twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిట్టి పొట్టి దుస్తుల్లో దేత్తడి హారిక చిందులు.. మొదటి సారి ఇలా హాట్‌గా కనిపించేసరికి...

    |

    యూ ట్యూబ్ తో స్టార్ ఇమేజ్ అందుకున్న వారిలో దేత్తడి హారిక ఒకరు. నటిగా ఎదో ఒక విధంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని అనుకున్న హారిక ఫస్ట్ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసింది. అనంతరం మెల్లగా దేత్తడి యూ ట్యూబ్ షో ద్వారా తన పేరునే మార్చెసుకుంది. ఇక ఈ బ్యూటీ గ్లామర్ విషయంలో కూడా హీరోయిన్స్ కు తక్కువకాకుండా స్టిల్స్ ఇస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో చిట్టి పొట్టి డ్రెస్సుల్లో ఆమె డ్యాన్స్ చేసిన విధానం బాగానే వైరల్ అయ్యింది.

    డైలాగ్స్ తోనే భారీ క్రేజ్

    డైలాగ్స్ తోనే భారీ క్రేజ్

    ఆలేఖ్య హారికగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఈ గడసరి భామ మొదట్లో కొన్ని యూ ట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. ఇక ఆ తరువాత తనకంటూ ఒక మార్క్ ఉండాలని పూర్తిగా మాట్లాడే విధానాన్ని మార్చేసింది. తెలంగాణ పోరి అనేలా తన డైలాగ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

    ఏ మాత్రం గ్యాప్ లేకుండా

    ఏ మాత్రం గ్యాప్ లేకుండా

    ఇక దేత్తడి షోతో అమ్మడి క్రేజ్ మరింత పెరిగింది. ఆ దెబ్బతో ఆలేఖ్య హారిక కాస్త దేత్తడి హరికగా మారిపోయింది. ఏ మాత్రం గ్యాప్ లేకుండా ఆ షోను కంటిన్యూ చేసుకుంటూ వచ్చిన హారిక ఇతర రియాలిటీ షోలతో కూడా కంటిన్యూ అవుతూ వచ్చింది. అయితే వాటివల్ల ఆమెకు పెద్దగా క్రేజ్ రాలేదు.

    గ్రాండ్ వెల్కమ్

    గ్రాండ్ వెల్కమ్

    మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే ఆమెకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 కంటెస్టెంట్ గా ఛాన్స్ దక్కింది. నాగార్జున హోస్ట్ గా చేసిన ఆ షో ద్వారా హారిక బుల్లితెర అభిమానులకు బాగా దగ్గరయ్యింది. మంచి ఆదాయంతో పాటు క్రేజ్ కూడా దక్కింది. టాప్ 5 వరకు పోరాడిన హారికకు అభిమానుల నుంచి గ్రాండ్ వెల్కమ్ దక్కింది.

    గ్లామరస్ ఫొటోస్ తో షాక్

    గ్లామరస్ ఫొటోస్ తో షాక్

    ఇక బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ తో హారిక చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. సోషల్ మీడియాలో అయితే తరచు తన గ్లామరస్ ఫొటోలు పోస్ట్ చేస్తూ కుర్రాళ్లను కట్టి పడేస్తోంది. అలాగే ప్రయివేట్ సాంగ్స్ తో పాటు స్పెషల్ గా ఫొటో షూట్స్ లలో కూడా పాల్గొంటోంది. ఇటీవల నోయేల్ పాటలో కనిపించిన విషయం తెలిసిందే.

    చిట్టి పొట్టి డ్రెస్సుల్లో..

    ఇక రీసెంట్ గా ఆలేఖ్య ఒక పార్కులో చిట్టి పొట్టి డ్రెస్సుల్లో చిందులు వేస్తూ కనిపించింది. డ్యాన్స్ డే సందర్భంగా ఆ వీడియో పోస్ట్ చేసిన హారిక అందులోనే గ్లామర్ డోస్ ను కూడా మిక్స్ చేసింది. మొదటిసారి అలా కనిపించడంతో నెటిజన్లు షాక్ అయ్యారు. చూస్తుంటే హారిక సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయడానికి కూడా సిద్ధమయ్యేలా ఉన్నట్లు టాక్ వస్తోంది.

    English summary
    Dhethadi Alekhya Harika (Big Boss) Wiki, Age, Boyfriend, Net Worth Alekhya Harika is a famous Youtuber and Actress from Hyderabad, Telangana, India. She is known for her humor videos and Telangana slang. Alekhya came into the limelight for her comedy web series Called “Dhethadi”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X