»   » స్టార్ హీరో ప్రెగ్నెంట్.... టీవీ షో కోసం సాహసం!

స్టార్ హీరో ప్రెగ్నెంట్.... టీవీ షో కోసం సాహసం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్లో ప్రయోగాత్మక సినిమాలు, పాత్రలకు పెట్టింది పేరు అక్షయ్‌కుమార్‌. బాలీవుడ్లో తనది సూపర్ స్టార్ రేంజ్ అయినా..... ఇమేజ్‌తో సంబంధం లేకుండా టాయిలెట్ లాంటి అంశాలతో సినిమాలు చేయడం ఆయనకే చెల్లింది.

తాజాగా ఓ టీవీ షో కోసం అక్షయ్ కుమార్ గర్భం దాల్చాడు. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది నిజం. అక్షయ్‌ 'ది గ్రేట్‌ ఇండియన్‌ లాఫ్టర్‌ ఛాలెంజ్‌ 5'అనే టీవీషోకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఈ షో కోసం చిత్రీకరించిన ప్రమోషనల్ ప్రోమోలో అక్షయ్ కుమార్ గర్భం దాల్చినట్లు చూపించారు.

అక్షయ్ కుమార్

వీడియోలో అక్షయ్‌ గర్భం దాల్చినట్లు, ఆ తర్వాత ఐదుగురు కవలలకు జన్మనిచ్చినట్లు చూపించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా ట్రెండింగ్ అవుతోంది.

కామెడీలోనూ కింగే

కామెడీలోనూ కింగే

అక్షయ్ కుమార్ తెరపై హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ చేయడం చూశాం. అదే సమయంలో కడుపుబ్బా నవ్వించే కామెడీ పాత్రలు కూడా చేశాడు. మరి అలాంటి హీరో న్యాయ నిర్ణేతగా వస్తున్న టీవీ షో కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

కడుపుబ్బా నవ్వడం ఖాయం

కడుపుబ్బా నవ్వడం ఖాయం

స్టార్ ప్లస్ టీవీలో ఈ కామెడీ షో ప్రారంభం కాబోతోంది. ఇండియాలోనే ది బెస్ట్ కామెడీ టీవీ షోగా ‘ది గ్రేట్‌ ఇండియన్‌ లాఫ్టర్‌ ఛాలెంజ్‌ 5' గా ఈ షో రికార్డులకెక్కడం ఖాయం అంటున్నారు.

మన జబర్దస్త్ తరహాలోనే

మన జబర్దస్త్ తరహాలోనే

‘ది గ్రేట్‌ ఇండియన్‌ లాఫ్టర్‌ ఛాలెంజ్‌ 5' అంటే మరేదో కాదు... మన తెలుగులో ప్రసారం అయ్యే జబర్దస్త్ కామెడీ షో మాదిరిగానే ఈ షో ఉండబోతోంది.

English summary
Akshay Kumar is back on Television, but this time as a judge on the upcoming show The Great Indian Laughter Challenge. Akshay is seen pregnant in the promo and on getting his ultrasound done, the couple learns that he is about to give birth to six babies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu