For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిగ్‌బాస్‌లో తారాస్థాయికి కుమ్ములాటలు.. అలీ రెజా రాకతో మూడో కుంపటి?

|
Bigg Boss Telugu Season 3: Episode 68 Highlights

గతంలో ఎన్నడూ లేని విధంగా నిస్తేజంగా సాగుతున్న బిగ్‌బాస్ షోలో మళ్లీ అలీ రెజా ఎంట్రీ ఇవ్వడంతో జోష్ పెరిగినట్టు కనిపిస్తున్నది. కెప్టెన్సీ టాస్క్ విషయంలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకొన్న నేపథ్యంలో అలీ ఎంట్రీ ప్రేక్షకులకు కాస్త ఊరట ఇచ్చింది. అయితే అదే జోష్ కొనసాగుతుందా? ఇప్పటికే గ్రూపులుగా విడిపోయిన ఇంటి సభ్యుల మధ్య నలిగిపోతాడా లేక శివజ్యోతితో కలిసి మరో గ్రూపు క్రియేట్ చేస్తారా అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

అవసరాల కొద్ది రిలేషన్స్

అవసరాల కొద్ది రిలేషన్స్

బిగ్ బాస్ హౌస్‌లో మొదటి నుంచి గ్రూపిజం అనేది ఉంది. ఉంటుంది కూడా. కొంతమంది కలిసి ఒకే ఇంట్లోనో, ఆఫీస్లోనో ఉంటే కొందరితో ఎక్కువగా కలిసిపోతాం. మరికొందరితో హాయ్, బాయ్ వరకు ఉంటాం. ఇదే విధంగా బిగ్ బాస్ హౌస్లోనూ. బయట ప్రపంచంతో సంబంధాలను తెంచేసి.. ఒకే ఇంట్లో పడేసిన వ్యక్తుల్లో అందరూ అందరికీ నచ్చరు. అందులో కొందరు అవసరానికి బంధాలను ఏర్పరుచుకుంటారు. మరి కొందరు హార్ట్ ఫుల్ గా రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. కేవలం అవసరానికి రిలేషన్ అని ఉంటే చివరకు ఒక్కరిగానే మిగిలిపోతారు.

వరుణ్ బ్యాచ్ ఎప్పుడూ ప్రత్యేకమే..

వరుణ్ బ్యాచ్ ఎప్పుడూ ప్రత్యేకమే..

హౌస్లో మొదట్నుంచీ స్నేహితులుగా ఉన్నది వరుణ్, వితికా, రాహుల్, పునర్నవిలే. ఎన్ని గొడవలు, డిస్టర్బెన్స్ వచ్చిన మళ్లీ ఒక్కటయ్యారు. అవుతూనే ఉంటారు. ఎందుకుంటే వారు గేమ్ కోసం దగ్గరవ్వలేదు కాబట్టి. గేమ్ ఆడేటప్పుడు రిలేషన్స్ పట్టించుకోకున్నా.. ఆ హౌస్లో ఉన్నంతకాలం మన బాధ, సంతోషాలను పంచుకోవడానికి స్నేహితులు ఉండాలి. అయితే వీరంతా కలిసి ఉండటంతో హౌస్లో అందరి దృష్టి వీరిపైనే పడేది. వీరికి వ్యతిరేకంగా శ్రీముఖి ఒక బ్యాచ్‌ను సిద్దం చేసుకుందామని అనుకుంటున్నా.. అది నెరవేరడం లేదు. బాబా భాస్కర్ మాష్టర్ ను తన గ్రిప్‌లో పెట్టుకోవాలని చూస్తున్నా అది కుదరడం లేదు..

శ్రీముఖికి దూరంగా మహేష్

శ్రీముఖికి దూరంగా మహేష్

మొదట్లో బాబా భాస్కర్, మహేష్, జాఫర్, శ్రీముఖి ఒక జట్టులా కనిపించేవారు. తీరా చూస్తే రెండోవారంలో జాఫర్ బయటకు వెళ్లిపోయాడు. ఇక అక్కడి నుంచి మిగతా ముగ్గురు మరింత దగ్గరయ్యారని అనిపించింది. అయితే కాలగమనంలో మహేష్, బాబాలు విడదీయలేనంతగా క్లోజ్ అయ్యారు. మహేష్ మాటలకు బాబా ప్రభావితమవుతున్నాడని శ్రీముఖి పలువురితో చెప్పుకొచ్చింది. వారిద్దరి మధ్య గ్యాప్ వచ్చేలా చేసింది. అలా అలా గడుస్తూ వస్తుండగా.. శ్రీముఖికి మహేష్ దూరంగా ఉండే పరిస్థితి వచ్చింది.

మూడో గ్రూపుకు రంగం సిద్ధం

మూడో గ్రూపుకు రంగం సిద్ధం

ఇప్పటికే రెండు గ్రూపులుగా విడిపోయిన బిగ్‌బాస్ ఇంటిలో మూడో గ్రూపుకు రంగం సిద్ధమైంది. అలీ రెజా రాకతో ఇప్పటి వరకు తటస్థంగా ఉన్న శివజ్యోతి యాక్టివ్ కానున్నది. అంతేకాకుండా బిగ్‌బాస్ చివరి అంకానికి చేరుకొంటున్న నేపథ్యంలో ఇంకా ఫ్రెండ్‌షిప్ లాంటి వ్యవహారాలు పక్కన పెట్టి.. సెలబ్రిటీలు అసలు రూపాన్ని బయటపెట్టే పరిస్థితి కనిపిస్తున్నది. రానున్న రోజుల్లో షో ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.

English summary
Bigg Boss 3 Telugu reality show 66, 67 day with high emotional content. on 6th weekend funny, furious moments registred in the house. Latest elimination of Ali Reza given shock to television audience. On monday, Celebraties are in shock. But they overcome from that, participated in nomination for the Elimination. This week shilpa Chakravarthy eleminated.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more