»   » 'కండీషన్స్ అప్లై' అంటున్న కమిడియన్ అలీ

'కండీషన్స్ అప్లై' అంటున్న కమిడియన్ అలీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'ఆలీ 369' పేరిట 143 ఎపిసోడ్‌లతో తెలుగు ప్రేక్షకులను అలరించిన అలీ మరోసారి 'ఆలీతో జాలీగా' ... కండిషన్స్‌ అప్లై అంటూ వస్తున్నారు.ఇంతకీ ఆ కండిషన్స్ ఏమిటీ అంటే చూస్తే తెలుస్తుంది. మొన్న మంగళవారం నుంచి రాత్రి 9.30 గంటలకు 'ఈటీవీ'లో ప్రసారమవటం మొదలైంది.వినూత్నమైన వినోద కార్యక్రమాలతో, సరదా సరదా ఆటలతో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న 'ఈటీవీ' నుంచి వస్తోన్న మరో వైవిధ్యమైన కార్యక్రమమిది. అసలీ కార్యక్రమమేంటి... ఇందులోని సరదాలేంటో అలీ మాటల్లోనే తెలుసుకుందాం.

' ALI THO JOLLYGA' comedy show started

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అలీ మాట్లాడుతూ... ''టీవీ ప్రేక్షకులకు కండిషన్స్‌ లేని ఆనందాన్ని, సరదాల్ని ఇవ్వడానికి నేను మళ్లీ సిద్ధమయ్యాను. ఈటీవీ - అలీ... ఈ జోడీ ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు 'ఆలీ 369' పేరుతో మంచి వినోదాల విందు అందించింది. ఈ కార్యక్రమం ఆపేసిన తర్వాత నేను ఎక్కడికెళ్లినా అందరూ అదే అడిగేవారు. మూడున్నరేళ్లపాటు 143 ఎపిసోడ్‌లు చేయగలిగాం అంటే ప్రేక్షకుల ఆదరాభిమానాల వల్లే.

మళ్లీ ఇప్పుడు 'ఆలీతో జాలీగా' అంటూ వస్తున్నాను. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చేలా కాన్సెప్ట్‌ను సిద్ధం చేశాం. సాధారణ గేమ్‌ షోల్లో అన్ని రౌండ్‌లు ఆడి ఎవరు గెలిస్తే వారికి ప్రైజ్‌మనీ ఇస్తారు. ఇందులో మాత్రం ఏ రౌండ్‌కు ఆ రౌండ్‌కు విజేత ఉంటారు. ఎప్పటికప్పుడు ప్రైజ్‌ మనీ ఇచ్చేస్తాం. 'అలీ 369' విజయంలో 'ఐటెమ్‌ రాజా' రౌండ్‌ది ప్రముఖ స్థానం. ప్రతి ఎపిసోడ్‌లో ఒక్కో పాత్రలో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాను. ఈ కార్యక్రమంలోనూ ఆ రౌండ్‌ను కొనసాగిస్తున్నాం'' అన్నారు.

' ALI THO JOLLYGA' comedy show started

ఇక నేను యాంకర్‌ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. ఈటీవీ ద్వారా తొలిసారి నన్ను నేను బుల్లి తెరపై యాంకర్‌గా చూసుకున్నాను. నాకు బుల్లితెర, వెండితెర రెండూ ఒకటే. ఒక టీవీ షో విజయం సాధించాలంటే ప్రేక్షకుడి ఆదరణ ఎంత ముఖ్యమో, ఆ కార్యక్రమాన్ని నిర్వహించే సంస్థ విధానమూ అంతే ముఖ్యం. చక్కటి కార్యక్రమాలను ప్రేక్షకులకు అందించే ఆలోచనలు చేయడంలో ఈటీవీ ముందుంటుంది.

ఈటీవీ నిర్మాణంలో జ్ఞాపిక ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ 'ఆలీతో జాలీగా' నిర్వహిస్తోంది. ఆటలకు ఆటలు, పాటలకు పాటలు, డ్యాన్స్‌లు... ఇలా సందడి చేయడానికి నేను, మా పార్టిసిపెంట్స్‌ సిద్ధంగా ఉన్నార. మరి చూసి ఆనందించడానికి మీరూ సిద్ధమవ్వండి.

'ఆలీతో జాలీగా'లో వినోదం, ఉత్కంఠ, సరదా మేళవించిన నాలుగు రౌండ్‌లుంటాయి. ఏ రౌండ్‌కా రౌండ్‌లో విజేతను ప్రకటిస్తారు. ఆ వెంటనే ప్రైజ్‌ మనీ ఇస్తారు. ఒక్కో ఎపిసోడ్‌కు మొత్తం రూ. పది లక్షల బహుమతి. 'ఆలీ 369'లోని ఐటెమ్‌ రాజా రౌండ్‌ ఇందులోనూ కొనసాగుతుంది. ప్రతి మంగళవారం రాత్రి 9.30కు ఈటీవీలో ప్రసారమవుతుంది.

English summary
Ee tv Telugu Channel giving a new and innovative programs to the audiences and in the same way sew show is going to start from this tuesday. Ali Tho Jollyga is a new comeday show started from 24th March 2015 tuesday Ali Tho Jollyga telecasting time evry tueday at 9.30 PM.
Please Wait while comments are loading...