బిగ్ బాస్ హౌస్‌లో నిజమైన దొంగ హల్‌చల్: షో నిర్వహకుల నిర్లక్ష్యంపై నాగార్జున సీరియస్.!
తెలుగు బుల్లితెరపై మరే షోకూ దక్కని ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తూ సక్సెస్‌ఫుల్ మూడు సీజన్లను పూర్తి చేసుకుంది 'బిగ్ బాస్'. గతంలో ఎన్నడూ చూడని సరికొత్త ప్రయోగాలతో ప్రారంభమైనప్పటికీ.. ఈ షోకు ఆరంభం నుంచే విపరీతమైన స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే మూడు సీజన్లను పూర్తి చేసుకుని, నాలుగో దానిని సైతం మొదలెట్టింది. ఇప్పుడిప్పుడే ఆసక్తికరంగా సాగుతోందీ సీజన్. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ హౌస్‌లో ఓ దొంగ కలకలం రేపుతున్నాడు. ఆ విషయంలో నిర్వహకుల నిర్లక్ష్యంపై నాగార్జున సీరియస్ కూడా అయ్యాడట. ఇంతకీ ఏం జరిగింది.? పూర్తి వివరాల్లోకి వెళితే...

గ్రాండ్‌గా మొదలైన షో.. రికార్డులు బద్దలు
తెలుగులో మూడు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్... కొన్ని వారాల క్రితం నాలుగో సీజన్‌ను సైతం ప్రారంభించింది. అంగరంగ వైభవంగా సాగిన ప్రీమియర్ ఎపిసోడ్‌ను అక్కినేని నాగార్జున విజయవంతంగా నడిపించారు. ఆరోజు హౌస్‌లోకి పదహారు మంది కంటెస్టెంట్లను పంపారు. ఈ ఎపిసోడ్‌కు ఏకంగా 18 ప్లస్ రేటింగ్ వచ్చింది. ఫలితంగా ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి.

అప్పటి నుంచి చప్పగా.. సరికొత్త వ్యూహాం
ప్రీమియర్ ఎపిసోడ్ తర్వాత జరిగిన రెండు వారాలూ బిగ్ బాస్ షో చాలా చప్పగా సాగింది. దీంతో ఈ సీజన్ విజయంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో షో నిర్వహకులు సరికొత్త వ్యూహాలతో ముందడుగు వేశారు. సరికొత్త టాస్కులు తీసుకురావడం... వైల్డ్ కార్డ్ ద్వారా ముగ్గురు కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపించడం వంటి వాటితో షోను నిలబెట్టే ప్రయత్నం చేశారు.

మసాల దట్టించడంతో సక్సెస్ అయిన షో
ఇక, గత సీజన్లతో పోలిస్తే ఈ సారి మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ను పంచుతామని బిగ్ బాస్ యూనిట్ ఎప్పటి నుంచో చెబుతోంది. అందుకు అనుగుణంగానే హౌస్‌లోని కంటెస్టెంట్ల మధ్య లవ్ ట్రాకులు ఉన్నట్లు చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని జంటలపై బాగా ఫోకస్ చేస్తున్నారు. అంతేకాదు, వాళ్లు చేతులు పట్టుకోవడం, ముద్దులు, హగ్గులు ఇచ్చుకోవడం వంటివి చూపిస్తున్నారు.

వాటి వల్ల బిగ్ బాస్ యూనిట్‌పై విమర్శలు
ఇప్పటి వరకు జరిగిన సీజన్లు అన్నింటిలోనూ ఫిజికల్ టాస్కులు పెట్టారు బిగ్ బాస్ నిర్వహకులు. వాటి వల్ల కంటెస్టెంట్ల మధ్య గొడవలు కూడా జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సీజన్‌లో ఆ తరహా టాస్కులు ఉండవని అనుకున్నారు. కానీ, మళ్లీ అలాంటివి పెట్టారు. ఇక, మోనాల్ విషయంలో షో యూనిట్ చేస్తున్న పనుల వల్ల ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆ విషయంలో మాత్రం బిగ్ బాస్‌కు షాక్
సరికొత్త టాస్కులు... లవ్ ట్రాకులు... వైల్డ్ కార్డ్ ఎంట్రీలు... అప్పుడప్పుడూ నాగార్జున చేత తలంట్లు ఇలా బిగ్ బాస్ షో రోజురోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో దీనికి మంచి రేటింగ్ కూడా లభిస్తోంది. ఈ నేపథ్యంలో నిర్వహకులు సరికొత్త ప్లాన్లు వేస్తూ షోను మరింతగా రక్తి కట్టిస్తున్నారు. అయితే, ఎలిమినేషన్ విషయంలో మాత్రం బిగ్ బాస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి.

బిగ్ బాస్ హౌస్‌లో నిజమైన దొంగ హల్‌చల్
మొదటి సీజన్ మినహా బిగ్ బాస్ షో జరిగిన ప్రతిసారీ లీకులు యూనిట్‌కు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఎంతో సీక్రెట్‌గా వ్యవహరిస్తున్నప్పటికీ... ఎలిమినేషన్ సహా చాలా విషయాలు ముందే బయటకు వస్తున్నాయి. గతంలో ఇవి ఎక్కువగా కనిపించడంతో ఈ సారి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ, ఇప్పుడు కూడా ఓ దొంగ ఇలాంటి పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

షో నిర్వహకుల నిర్లక్ష్యంపై నాగ్ సీరియస్.!
ప్రత్యేకించి నాలుగో సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన ఎలిమినేషన్లు అన్నీ ముందే లీక్ అయ్యాయి. మరీ ముఖ్యంగా మూడో వారంలో మెహబూబ్ వెళ్లిపోతాడని అంతా అనుకుంటే దేవీ నాగవల్లి ఎలిమినేట్ అయింది. ఈ విషయం కూడా లీక్ అయింది. ఈ వారం కూడా సుజాత వచ్చేస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహాల కారణంగా యూనిట్‌పై నాగ్ సీరియస్ అయ్యారని సమాచారం.


Click it and Unblock the Notifications











