పదో తరగతిలో ఓ అమ్మాయితో రోజంతా అదే పని.. అందుకే నవదీప్ ఇలా అయ్యాడేమో!!

టాలీవుడ్ హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ బుల్లితెర హోస్ట్ జడ్జ్ ఇలా ఎన్నో రకాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు నవదీప్. ఇవన్నీ ఒకెత్తు అయితే సోషల్ మీడియాలో ఉండే నవదీప్ ఇంకో ఎత్తు. తెరపై ఎంత నాటీగా, ఫన్నీగా ఉంటాడో సోషల్ మీడియాలో అంతకు మించి సరదాగా ఉంటాడు. అయితే ఈ మధ్య నవదీప్ సోషల్ మీడియాలో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాడు. అయితే ప్రతీ ఒక్కరికీ రిప్లై ఇస్తూ కూల్ చేసే విధానాం మాత్రం బాగుంది. తాజాగా నవదీప్ అలీతో సరదాగా అనే ప్రోగ్రాంలో గెస్ట్‌గా విచ్చేశాడు. వచ్చేవారంలో ప్రసారం కానున్న ఈ షో ప్రోమో తాజాగా వైరల్ అవుతోంది. అందులో నవదీప్ చెప్పిన అంశాలేంటో ఓసారి చూద్దాం.

పెళ్లి ఎందుకు..

పెళ్లి ఎందుకు..

నీ బ్యాచ్‌లో ఉన్నవారంతా పెళ్లి చేసేసుకుంటున్నారు కదా? అని అలీ ప్రశ్నించాడు. అవును ఇంకా శర్వానంద్, రామ్ ఉన్నారు అని నవదీప్ తెలిపాడు. వాళ్లిద్దరికీ చేశాక నువ్ చేసుకుంటావా? అని అలీ అడిగాడు. అసలు పెళ్లి ఎందుకు? అంటూ నవదీప్ తిరిగి ప్రశ్నించాడు. వెళ్లి మీ నాన్నను అడుగు బాగా చెబుతాడు అంటూ అలీ సెటైర్ వేశాడు.

రిక్షావోడు అన్న మాట..

రిక్షావోడు అన్న మాట..


అసలు ఈ ఫీల్డ్‌లోకి ఎలా వచ్చావ్ అని అలీ ప్రశ్నించాడు. దానికి నవదీప్ సమాధానమిస్తూ.. చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలంటే పిచ్చి నేను వారికి ఫ్యాన్.. అలా ఓ సారి సినిమా చూసి వస్తుంటే ఓ రిక్షా అతను అన్నాడు. హీరోలా ఉన్నావ్ కదా బాబు ట్రై చేయోచ్చు కదా అని అన్నాడు. అలా అతను అనడంతో నాక్కూడా ఆలోచన మొదలైంది.. ఇలా వచ్చేశాను అని చెప్పుకొచ్చాడు. అంటే నువ్ రిక్షావోడు వేసిన విత్తనం అంటూ అలీ పంచ్ వేశాడు.

పదో తరగతిలోనే..

పదో తరగతిలోనే..


ఇక నవదీప్ సీక్రెట్లను అలీ బయటకు తెచ్చాడు. పదో తరగతిలోనే ఓ అమ్మాయితో రోజంతా ముద్దు ఎలా పెట్టాలో ట్రైనింగ్ తీసుకున్నావట అని అడిగాడు. అవన్నీ మీకెలా తెలిశాయ్ అని నవదీప్ అడగడం... ఆ అమ్మాయే చెప్పిందంటే అలీ రివర్స్‌గా కౌంటర్ ఇవ్వడంతో పగలబడి నవ్వేశాడు. అన్ని విషయాలు ఎవరో ఒకరి దగ్గర నేర్చుకోవాల్సిందే కదా అని నవదీప్ సమాధానం ఇవ్వడంతో అలీ షాక్ అయ్యాడు.

ప్లే బాయ్ ఇమేజ్..

ప్లే బాయ్ ఇమేజ్..


అప్పటి అందులో సిద్దహస్తుడు అవ్వడంతోనే నవదీప్‌కు ఈనాడు ప్లే బాయ్ ఇమేజ్ వచ్చినట్టుంది. నవదీప్ అంటే ప్రతీ ఒక్కరూ రొమాంటిక్ యాంగిల్‌లోనే చూస్తారు. ఆ ఇమేజ్‌కు తగ్గట్టు నవదీప్ చేసే చేష్టలు అలాగే ఉంటాయి. ఆ మధ్య సన్నీ లియోన్‌తో దిగిని ఫోటో ఏ రేంజ్‌లో వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.

Recommended Video

Navdeep About Allu Arjun In Ala Vaikunthapurramuloo Success Meet
బుల్లితెరపై అలా..

బుల్లితెరపై అలా..


ప్లే బాయ్ ఇమేజ్ కాస్తా అదిరింది షో వల్ల మరో స్థాయికి వెళ్లింది. అదిరిందో షోలో జడ్జ్‌గా ఉన్న సమయంలో వేణు, దన్ రాజ్, చమ్మక్ చంద్ర ఇలా ప్రతీ ఒక్కరూ నవదీప్‌పై కౌంటర్లు వేసేవారు. రాత్రి ఎక్కడుంటాడో ఎవరింట్లో ఉంటాడో.. ఎక్కడ పార్టీలు చేసుకుంటాడో అంటూ పరోక్షంగా పంచ్‌లు వేసేవారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X