Ali Reza: 'బిగ్ బాస్' దెబ్బ… రెండేళ్లు బ్యాన్.. హార్ట్ ఎటాక్ వచ్చి పొడిపోయా.. సీక్రెట్స్ బయట పెట్టిన అలీ రెజా
అలీ రెజా అనే నటుడు టాలీవుడ్ లో ముందు నుంచే అనేక సినిమాలు చేస్తూ వచ్చాడు కానీ సరైన గుర్తింపు అయితే దక్కలేదు. అయితే ఆయన 'బిగ్ బాస్' రియాలిటీ షోలో పాల్గొనడం వలన బాగా ఫేమస్ అయ్యాడు. అయితే ఆ బిగ్ బాస్ తన కెరీర్ కు పెద్ద దెబ్బ వేసిందని తాజాగా అలీతో సరదాగా పాల్గొన్న ఆయన వెల్లడించారు. ఆయన తన స్నేహితుడు, నటుడు అమిత్ తో కలిసి పాల్గొని అనేక విషయాలను పంచుకున్నారు. ఆ విషయాలు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం.

కెరీర్ మీద పెద్ద దెబ్బ
బిగ్ బాస్ షోకి వెళ్లి వచ్చిన తర్వాత చాలా మందికి సినిమాల్లో అవకాశాలు, మీడియాలో పాపులార్టీ జనాల్లో మంచి క్రేజ్ దక్కింది. అంటే ఏదేమైనా ఆ షో వాళ్ళ కెరీర్‌కు హెల్ప్ అయ్యింది. అయితే... హైదరాబాద్ కుర్రాడు అలీ రెజా కెరీర్ కు మాత్రం మైనస్ అయ్యిందని అంటున్నాడు. ఈ షో తన కెరీర్ మీద పెద్ద దెబ్బ కొట్టిందని చెప్పుకొచ్చాడు అలీ రెజా.

రామ్ చరణ్ స్నేహితుల్లో ఒకరిగా
తన కెరీర్ కు సంబంధించి అనేక విషయాలు పంచుకున్న అలీ రెజా తన మీద రెండేళ్లు బ్యాన్ విధించారని అది విని తనకు హార్ట్ ఎటాక్ వచ్చిందని అలీ రెజా వెల్లడించారు. 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళడానికి ముందు తెలుగులో అలీ రెజా కొన్ని సినిమాల్లో హీరోగా నటించడమే కాక కొన్ని సీరియల్స్ కూడా చేశారు. హీరోగా చేసిన సినిమాలు కూడా ఆయనకు గుర్తింపు తెచ్చి పెట్టలేదు కానీ 'ధ్రువ' సినిమాలో రామ్ చరణ్ స్నేహితుల్లో ఒకరిగా నటించడం ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టింది.

'బిగ్ బాస్' హౌస్ మూడో సీజన్ లో
'బిగ్ బాస్' హౌస్ మూడో సీజన్ లో అలీ రెజా ఒక కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే అందులో కనిపించిన తరువాత అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన 'వైల్డ్ డాగ్' మినహా మరో సినిమాలో కనిపించలేదు. ఎందుకంటే... అతని మీద తెలుగు తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ రెండేళ్లు బ్యాన్ విధించింది. అందువల్ల, సినిమాల్లో కనిపించడం తగ్గినట్టు 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న అలీ రెజా వెల్లడిచారు.

నిర్మాతల మండలిలో కంప్లైంట్
అలీ రెజా చెప్పిన దాని ప్రకారం... తప్పు అతని వైపు కూడా ఉంది. 'బిగ్ బాస్ 3'లో కంటెస్టెంట్‌గా వెళ్ళడానికి ముందు ఒక సినిమా చేస్తున్నారు. అయితే అనూహ్యంగా హౌస్‌లోకి వెళ్ళడంతో ఆ సినిమా చిత్రీకరణకు అంతరాయం కలిగింది. దాంతో వాళ్ళు నిర్మాతల మండలిలో కంప్లైంట్ చేశారు.
Recommended Video


ఈ సినిమాలతో
ఈ క్రమంలోనే అలీ రెజా మీద రెండేళ్లు బ్యాన్ విధించారని అంటున్నారు. అయితే ఆ సినిమా ఏది? ఎవరు కంప్లైంట్ చేశారు? అనేది 'ఆలీతో సరదాగా' షోలో అలీ రెజా వెల్లడించే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం అలీ రెజా ఆది సాయి కుమార్ 'CSI Sanatan' సినిమాలో నటిస్తున్నారు. కృష్ణవంశీ 'రంగ మార్తాండ' సినిమాలో ఒక రోల్ చేయగా ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఇక ఈ సినిమాలతో కాస్త క్రేజ్ తెచ్చుకుంటాడేమో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











