బిగ్‌బాస్‌లో అలీ రెజా రీఎంట్రీ.. రష్యన్ డ్యాన్సర్లతో ప్లాన్ పులిహోర
Recommended Video
బిగ్‌బాస్‌లో 66, 67వ రోజు లొల్లిగా సాగింది. కెప్టెన్సీ టాస్క్ కోసం జరిగిన గేమ్ వ్యవహారం ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టింది. రాహుల్, పునర్నవి ఓ గ్రూపుగా, శ్రీముఖి, వితిక, రవికృష్ణ, వరుణ్ సందేశ్ మరో గ్రూపుగా విడిపోయారు. గ్రూపుల మధ్య భారీగా రచ్చ జరిగింది. ఇలాంటి నేపథ్యంలో అలీ రెజా వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చి అందర్నీ షాక్‌కు గురి చేశాడు. వివరాల్లోకి వెళితే..

గ్రూపులుగా విడిపోయి..
కెప్టెన్సీ టాస్క్ కోసం జరిగిన గోడ కట్టే గేమ్‌లో ఒకరినొకరు బల ప్రయోగం చేసుకోవడంతో వివాదంగా మారింది. అంతేకాకుండా గ్రూపులుగా విడిపోయి ఒకరినొకరు దూషించుకొన్నారు. గురువారం కూడా అదే తంతు కొనసాగింది. రాహుల్ గేమ్ ఆడనంటే హౌలాగానిలా చేయకు అంటూ పునర్నవి వార్నింగ్ ఇచ్చింది.

కెప్టెన్సీ టాస్క్ కోసం ఆ నలుగురు
ఇక గొడ కట్టే గేమ్ చివరకు రావడంతో తమ వంతు ప్రయత్నాలు చేశారు. బిగ్‌బాస్ ఆదేశం మేరకు శివజ్యోతి శ్రీముఖి విజేత ప్రకటించారు. ఈ గేమ్‌లో బెస్ట్ ఫెర్ఫార్మర్‌గా నిలువడం, వీలునామా శివజ్యోతి వద్ద ఉండటంతో నలుగురిని కెప్టెన్సీ టాస్క్ కోసం ఎంపిక చేశారు.

భారీ వర్షంలో డ్యాన్స్
ఇంతలో భారీ వర్షం కురియడంతో బిగ్‌బాస్‌ను బతిమిలాడి సినిమా పాటలు ప్లే చేయమని అడిగారు. బిగ్ బాస్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బంచన్ కాల్మొక్కుతా అని పేర్కొన్నారు. దాంతో పాటలు ప్లే చేయగా వాటికి డ్యాన్స్ చేసి హ్యాపీగా ఫీలయ్యారు. అలిగి కూర్చున్న రాహుల్, పునర్నవి కూడా మిగితా వారితో జత కలిశారు.

అలీ రెజా గ్రాండ్ ఎంట్రీ
ఇలా ఆట సాగుతుండగా అలీ రెజా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. రష్యన్ డ్యాన్సర్‌తో పోల్ డ్యాన్స్ చేసి షాకిచ్చాడు. ముఖానికి మాస్క్ వేసుకొని హంగామా చేశారు. డ్యాన్సర్ల సహాయంతో ఇంట్లోకి ప్రవేశించి మళ్లీ వైల్డ్ కార్డుతో ఇంట్లోకి ప్రవేశించాడు. దాంతో శివజ్యోతి, శ్రీముఖితోపాటు అందరూ సంతోషంలో మునిగిపోయారు.


Click it and Unblock the Notifications











