Bigg Boss Telugu 6: అమ్మాయి టీషర్ట్‌లో చేయి.. అక్కడ ముద్దు.. ఆ కంటెస్టెంట్‌పై నాగార్జున సీరియస్

తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తున్నాయి. అందులో కొన్ని మాత్రమే సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. అయితే, ప్రేక్షకులకు అసలే మాత్రం పరిచయం లేని కాన్సెప్టుతో వచ్చినా.. అప్పటి వరకూ ఉన్న రికార్డులను చెరిపేసిన ఏకైక షో బిగ్ బాస్. ఇండియాలోని చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా.. ఆరంభం నుంచి ఇక్కడ అదిరిపోయే స్పందనను అందుకుంది. దీంతో నిర్వహకులు కొన్ని సీజన్లను పూర్తి చేసి.. ఇప్పుడు ఆరో దాన్ని నడుపుతున్నారు. ఇందులో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున.. గీతూ రాయల్‌పై ఫైర్ అయ్యాడు. అసలేం జరిగిందో మీరే చూడండి!

 కొత్తగా ప్లాన్ చేసినా నో యూజ్

కొత్తగా ప్లాన్ చేసినా నో యూజ్

బిగ్ బాస్ షోకు తెలుగులోనే మిగిలిన భాషల కంటే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. అందుకు అనుగుణంగానే దీన్ని సరికొత్త కంటెంట్‌తో తీసుకు వస్తున్నారు. ఇక, గత వారంలో మొదలైన ఆరో సీజన్‌ను కూడా ఎన్నో ప్రయోగాలతో నడిపిస్తున్నారు. దీన్ని మరింత కొత్తగా మార్చేందుకు వినూత్నమైన ప్లాన్లతో ముందుకు వస్తున్నారు. అయినప్పటికీ రేటింగ్‌ను మాత్రం రాబట్టడంలేదు.

ఈ వారంలో అలా.. కొత్త కెప్టెన్

ఈ వారంలో అలా.. కొత్త కెప్టెన్


ఐదో వారం కెప్టెన్సీ పోటీదారులను ఎంపిక చేసేందుకు నిర్వహకులు 'బిగ్ బాస్ బర్త్‌డే' అనే టాస్కును ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో పాత కెప్టెన్ కీర్తి భట్ నిర్ణయంతో ఆరుగురిని కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక చేశారు. అందులో ముగ్గురు మాత్రమే చివరి దశకు చేరుకున్నారు. వీరి నుంచి రేవంత్ ఈ వారం కంటెస్టెంట్ల ఓటింగ్‌తో ఇంటి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

శనివారం ఎపిసోడ్‌పై ఫోకస్‌గా

శనివారం ఎపిసోడ్‌పై ఫోకస్‌గా

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో అక్కినేని నాగార్జున కంటెస్టెంట్లపై విరుచుకుపడుతున్నాడు. తప్పు చేసిన వాళ్లను ఏమాత్రం మొహమాటం లేకుండా తిడుతున్నాడు. అంతేకాదు, గత వారం ఏకంగా ఇద్దరిని నేరుగా నామినేట్ కూడా చేశాడు. ఈ నేపథ్యంలో నాలుగో వారంలో చాలా తప్పులు జరగడంతో శనివారం ఎపిసోడ్‌పై ఆసక్తి నెలకొంది. దీనికోసం చాలా మంది ఫోకస్ చేస్తున్నారు.

సుతిమెత్తగా క్లాసులు పీకాడు

సుతిమెత్తగా క్లాసులు పీకాడు

సాధారణంగా బిగ్ బాస్ షోలో శని, ఆదివారాలు హోస్ట్ అక్కినేని నాగార్జున సందడి చేస్తుంటాడు. ఇందులో భాగంగానే శనివారం రాత్రి జరిగిన ఎపిసోడ్‌లో ఆయన తనదైన కంటెస్టెంట్లతో హిట్ ఆర్ ఫ్లాప్ గేమ్ ఆడించాడు. అంతేకాదు, హౌస్‌లో ఉన్న అందరు కంటెస్టెంట్లకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ క్రమంలోనే కొందరు కంటెస్టెంట్లపై నాగార్జున ఓ రేంజ్‌లో సీరియస్ అయ్యాడు.

జెండర్ గురించి ప్రస్తావిస్తూ

జెండర్ గురించి ప్రస్తావిస్తూ

శనివారం జరిగిన ఎపిసోడ్‌లో గీతూ రాయల్ గత వారంలో జెండర్ ఈక్వాలిటీపై చేసిన కామెంట్ల గురించి నాగార్జున ప్రస్తావించాడు. ఆ సమయంలో 'ఈ హౌస్‌లో జెండర్ డిఫరెన్స్ లేదు.. కానీ ఎవరికి వాళ్లకి పర్సనల్ స్పేస్ ఉంటుంది. ఆ పర్సనల్ స్పేస్‌లో వాళ్లు కంఫర్టబుల్‌గా లేనప్పుడు వాళ్లే మాట్లాడతారు. అంతేకానీ, ప్రతి దాన్ని ఇలా చూడకండి' అంటూ క్లాస్ తీసుకున్నాడు.

గీతూకు నాగార్జున సూటి ప్రశ్న

గీతూకు నాగార్జున సూటి ప్రశ్న

తాజా ఎపిసోడ్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున.. ఫైర్ బ్రాండ్ గీతూ రాయల్‌పై సీరియస్ అయ్యాడు. 'ఏమ్మా గీతూ.. నువ్వు నా టీషర్టులో చేయి పెట్టినా ప్రాబ్లమ్ లేదు అన్నావు. కానీ, ముద్దు పెడితే మాత్రం జెండర్ ఫీలింగ్ తీసుకు వస్తున్నావు. అసలు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నావు? ఏం చేస్తున్నావు? అన్నది అర్థం చేసుకుని చేయండి. ఇది అందరికీ చెప్తున్నా' అని చెప్పుకొచ్చాడు నాగ్.

రేవంత్‌ను కంట్రోల్ చేస్తూ

రేవంత్‌ను కంట్రోల్ చేస్తూ

గత వారంలో జరిగిన ఓ ఎపిసోడ్‌లో గీతూ రాయల్, రేవంత్‌కు హితబోధ చేసింది. 'నువ్వు అమ్మాయిలను ఎక్కడ పడితే అక్కడ పట్టుకోవద్దు. అలా చేసే ముందు వాళ్లు కంఫర్టుగా ఉన్నారా? లేదా? అన్నది కనుక్కో. లేకపోతే నీకే ప్రాబ్లం అవుతుంది. ఇదే నీ క్యారెక్టర్‌ను దిగాజార్చే ప్రమాదం ఉంది' అని చెప్పింది. ఇలాంటి సంభాషణనే నాగార్జున తాజా ఎపిసోడ్‌లో ప్రస్తావించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X