అనసూయ అందాన్ని పొగుడుతూ కామెంట్.. అలీ కెలికాడు, నవ్వులే నవ్వులు!
రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం'లో రంగమ్మత్త పాత్ర పోషించిన అనసూయకు విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులు సొంతం అవుతున్నాయి. ఇటీవల జరిగిన జీ అవార్డుల కార్యక్రమంలో ఆమె ఉత్తమ సహాయ నటి టైటిల్ దక్కించుకుంది.
అయితే ఈ అవార్డుల కార్యక్రమంలో అనసూయ, అలీ మధ్య చోటు చేసుకున్న ఫన్నీ ఇన్సిడెంట్ ప్రేక్షకులను నవ్వించింది. అనసూయ అందాన్ని పొగుడుతూ సోషల్ మీడియాలో వచ్చిన ఓ కామెంట్‌ను అలీ ప్రస్తావించడమే ఇందుకు కారణం.

ఆ కామెంటుతో రంగంలోకి అలీ
అనసూయకు ఈ అవార్డు వస్తుందని తెలియగానే సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ వచ్చాయి. ఆ కామెంట్స్ గురించి మా కంటే బాగా అలీగారికి తెలుసు అంటూ షో హోస్ట్ చెప్పడంతో అలీ రంగంలోకి దిగాడు. అందరూ చాలా మంచి కామెంట్స్ చేశారు.. అందులో కొన్ని అనసూయ కోసం తెచ్చానంటూ ఓ కామెంట్ చదివి వినిపించారు అలీ.

అనసూయ అందాన్ని వర్ణిస్తూ...
ఆడదానికే అందం నీ అందం
నెలవంక లాంటి నీ నుదుట కుంకుమ అందం
నీ సోగ కనులకు కాటుక అందం
నీ సొట్టబుగ్గలకు సిగ్గు అందం
నీ అదరాలకు చిరునవ్వు అందం
నీ ఒంపుసొంపులకు చీరకట్టు అందం
ఆ వన్నెలన్నీ నువ్వైతే నింగి అంత అందం

అనసూయ రియాక్షన్
‘‘నా మీద ఇలాంటి కామెంట్ ఒక ఉమెన్ నుంచి రావడం చాలా స్పెషల్‌గా ఉంది. ఈ కవిత రాసిన భాగ్యలక్ష్మి అలియా అమ్ముకు థాంక్స్'' అని అనసూయ వ్యాఖ్యానించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది నా ఫస్ట్ అవార్డ్
రంగమ్మత్త పాత్రకు నేను అందుకున్న ఫస్ట్ అవార్డ్ ఇది. నన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు ధన్యవాదములు. నాకు ఈ అవకాశం వచ్చిన సుకుమార్ సర్‌కు థాంక్స్, ఈ సినిమాకు పని చేసిన రైటర్స్ ఆ పాత్రను క్రియేట్ చేయడం వల్లే ఆ అవకాశం నా వరకు వచ్చిందని భావిస్తున్నానని అనసూయ వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











