Bigg Boss Telugu 8 Grand Finale : బిగ్‌బాస్ విన్నర్‌ ఎవరు ? నోరు జారిన టేస్టీ తేజా.. నాగార్జున సీరియస్

దాదాపు 100 రోజులకు పైగా తెలుగు ప్రేక్షకులను అలరించిన బిగ్‌బాస్ తెలుగు 8కి ఎండ్ కార్డ్ పడనుంది. ఆదివారం గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా ఆరంభమైంది. దీంతో విన్నర్ ఎవరు కానున్నారు? విజేతకు ప్రైజ్ మనీ ఎంత? గ్రాండ్ ఫినాలేకు గెస్ట్ ఎవరు అంటూ పెద్ద డిస్కషన్ నడుస్తోంది. అయితే బిగ్‌బాస్ వేదికపై టేస్టీ తేజాపై హోస్ట్ అక్కినేని నాగార్జున సీరియస్ కావడం కలకలం రేపింది.

14 మందితో బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్ ప్రారంభం కాగా.. మధ్యలో 8 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. షో మొదలై నాటి నుంచి 14 వారాల వరకు బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ భాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, కిర్రాక్ సీత, నాగ మణికంఠ, ఆదిత్య ఓం, నైనిక, మెహబూబ్, హరితేజ, గంగవ్వ, విష్ణుప్రియ, రోహిణి, పృథ్వీరాజ్ శెట్టి, టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యారు. 15వ వారం నాటికి నిఖిల్, నబీల్, ప్రేరణ, అవినాష్, గౌతమ్‌లు మాత్రమే కంటెస్టెంట్స్‌గా మిగిలారు.

Akkineni nagarjuna serious on tasty teja at bigg boss telugu 8 grand finale

14వ వారం రోహిణి, టేస్టీ తేజాలు ఎలిమినేట్ కావడంతో టాప్ 5లో చోటు దక్కించుకున్న ఐదుగురిలో ఒకరు బిగ్‌బాస్ తెలుగు 8 టైటిల్ విజేత కానున్నారు. ప్రధానంగా నిఖిల్, గౌతమ్‌ల మధ్యే హోరాహోరీ పోరు జరుగుతోంది. ఇదిలాఉండగా.. బిగ్‌బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్ట్‌గా ఎవరు రాబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది. దీనికి స్టార్ మా యాజమాన్యం చెక్ పెట్టింది. గ్రాండ్ ఫినాలే గెస్ట్‌గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వస్తున్నట్లు అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది.

సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటనలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. బిగ్‌బాస్ 7 ఫైనల్ ముగిసినప్పుడు పల్లవి ప్రశాంత్ అభిమానులు విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో అదనపు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఫైనల్ సందర్భంగా ఈ సీజన్‌లో పాల్గొని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ను నాగార్జున వేదిక మీదకు పిలిచారు.

Akkineni nagarjuna serious on tasty teja at bigg boss telugu 8 grand finale

సోనియా ఆకుల పెళ్లి త్వరలో జరగనుండటంతో ఆమెకు నాగ్ శుభాకాంక్షలు తెలపగా.. మీరు పెళ్లికి తప్పకుండా రావాలని సోనియా ఆహ్వానించారు. ఆర్జే శేఖర్ భాషా తన కొడుకు పేరును రీవిల్ చేశారు. ఇక బిగ్‌బాస్ తెలుగు 8 విన్నర్ ఎవరు అవుతారని నాగార్జున ప్రశ్నించగా.. ఎక్కువ మంది నిఖిల్ - గౌతమ్ పేర్లే చెప్పారు. ఇంతలో టేస్టీ తేజ మాత్రం కాస్త ఓవరాక్షన్ చేశాడు. మా అభిప్రాయం సరే సార్.. మీరు ఎవరిని అనుకుంటున్నారు అని అడుగుతాడు. దీంతో నాగార్జున సీరియస్ కావడంతో తేజ దెబ్బకి సైలెంట్ అవుతాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X