అత్యాచార ఆరోపణలు.. యాంకర్ ప్రదీప్‌కు పెరుగుతున్న మద్దతు.. అండగా నిలిచిన అలీ రెజా
సోషల్ మీడియాలో ఓ యువతి చేసిన ఆరోపణలు ఎంతగా వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. దాదాపు 139 మంది ఐదు వేల సార్లు అత్యాచారం చేశారని, కొన్నేళ్ల నుంచి ఇలా చేస్తున్నారని యువతి వాపోయింది. ఈ మేరకు సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందులో యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు వంటి పేర్లు బయటకు వచ్చాయి. సదరు యువతి చేసిన ఆరోపణలపై ప్రదీప్, కృష్ణుడు స్పందించారు.

పోరాటాన్ని ప్రారంభిస్తున్నా.
ఓ యువతి చేసిన ఆరోపణలతో తన పేరును ఇష్టమొచ్చినట్టు వాడటం, నిజానిజాలు తెలుసుకోకుండా వార్తలు రాయడంపై ప్రదీప్ ఫైర్ అయ్యాడు. ఆ అమ్మాయి ఎవరో తనకు తెలీదని ప్రదీప్ పేర్కొన్నాడు. అన్యాయం ఎవరికీ జరిగిన న్యాయం జరగాలన్నాడు. తన పేరును అన్యాయంగా ఇలా వాడారు.. తనకూ న్యాయం జరగాలని, వీటిపై తాను పోరాటం చేస్తానని పేర్కొన్నాడు.

సోషల్ ట్రోలింగ్..
నిజానిజాలు తెలియకుండా కొందరు ఆ ఆరోపణలనే నిర్దారణ చేసుకుని అవే నిజాలుగా ప్రచురిస్తున్నారని ప్రదీప్ ఫైర్ అయ్యాడు. సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారు.. ఫ్యామిలీని కూడా లాగుతున్నారు.. దయచేసి సోషల్ ట్రోలింగ్ చేయకండని ప్రదీప్ వేడుకున్నాడు.

యాంకర్ రవి సపోర్ట్..
సదరు యువతి చేసిన ఆరోపణలను ఖండించాడు ప్రదీప్. ఈ మేరకు యాంకర్ రవి ప్రదీప్‌కు మద్దతు తెలిపాడు. ప్రదీప్ చెప్పినట్టుగా.. సోషల్ ట్రోలింగ్ చేయకండి అని కోరాడు. నిజం బయటకు వచ్చే వరకు ఎదురుచూడండి.. నేను ప్రదీప్‌కు అండగా నిలబడతాను అంటూ పిడికిలి బిగించిన ఫోటోను రవి షేర్ చేశాడు.

అండగా అలీ రెజా..
యాంకర్ ప్రదీప్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం, అతనిపై ట్రోలింగ్ జరగడంపై అలీ రెజా స్పదించాడు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని తాను ప్రదీప్‌కు అండగా ఉంటానని అలీ రెజా పేర్కొన్నాడు. సోషల్ ట్రోలింగ్ చేయకండి అని అలీ రెజా కోరాడు.
Recommended Video

ఖండించిన కృష్ణుడు..
యువతి చెప్పిన లిస్ట్‌లో తన పేరును చూసి షాక్ అయ్యానని నటుడు కృష్ణుడు పేర్కొన్నాడు. ఆ అమ్మాయి ఎవరో తనకు తెలీదని, అవన్నీ అవాస్తవాలే అని కొట్టి పారేశాడు. ఇరవై యేళ్లుగా ఇండస్ట్రీలో ఎలాంటి రిమార్క్ లేకుండా ఉన్నానని, తానెంటో అందరికీ తెలుసని కృష్ణుడు చెప్పిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











