త్వరలోనే గృహ ప్రవేశం.. అలీ రెజా అపార్ట్‌మెంట్ చూస్తే కళ్లు తిరగాల్సిందే

బిగ్‌బాస్ షో ఎంతో మందికి లైఫ్ ఇస్తూ ఉంటుంది. తెరపై చూసే తమ అభిమాన నటీనటుల నిజస్వరూపాలను బయట పెట్టే ఈ రియాల్టీ షో ద్వారా ఎంతోమంది హృదయాలకు దగ్గరవుతారు. అయితే అందులో కొందరూ ప్రేక్షకుల ద్వేషానికి బలవుతుంటారు. అది వేరే విషయమనుకోండి. అయితే బిగ్‌బాస్ తెలుగు మూడో సీజన్, అందులో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ మాత్రం ఓ రేంజ్‌లో హల్చల్ చేస్తున్నాడు. మొదటి రెండు సీజన్లలోని కంటెస్టెంట్ల కంటే మూడో సీజన్ సభ్యులే ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. సినీ అవకాశాలు, యాడ్స్ అంటూ బిజీగా మారగా.. కొందరు కార్లు, ఇంటిని కూడా కొనుగోలు చేసుకుంటున్నారు. ఆ సంగతేంటో ఓసారి చూద్దాం.

 బిజీగా మారిన కంటెస్టెంట్లు..

బిజీగా మారిన కంటెస్టెంట్లు..

మూడో సీజన్ కంటెస్టెంట్లు దాదాపు అందరూ కూడా ఫేమస్ అయ్యారు. వారి వారి పనుల్లో తెగ బిజీగా అయిపోయారు. అంతకు ముందు కంటే ఎక్కువగా ఛాన్స్‌లు వస్తున్నాయి. సినిమాలు, ప్రకటనలు, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ అంటూ బిజీగా మారిపోయారు.

 కొత్త కారు, కొత్తిళ్లు...

కొత్త కారు, కొత్తిళ్లు...

బిగ్‌బాస్ మూడో సీజన్ విన్నర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ సొంతిళ్లు తన కల అని.. షో ద్వారా వచ్చిన డబ్బును కొత్తిళ్లు కొనడానికే ఉపయోగిస్తానని తెలిపాడు. అయితే అంతకు ముందు బెంజ్ కారును కొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. మరోవైపు శివజ్యోతి.. కొత్తిళ్లును కొని అంగరంగ వైభవంగా గృహ ప్రవేశ వేడుకలను చేసింది.

 తాజాగా అలీ రెజా..

తాజాగా అలీ రెజా..

బుల్లితెరపై సీరియల్స్‌తో, వెండితెరపై అడపాదడపా క్యారెక్టర్స్‌తో అందర్నీ మెప్పించిన అలీ రెజా.. బిగ్‌బాగ్ షోతో మరింత దగ్గరయ్యాడు. బుల్లితెర అర్జున్ రెడ్డిగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. రాహుల్, శివజ్యోతి, రవికృష్ణలతో హౌస్‌లో స్నేహం చేసిన అలీ రెజా.. బయటకు వచ్చాక కూడా అంతే స్నేహంగా ఉంటున్నాడు. అలీ రెజా తన కొత్తింటి విశేషాలను తాజాగా షేర్ చేసుకున్నాడు.

Recommended Video

Eureka Movie Pre Release Event Part 3
మొదటి కల అదే..

మొదటి కల అదే..

సొంతిళ్లు అనేది తన మొదటి కల అని.. ఇదే మా కొత్తిళ్లు అని ఓ అపార్ట్‌మెంట్ ఫోటోను షేర చేశాడు అలీ రెజా. మొత్తానికి పూర్తయిందని, త్వరలోనే గృహ ప్రవేశం ఉందని, అందులోకి షిఫ్ట్ కాబోతున్నామని తెలిపాడు. ఇక ఈ అపార్ట్‌మెంట్‌ను చూస్తే కళ్లు తిరిగేలా ఉంది. ఇది ఆశ్రయ్ కంట్రక్షన్ వారు కట్టించినట్టు పేర్కొన్నాడు. మొత్తానికి అలీ రెజా ఓ ఇంటి వాడయ్యాడు. అలీ రెజా ప్రస్తుతం కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాలో ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X