twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్ టైటిల్ రేసులో ఆ కంటెస్టెంట్: నాగార్జున అండతో ఒక్కసారిగా మారిపోయింది!

    |

    ప్రపంచంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో పరిచయమై తెలుగు బుల్లితెరపై తిరుగులేని, చెరిగిపోని ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తోంది బిగ్ బాస్. గతంలో ఏ షోకూ దక్కని విధంగా ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోంది. కంటెస్టెంట్ల మధ్య జరిగే వాస్తవ సంఘటనలతో ప్రసారమయ్యే ఈ షోలో ఎప్పుడేం జరుగుతుందో ఊహించడం కష్టంగా మారింది. ఇక, ప్రస్తుత సీజన్‌లో అభిజీత్ హవా కనిపిస్తోంది. అతడే ఈ సారి విజేత అవుతాడని అంతా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున అండతో టైటిల్ రేసులోకి మరో కంటెస్టెంట్ కూడా వచ్చారంటూ ఓ న్యూస్ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే..

    ఫస్ట్ సీజన్‌లో ఊహించడం కష్టమైంది

    ఫస్ట్ సీజన్‌లో ఊహించడం కష్టమైంది

    తెలుగులో బిగ్ బాస్ షో ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రారంభం అయింది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్‌లో ఐదుగురు కంటెస్టెంట్లు ఫైనల్స్‌కు చేరుకున్నారు. అయితే, వీరిలో ఎవరు విజేత అవుతారన్న దానిపై మాత్రం చివరి వరకూ క్లారిటీ రాలేదు. తుది ఇద్దరిలో నిలిచిన శివ బాలాజీ, అదర్శ్ బాలకృష్ణపై పైచేయి సాధించి టైటిల్‌ను ఎగరేసుకుని పోయాడు.

    రెండో సీజన్‌లో మధ్యలోనే ఫిక్సైంది

    రెండో సీజన్‌లో మధ్యలోనే ఫిక్సైంది

    మొదటి సీజన్‌లో విన్నర్ ఎవరో గెస్ చేయలేకపోయినా.. రెండో సీజన్‌లో మాత్రం విజేతను ముందుగానే అంచనా వేయగలిగారు తెలుగు ప్రేక్షకులు. నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేసిన ఈ సీజన్.. వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఇక ఇందులో గీతా మాధురి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. కానీ, ఫైనల్‌లో మాత్రం ఆమెను ఓడించి గెలుపొందాడు కౌశల్ మండా.

    మూడో సీజన్‌లో పోటీ.. క్రేజ్‌ను బట్టి

    మూడో సీజన్‌లో పోటీ.. క్రేజ్‌ను బట్టి

    గత ఏడాది ప్రసారం అయిన మూడో సీజన్‌లో సైతం విజేత ఎవరన్న దానిపై చివరి వరకూ ఉత్కంఠ కొనసాగింది. వాస్తవానికి ఇందులో రాహుల్ సిప్లీగంజ్‌కు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండడంతో అతడే గెలుస్తాడని మొదటి నుంచీ అనుకున్నారు. కానీ, శ్రీముఖి కూడా గట్టిగానే పోరాటం చేసింది. అయినప్పటికీ రాహుల్ క్రేజ్ ముందు నిలవలేకపోయింది.

    నాలుగో సీజన్‌ ఫేవరెట్లు ముందే ఔట్

    నాలుగో సీజన్‌ ఫేవరెట్లు ముందే ఔట్

    ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్‌లో పేరున్న కంటెస్టెంట్లు చాలా తక్కువ మందే ఉన్నారు. వారిలో దేవీ నాగవల్లి, నోయల్ సీన్, లాస్య మంజునాథ్‌లలో ఒకరు టైటిల్ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని అంతా అనుకున్నారు. అలాగే, గంగవ్వను కూడా రేసులోకి తీసుకొచ్చారు. కానీ, ఊహించని విధంగా వీళ్లంతా మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు.

    ఈ సీజన్‌లో అతడి హవా కనిపిస్తోంది

    ఈ సీజన్‌లో అతడి హవా కనిపిస్తోంది

    ఇక, ఈ సీజన్‌లో ఎవరు ఎలా గేమ్ ఆడినా.. అభిజీత్ హవానే ఎక్కువగా కనిపిస్తోంది. మైండ్‌తో గేమ్ ఆడుతూ.. కూల్‌గా ఉంటూ ఆకట్టుకుంటోన్న అతడు.. భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను అందుకున్నాడు. అందుకే దాదాపు ఎనిమిది సార్లు నామినేట్ అయినా సేవ్ అవ్వగలిగాడు. అంతేకాదు, అతడి పేరిట సోషల్ మీడియాలో ట్రెండ్‌లు క్రియేట్ అవుతున్నాయి కూడా.

    Recommended Video

    Bigg Boss 4 Telugu : ఈ వారం బిగ్ బాస్ నుంచి దివి ఎలిమినేటెడ్!
     బిగ్ బాస్ టైటిల్ రేసులో ఆ కంటెస్టెంట్

    బిగ్ బాస్ టైటిల్ రేసులో ఆ కంటెస్టెంట్

    విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈ సీజన్‌లో టాప్ -2లో ఆరియానా గ్లోరీ కచ్చితంగా ఉంటుందట. టాస్కుల్లో వంద శాతం ఇవ్వడంతో పాటు నిజాయితీగా ఆడుతుండడం ఆమెకు కలిసొచ్చే అంశమని అంటున్నారు. అలాగే, ఈ సారి ఆడవాళ్లనే గెలిపిస్తారన్న ప్రచారం ఆమెకు కలిసొచ్చేలా ఉంది. మరోవైపు, నాగ్ కూడా ఆమెకు బాగా సపోర్ట్ చేస్తున్నాడన్న టాక్ కూడా వినిపిస్తోంది.

    English summary
    Bigg Boss is the Telugu language version of the reality TV series Bigg Boss, which itself is an adaptation of the Dutch series Big Brother. It airs on Star Maa and streams on digital platform Hotstar. Season 1 was hosted by Jr NTR premiered on 16 July 2017.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X