జబర్ధస్త్‌కు ఆ టీమ్ లీడర్ మళ్లీ వచ్చేశాడు.. నాగబాబు ప్లేస్‌లో టాప్ కమెడియన్ ఎంట్రీ

By Manoj

తెలుగు బుల్లితెర చరిత్రలో అత్యంత సక్సెస్‌ఫుల్ స్టాండప్ కామెడీ షోగా వెలుగొందుతోంది 'జబర్ధస్త్'. ఓ ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతున్న ఈ షోకు భారీ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఈ కామెడీ షో అంత విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అంతేకాదు, ఇదే షో ద్వారా చాలా మంది ఆర్టిస్టులు తెలుగు సినీ పరిశ్రమకు కూడా పరిచయం అయ్యారు. వాళ్లంతా ఇప్పుడు స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నారు. ఇలా నిర్విరామంగా కొనసాగుతున్న 'జబర్ధస్త్‌'లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఈ షో గురించి ఆసక్తికర వార్త ఒకటి బయటికొచ్చింది. ఇంతకీ ఏంటా వార్త.? వివరాల్లోకి వెళితే..

వాళ్లంతా టాప్ సెలెబ్రిటీలే

వాళ్లంతా టాప్ సెలెబ్రిటీలే

ఎన్నో ఏళ్లుగా ‘జబర్ధస్త్' ప్రసారం అవుతూనే ఉంది. దీనికి కారణం ఈ షో వెనుక కష్టపడుతున్న రైటర్లు, ఆర్టిస్టులు అన్న విషయం ప్రత్యకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ‘జబర్ధస్త్' కమెడియన్లకు బయట మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమా వాళ్లకు సమానంగా వీళ్లను కూడా సెలెబ్రిటీల్లా చూస్తుంటారు. అందుకే ఈవెంట్లు కూడా అదే స్థాయిలో దక్కించుకుంటుంటారు.

ఊహకందని పరిణామం

ఊహకందని పరిణామం

తాజాగా ఈ షోలో కొన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అదే.. ఈ షో నుంచి జడ్జ్‌గా వ్యవహరిస్తున్న నవ్వుల రారాజు నాగబాబు తప్పుకోవడం. అంతేకాదు, ఆయనతో పాటు పలువురు టీమ్ లీడర్లు కూడా జబర్ధస్త్‌కు గుడ్‌బై చెప్పేశారు. దీంతో షో మనుగడపై అందరిలో అనుమానాలు రేకెత్తాయి.

ఇకపై జబర్ధస్త్ ఒక రోజు మాత్రమే

ఇకపై జబర్ధస్త్ ఒక రోజు మాత్రమే

జబర్ధస్త్ నుంచి నాగబాబు, ముఖ్యమైన టీమ్ లీడర్లు వెళ్లిపోవడంతో ఇకపై ఈ షో వారంలో ఒక రోజు మాత్రమే ప్రసారం అవుతుందని ప్రచారం జరిగింది. ఇప్పటికిప్పుడు ఆర్టిస్టులను తీసుకు రావడం కుదరదని, ఈ కారణంగానే ‘జబర్ధస్త్', ‘ఎక్స్‌ట్రా జబర్ధస్త్'లో ఒక దానిని తీసేస్తున్నారని వార్తలు వచ్చాయి. దీంతో ఈ షోను అభిమానించే వారందరూ షాక్‌కు గురయ్యారు.

అనుమానాలన్నీ పటాపంచలు

అనుమానాలన్నీ పటాపంచలు

ఈ సక్సెస్‌ఫుల్ షో నుంచి నాగబాబు సహా పలువురు టీమ్ లీడర్లు, ఆర్టిస్టులు వెళ్లిపోయినా సరే ఈ వారం రెండు ఎపిసోడ్స్ ప్రసారం అయ్యాయి. ఈ రెండు ఎపిసోడ్స్‌కు రోజానే జడ్జ్‌గా వ్యవహరించారు. అలాగే, టీమ్‌లలో కొన్ని మార్పులు, ఆర్టిస్టుల సర్ధుబాటుతో ఏమాత్రం లోటు లేకుండా జరిగాయి. దీంతో షోపై ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు అయిపోయాయి.

నాగబాబు ప్లేస్‌లో ఆయనే

ఇక, ఈ షో నుంచి నాగబాబు తప్పుకోవడంతో ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న చర్చ కొద్ది రోజులుగా జోరుగా సాగుతోంది. మెగా బ్రదర్ స్థానంలో అలీని తీసుకుంటున్నారని కొందరు అనగా, కాదు కాదు ఆయన స్థానంలో ‘మా' అధ్యక్షుడు నరేష్‌ను ఎంపిక చేశారని మరికొందరు అన్నారు. కానీ, రోజా ఒక్కరే రెండు ఎపిసోడ్స్ చేశారు.

ప్రోమోతో క్లారిటీ వచ్చేసింది

ప్రోమోతో క్లారిటీ వచ్చేసింది

ఈ వారం రోజా ఒక్కరే జడ్జ్‌గా బాధ్యతలు నిర్వర్తించడంతో వచ్చే వారం కూడా ఆమెనే కంటిన్యూ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ, అందుకు భిన్నంగా వచ్చే వారం జరిగే జబర్ధస్త్ కోసం హీరో ‘కార్తికేయ' గెస్ట్‌గా వచ్చారు. అలాగే, శుక్రవారం ప్రసారం అయ్యే ఎక్స్‌ట్రా జబర్ధస్త్ కోసం మాత్రం అలీని తీసుకు వచ్చారు. దీంతో ఆయనే కంటిన్యూ అవుతారని ప్రచారం జరుగుతోంది.

ఫేవరెట్ టీమ్ లీడర్ కూడా వచ్చాడు

ఫేవరెట్ టీమ్ లీడర్ కూడా వచ్చాడు

ఇక, ఇదే ప్రోమోలో మరో ఊహించని వ్యక్తి కనిపించాడు. జబర్ధస్త్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నానని, త్వరలోనే మళ్లీ షోకు వస్తానని ప్రకటించిన చమ్మక్ చంద్ర మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. ఈయన చేసిన స్కిట్ కూడా ఈ ప్రోమోలో చూపించారు. దీంతో చంద్ర అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X