పునర్నవిపై అలీ ఫైర్.. కోపంలో కాలితో తన్నేశాడు.. షాకైన హౌస్‌మేట్స్

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్'.. మూడు గొడవలు.. నాలుగు ఫైటింగులుగా సాగుతోంది. గత రెండు సీజన్లతో పోల్చుకుంటే ఇందులో కంటెస్టెంట్ల మధ్య సమన్వయం కుదరడం లేదు. దీంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో సీజన్ -3లో ఎన్నో కొత్త కొత్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

మళ్లీ ఫిజికల్ టాస్కే

మళ్లీ ఫిజికల్ టాస్కే

ఈవారం వీక్లీ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్స్‌కు ‘దొంగలు దోచిన నగరం' అనే చెత్త టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. దొంగలు ముఠా, నగర వాసులు అని కంటెస్టెంట్స్‌ను రెండు గ్రూపులుగా విడగొట్టాడు బిగ్ బాస్. ఈ సారి కూడా ఫిజికల్ టాస్కే ఇవ్వడంతో హౌస్‌మేట్స్‌ను పిలిచి మరీ గాయాలు కాకుండా ఆడమని సలహా ఇచ్చాడు.

వచ్చిన రోజే కీలక పాత్ర

వచ్చిన రోజే కీలక పాత్ర

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి ప్రవేశించింది శిల్పా చక్రవర్తి. ఆమె వచ్చిన రోజు అందరితో కలిసేందుకు ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా బాబా భాస్కర్ మాస్టర్‌తో మాట్లాడడం కనిపించింది. ఇక, అదే రోజు ఆమెకు టాస్క్‌లో కీలక పాత్ర ఇచ్చారు. టాస్క్ మొత్తానికి ముఖ్యమైన దొంగలకు రాణిగా ఆమె కనిపించింది.

హింసాత్మకంగానే జరిగింది

ఈ టాస్క్ మొత్తం హింసాత్మకంగానే సాగింది. శ్రీముఖి - పునర్నవి మధ్య మాటల యుద్ధం చెలరేగింది. అంతేకాదు, వితిక కూడా మరో కంటెస్టెంట్‌పై విరుచుకు పడింది. ఆ తర్వాత వరుణ్ సందేశ్ కలుగజేసుకుని వితికను ఆపే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఆమెకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇక, రాహుల్, అలీ రేజా స్విమ్మింగ్ పూల్‌లో ఒకరినొకరు నెట్టేసుకున్నారు.

పునర్నవిపై అలీ ఫైర్

పునర్నవిపై అలీ ఫైర్

ఒకరిని మరొకరు నెట్టుకోవడం, మీద పడిపోవడం, గొడవలు పెట్టుకోవడం వంటి వాటితో ఈ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. దీంతో బుధవారం ఎపిసోడ్‌పై అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో అలీ రేజా.. పునర్నవితో గొడవ పడడం చూపించారు. అంతేకాదు, కోపంతో ఎదుటి జట్టుపై అతడు ఫైర్ అవడం కనిపించింది. అంతేకాదు, అక్కడే ఉన్న ఏదో వస్తువును కాలితో తన్నాడు. దీంతో ఈ ఎపిసోడ్ కూడా రణరంగంగా సాగనుందని అర్థం అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X