Bigg Boss Telugu 6: రేవంత్‌ను అంత మాట అన్న నాగ్.. ఆమెను బుక్ చేయడంతో ఆగ్రహం.. కొత్త జంటపైనా!

ఇండియాలోని ఎన్నో భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో మాత్రమే భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. దీంతో నిర్వహకులు కూడా రెట్టించిన ఉత్సాహంతో కొత్త సీజన్లను తీసుకు వస్తున్నారు. ఇలా ఇప్పుడు ఆరో దాన్ని కూడా సరికొత్త హంగులతో ప్రసారం చేస్తున్నారు. అయితే, గత వారంలో కంటెస్టెంట్లు నిరాశ పరచడంతో బిగ్ బాస్ సీరియస్ అయ్యాడు. ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున కూడా కొందరు కంటెస్టెంట్లపై ఫైర్ అయ్యాడు. అసలేం జరిగింది? ఆ వివరాలేంటో మీరే చూడండి!

ప్రయోగాలు.. రేటింగ్ మాత్రం

ప్రయోగాలు.. రేటింగ్ మాత్రం

బిగ్ బాస్ షోకు తెలుగులో భారీ స్థాయిలో స్పందన దక్కుతూ ఉంటోంది. అందుకు అనుగుణంగానే దీన్ని సరికొత్త కంటెంట్‌తో తీసుకు వస్తున్నారు. ఇక, ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఆరో సీజన్‌ను కూడా ఎన్నో ప్రయోగాలతో నడిపిస్తున్నారు. దీన్ని మరింత కొత్తగా మార్చేందుకు వినూత్నమైన ప్లాన్లతో ముందుకు వస్తున్నారు. అయినప్పటికీ రేటింగ్‌ను మాత్రం అందించడంలేదు.

ఈ వారంలో అలా... నో కెప్టెన్

ఈ వారంలో అలా... నో కెప్టెన్

ఏడో వారం కెప్టెన్సీ పోటీదారులను ఎంపిక చేసేందుకు నిర్వహకులు 'సెలెబ్రిటీ గేమింగ్ లీగ్' ఫెయిల్ అవడంతో కంటెస్టెంట్లు అందరికీ బిగ్ షాక్ తగిలింది. దీంతో అన్నీ సదుపాయలూ బంద్ చేసిన బాస్.. ఆ తర్వాత కంటెస్టెంట్లకు 'బ్యాటిల్ ఫర్ సర్వైవర్' అనే టాస్కును ఇచ్చారు. మొత్తంగా ఏడో వారం ఇంటికి కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయకుండానే ముగించేశారు.

శనివారం ఎపిసోడ్‌పై ఆసక్తి

శనివారం ఎపిసోడ్‌పై ఆసక్తి

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో అక్కినేని నాగార్జున కంటెస్టెంట్లపై విరుచుకుపడుతున్నాడు. తప్పు చేసిన వాళ్లను ఏమాత్రం మొహమాటం లేకుండా తిడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏడో వారంలో చాలా తప్పులు జరగడంతో పాటు కెప్టెన్‌ను ఎంపిక చేయకుండా బిగ్ బాస్ నిర్ణయం తీసుకోవడంతో శనివారం ఎపిసోడ్‌పై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇవాల్టి ప్రోమోను వదిలారు.

ఆమె నామినేట్.. హోస్ట్ ఫైర్

ఆమె నామినేట్.. హోస్ట్ ఫైర్

ఈ వారంలో జరిగిన టాస్కులో ఓడిపోయిన బ్లూ టీమ్‌లోని ఒక కంటెస్టెంట్ నేరుగా వచ్చే వారానికి నామినేట్ కావాలని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో ఆ టీమ్ కెప్టెన్ శ్రీ సత్య ముందుకు వచ్చింది. ఆ తర్వాత మనసు మార్చుకుని చీటీలు తీద్దామంది. అందులోనూ ఆమె పేరు వస్తే ఓటింగ్ పెడదామని చెప్పింది. దీంతో వాసంతి బుక్కైంది. దీంతో నాగార్జున.. సత్యపై ఫైర్ అయ్యాడు.

రేవంత్‌ను తొలిసారి ఘాటుగా

రేవంత్‌ను తొలిసారి ఘాటుగా

బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి ఎంతో మంది కంటెస్టెంట్లు వచ్చారు. కానీ, అందులో రేవంత్ మాత్రం టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. అందుకు అనుగుణంగానే అతడు తనదైన శైలిలో ఆడుతూ, ఓటింగ్‌లో దూసుకుపోతూ సేఫ్ అవుతూ వస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తొలిసారి నాగార్జున అతడిపై ఫైర్ అయ్యాడు. అంతేకాదు, 'పప్పు' అని పిలుస్తూ అందరి ముందే పరువు తీశాడు.

గొడవ.. ఆటతీరుపై ప్రశ్నలు

అలాగే, ఈ వారంలో రేవంత్, అర్జున్ కల్యాణ్ మధ్య జరిగిన గొడవ గురించి కూడా నాగార్జున ప్రశ్నలు వేశాడు. ఆ సమయంలో 'పప్పు' అని పిలవడాన్ని హైలైట్ చేశాడు. అందుకే రేవంత్‌ను ఆ పేరుతో పిలిచినట్లు తర్వాత అర్థం అయింది. ఇక, ఈ ప్రోమోలో ఫైమా సంచాలకురాలిగా ఎలా చేసిందని కూడా ప్రశ్నించాడు. చివర్లో శ్రీ సత్య.. నాగార్జునకే షాకిచ్చేలా మాట్లాడి ఆశ్చర్యపరిచింది.

కొత్త జంట గురించి కూడా

కొత్త జంట గురించి కూడా

ఇక, తాజాగా వచ్చిన ప్రోమోలో హోస్ట్ అక్కినేని నాగార్జున.. శ్రీహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. అంతేకాదు, 'ఏంటి శ్రీహాన్.. నీకోసం కేక్ తయారు చేసి.. దాని మీద లవ్ సింబల్ వేసి.. మొత్తానికి చోటు అని రాసి తన గుండెలో నీకు చోటు ఉందని చెప్పారుగా' అంటూ ఇనాయా గురించి మాట్లాడాడు. దీంతో శ్రీహాన్ బయట నన్ను కొడతారు సార్ అంటూ బదులిచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X