం: పైటను పక్కకు జరిపి మరీ హాట్ షో

  ఈ వారం అలా.. పాస్ ఫైమాకే

  ఈ వారం అలా.. పాస్ ఫైమాకే

  బిగ్ బాస్ ఆరో సీజన్‌లో పదకొండో వారానికి సంబంధించి.. ప్రైజ్ మనీలో కోతను విధిస్తూ 'ఇమ్యూనిటీ టాస్కు'ను ఇచ్చారు. ఆ తర్వాత కెప్టెన్సీ పోటీదారుల కోసం కూడా అమౌంట్ తగ్గించారు. ఇందులో రేవంత్ గెలిచాడు. ఇక, చివర్లో 'ఎవిక్షన్ ఫ్రీ పాస్'ను టాస్క్‌ను కూడా నిర్వహించారు. ఎంతో ఆసక్తికరంగా సాగిన ఈ టాస్కులో ఫైమా విజేతగా నిలిచి పాస్‌ను సొంతం చేసుకుంది.

  శనివారం ఎపిసోడ్‌పై ఆసక్తిగా

  శనివారం ఎపిసోడ్‌పై ఆసక్తిగా

  అక్కినేని నాగార్జున బిగ్ బాస్ ఆరో సీజన్‌లో కంటెస్టెంట్లపై విరుచుకుపడుతున్నాడు. తప్పు చేసిన వాళ్లను ఏమాత్రం మొహమాటం లేకుండా తిడుతున్నాడు. అంతేకాదు, గత వారం ఏకంగా ఇద్దరిని నేరుగా నామినేట్ కూడా చేశాడు. ఈ నేపథ్యంలో నాలుగో వారంలో చాలా తప్పులు జరగడంతో శనివారం ఎపిసోడ్‌పై ఆసక్తి నెలకొంది. దీనికోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు.

  యాంకర్ వర్షిణి హాట్ సెల్ఫీ వైరల్: ఆ పార్ట్‌ను హైలైట్ చేస్తూ అరాచకం

  పిట్ట కథ చెప్పి... వాళ్లకు క్లాస్

  పిట్ట కథ చెప్పి... వాళ్లకు క్లాస్

  బిగ్ బాస్ షోలో సాధారణంగా శని, ఆదివారాలు హోస్ట్ అక్కినేని నాగార్జున సందడి చేస్తుంటాడు. ఇందులో భాగంగానే శనివారం రాత్రి జరిగిన ఎపిసోడ్‌లో ఆయన ఓ పిట్టకథను చెప్పి మరీ కంటెస్టెంట్లకు ఓ రేంజ్‌లో క్లాస్ పీకాడు. అంతేకాదు, గత వారం జరిగిన కొన్ని తప్పిదాలకు సంబంధించిన వీడియోలను చూపిస్తూ ఫైర్ అయ్యాడు. దీంతో నిన్నటి ఎపిసోడ్ సీరియస్‌గా సాగింది.

  ఆది రెడ్డి టార్గెట్.. దారుణంగా

  ఆది రెడ్డి టార్గెట్.. దారుణంగా

  గత వారానికి సంబంధించి జరిగిన టాస్కుల్లో ప్రైజ్ మనీని తగ్గించారు. దీంతో ఈ తరహా వాటిలో తనకు పాల్గొనడం ఇష్టం లేదని చెప్పిన ఆది రెడ్డి.. అఇష్టంగానే కొన్ని ఆడాడు. అలాగే, 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' టాస్కును మాత్రం అస్సలు ఆడలేదు. దీన్ని శనివారం జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ప్రస్తావించాడు. అంతేకాదు, ఆది రెడ్డిని టార్గెట్ చేస్తూ ఘోరంగా మాట్లాడాడు.

  ఏకంగా షర్ట్ విప్పేసిన యాంకర్ స్రవంతి: ఎద అందాలు ఆరబోస్తూ ఘోరంగా!

   నువ్వు ఎవరు? వీడియో చూపి

  నువ్వు ఎవరు? వీడియో చూపి

  బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్ల ఆటతీరును మార్చేలా ఆది రెడ్డి మాట్లాడుతున్నాడని నాగార్జున బాగా విమర్శించాడు. అంతేకాదు, మాట్లాడితే బయటకు వెళ్లిపోతా అంటున్నావు కదా అంటూ వీడియో చూపించాడు. అందులో ఆదిది తప్పని తేలడంతో బయటకు వెళ్లిపోతావా అని ప్రశ్నించాడు. ఆ తర్వాత కూడా చాలా సేపు అతడిని టార్గెట్ చేస్తూ విమర్శిస్తూనే ఉన్నాడు.

  బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి

  బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి

  గత శనివారం ఎపిసోడ్‌లో జరిగినట్లుగా హోస్ట్ అక్కినేని నాగార్జున గతంలో ఎవరినీ నిందించలేదు. ఆది రెడ్డికి క్లాస్ పీకిన ఫుటేజ్‌నే దాదాపు 20 నిమిషాల పాటు చూపించారు. అయితే, ఇందులో నాగార్జున ఎన్ని అన్నా ఆది రెడ్డి మాత్రం సారీ అయితే చెప్పలేదు. ఈ కారణంగానే ఈ వ్యవహారం సుదీర్ఘంగా సాగింది. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ వల్ల ఆది రెడ్డిపై సింపతీ కూడా పెరిగింది.

  English summary
  Bigg Boss Telugu 6th Season was Started Last Sunday. Akkineni Nagarjuna Fire on Adi Reddy in Recent Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X